Sat Dec 07 2024 20:30:25 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: స్టార్ గుర్తు ఉన్న 500 రూపాయల నోట్లను బ్యాంకుల్లో తీసుకోవడం లేదనే వాదనలో ఎలాంటి నిజం లేదు.
*గుర్తు ఉన్న 500 రూపాయల నోట్లు మార్కెట్లో
Claim :
*గుర్తు ఉన్న 500 రూపాయల నోట్లు మార్కెట్లో చలామణిలోకి వచ్చాయి. వాటిని బ్యాంకులు తీసుకోవడం లేదుFact :
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. వీటిని ఎంచక్కా వాడుకోవచ్చు.
మార్కెట్ లోకి ఎప్పుడైనా కొత్త నోట్లు వచ్చాయంటే చాలు కొందరు ఆ నోట్లను చాలా విచిత్రంగా చూస్తూ ఉంటారు. నోట్ల రద్దు జరిగిన తర్వాత 2000 రూపాయల నోటు మార్కెట్లోకి రాగానే ఎంత హంగామా చేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత 2000 రూపాయల నోటును రద్దు చేసిన తర్వాత ఎంతో మంది షాక్ అయ్యారనుకోండి.
మే 19, 2023న, 2,000 రూపాయల కరెన్సీ నోట్లను ఉపసంహరించుకోవాలని RBI సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది. నాణ్యతాపరమైన ఆందోళనలు, నవంబర్ 2016 డీమోనిటైజేషన్ తర్వాత ప్రవేశపెట్టిన ఈ నోట్ల ఉద్దేశ్యాన్ని నెరవేర్చడంతో 2000 రూపాయల నోట్లను వెనక్కు తీసుకోవాల్సి వచ్చిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. రద్దు చేసినప్పటికీ 2,000 నోట్లు చట్టబద్ధమైన టెండర్‌గా కొనసాగుతున్నాయని, వాటిని ఆర్బీఐ కి చెందిన 19 కార్యాలయాల్లో భౌతికంగా మార్చుకోవచ్చని, బ్యాంక్ ఖాతాల్లోకి క్రెడిట్ కోసం పోస్ట్ ద్వారా పంపవచ్చని సెంట్రల్ బ్యాంక్ అప్పట్లో తెలిపింది.
సెప్టెంబర్ 2024లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేసిన ప్రకటన ప్రకారం 2,000 నోట్లలో 97.96% బ్యాంకింగ్ వ్యవస్థకు తిరిగి వచ్చినట్లు తెలిపింది. రూ.2,000 నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు మే 19, 2023న ప్రకటించే సమయానికి మార్కెట్లో రూ.3.56 లక్షల కోట్ల విలువైన రూ.2,000 నోట్లు ఉండగా, సెప్టెంబర్ నెల నాటికి రూ.7,261 కోట్లకు తగ్గిందని RBI తెలిపింది.
ప్రస్తుతం భారతదేశంలో అందుబాటులో ఉన్న అధిక విలువైన నోటు 500 రూపాయలు మాత్రమే. ఇక ఈ నోట్లను ఎప్పటికప్పుడు మార్కెట్ అవసరాలను బట్టి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముద్రిస్తూ వస్తూ ఉంటుంది.
తాజాగా 500 రూపాయల నోటుకు సంబంధించి ఓ వార్త వైరల్ అవుతూ వస్తోంది.
"*గుర్తు ఉన్న 500 నోట్లు మార్కెట్లో చలామణిలోకి వచ్చాయి. అలాంటి నోటు ఇండస్ఇండ్ బ్యాంక్ నుండి తిరిగి వచ్చింది. ఇది నకిలీ నోటు.
ఈ రోజు కూడా ఒక కస్టమర్ నుండి 2-3 అటువంటి నోట్లను స్వీకరించారు, కానీ వెంటనే దానిని తిరిగి ఇచ్చారు. ఈ నోటు ఉదయం ఎవరో ఇచ్చారని కస్టమర్ కూడా చెప్పాడు.
మార్కెట్లో నకిలీ నోట్లతో తిరిగే వారి సంఖ్య పెరిగింది.
జాగ్రత్త అందరిలో అవగాహన కల్పించడానికి మరియు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండటానికి దయచేసి ఈ సందేశాన్ని ఇతర సమూహాలు & స్నేహితులు & బంధువులకు ప్రసారం చేయండి." అంటూ పోస్టులను పెడుతూ ఉన్నారు.

ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న పోస్టులలో ఎలాంటి నిజం లేదని మేము కనుగొన్నాం.
వైరల్ ఫోటోను మేము రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఇతర భాషల్లో ఇదే వాదనతో గతంలో పోస్టులు పెట్టారని మేము గుర్తించాం.
ప్రస్తుతం తెలుగు టెక్స్ట్ తో ఏదైనా మెసేజీ వైరల్ అవుతోందో, అదే మెసేజీ గతంలో కూడా వైరల్ అయిందని అది కూడా ఇతర భాషల్లో అని స్పష్టంగా తెలుస్తోంది.
ఇక సంబంధిత కీవర్డ్ సెర్చ్ చేయగా PIB Fact Check టీమ్ డిసెంబర్ 7, 2023న వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎలాంటి నిజం లేదని స్టార్ బొమ్మ ఉన్న 500 రూపాయల నోట్లు 2016 నుండి చలామణీలో ఉన్నాయని స్పష్టం చేస్తూ ఎక్స్ లో పోస్టు పెట్టింది.
2016 లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టార్ ఉన్న 500 రూపాయల నోట్లను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. నంబర్ ప్యానెల్లో కొన్ని క్యాప్షన్ చేసిన బ్యాంక్ నోట్లలో అదనపు అక్షరం ‘*’ (నక్షత్రం) ఉంటుంది. 'స్టార్' నోట్లను కలిగి ఉన్న నోట్ ప్యాకెట్లను సులభంగా గుర్తించడం కోసం అటువంటి ప్యాకెట్లపై ఉన్న బ్యాండ్లు ప్యాకెట్లో ఈ నోట్ల ఉనికిని స్పష్టంగా సూచిస్తాయని వివరించారు. 500 రూపాయల డినామినేషన్లో ‘స్టార్’ నోట్లను తొలిసారిగా విడుదల చేస్తున్నామని, 10, 20, 50, 100 డినామినేషన్‌లోని ‘స్టార్’ నోట్లు ఇప్పటికే చెలామణిలో ఉన్నాయని తెలిపారు.
https://rbi.org.in/commonman/
స్టార్ గుర్తు ఉన్న నోట్ల గురించి జరుగుతున్న ప్రచారాన్ని గతంలో పలు ఫ్యాక్ట్ చెక్ సంస్థలు ఖండిస్తూ కథనాలను విడుదల చేశాయి. ఆ కథనాలను ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.
స్టార్ సిరీస్ బ్యాంక్ నోట్లను జారీ చేయడానికి కారణం ప్రింటింగ్ ప్రక్రియలో లోపభూయిష్టంగా ముద్రించిన నోట్లను తిరిగి భర్తీ చేయడమే. లోపాన్ని గుర్తించినప్పుడు, ప్యాకెట్లోని సీక్వెన్షియల్ ఆర్డర్ నిర్వహిస్తారని నిర్ధారిస్తూ, అదే క్రమ సంఖ్యను కలిగి ఉన్న కొత్త నోట్లతో ఈ నోట్లు భర్తీ చేస్తారు. స్టార్ సిరీస్ నంబరింగ్ సిస్టమ్ అంతర్జాతీయ ఉత్తమ పద్ధతులను అనుసరించడానికి, ప్రింటింగ్ ప్రెస్‌లలో ఖర్చు-ప్రభావాన్ని నిర్ధారించడానికి RBI చేసిన ప్రయత్నాలలో ఒక భాగం.
మీకు స్టార్ సిరీస్ నోట్లతో కూడిన బ్యాంక్ నోట్ కనిపిస్తే ఆందోళన చెందకండి. వాటిని చట్టబద్ధమైన టెండర్‌గా ఉపయోగించవచ్చు. స్టార్ సిరీస్ నోట్స్ సాధారణ నోట్స్ లాగానే ఉంటాయి. హాయిగా వాడుకోవచ్చు.
కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.

Claim : *గుర్తు ఉన్న 500 రూపాయల నోట్లు మార్కెట్లో చలామణిలోకి వచ్చాయి. వాటిని బ్యాంకులు తీసుకోవడం లేదు
Claimed By : social media users
Claim Reviewed By : Telugupost
Claim Source : social media
Fact Check : False
Next Story