Thu Mar 26 2026 02:05:35 GMT+0530 (India Standard Time)
ఫ్యాక్ట్ చెక్: ఎల్పీజీ బుకింగ్ గడువును 35 రోజులకు ప్రభుత్వం పెంచలేదు
ఎల్పీజీ బుకింగ్ గడువును 35 రోజులకు ప్రభుత్వం పెంచలేదు

Claim :
ఎల్పీజీ బుకింగ్ గడువును 35 రోజులకు ప్రభుత్వం పెంచిందిFact :
అలాంటి నిర్ణయం ప్రభుత్వం తీసుకోలేదు
అమెరికా, ఇరాన్ మధ్య జరుగుతున్న ఘర్షణల వల్ల నౌకా రవాణాకు ఆటంకం కలిగింది. దీనివల్ల భారత్ లో ఎల్పీజీ కొరత ఏర్పడకుండా ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. చాలా చోట్ల గ్యాస్ ఏజెన్సీలు స్టాక్ లేదని చెప్పడం లేదా బుకింగ్ అయినప్పటికీ డెలివరీలో జాప్యం జరుగుతున్నాయి. గ్యాస్ ఇన్వాయిస్లో లేని అదనపు రుసుములను చెల్లించవద్దని, అలాగే డెలివరీ నిరాకరించినా లేదా అనవసరంగా బుకింగ్ క్యాన్సిల్ చేసినా వెంటనే ఫిర్యాదు చేయాలని సూచించింది.
ప్రస్తుతం ఉన్నపరిస్థితుల వల్ల గ్యాస్ సరఫరాలో కొంత జాప్యం జరుగుతోంది. దీనిని ఆసరాగా చేసుకుని కొందరు లోకల్ డిస్ట్రిబ్యూటర్లు కృత్రిమ కొరతను సృష్టించి, వినియోగదారుల నుండి అదనపు నగదు వసూలు చేస్తున్నారు. ఇప్పుడు పలు రూమర్లు కూడా ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి.
సాధారణ డొమెస్టిక్ కనెక్షన్ కలిగిన వినియోగదారులు, 14.2 కేజీల సిలిండర్‌ను బుక్ చేసిన తర్వాత, తదుపరి బుకింగ్ కోసం కనీసం 35 రోజులు వేచి ఉండాలి. గతంలో ఈ గ్యాప్ 25 రోజులుగా ఉండేది. అంటే మీ గ్యాస్ పొయ్యి మీద సిలిండర్ త్వరగా అయిపోయినప్పటికీ, ఆ 35 రోజుల గడువు ముగిసే వరకు సిస్టమ్ కొత్త బుకింగ్‌ను అంగీకరించదని కొన్ని కథనాలు వచ్చాయి.
వైరల్ కథనాలకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ను ఇక్కడ చూడొచ్చు
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
ఎల్పిజి బుకింగ్ నిబంధనలలో ఎటువంటి మార్పులు ప్రభుత్వం చేయలేదు, బుకింగ్ వ్యవధి పట్టణ ప్రాంతాలలో 25 రోజులు, గ్రామీణ ప్రాంతాలలో 45 రోజులుగానే కొనసాగుతుంది.
సంబంధిత కీవర్డ్స్ తో సెర్చ్ చేయగా.. ఆన్లైన్లో ప్రచారంలో ఉన్న వాదనలు నిజం కాదని స్పష్టం చేస్తూ, మార్చి 25న ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పిఐబి) ఒక పత్రికా ప్రకటనను విడుదల చేసినట్లు మేము కనుగొన్నాము.
కేంద్రం కూడా అందుకు సంబంధించిన ప్రకటనను విడుదల చేసింది. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదంటూ పెట్రోలియం, సహజవనరుల శాఖ స్పష్టం చేసింది.
“కొన్ని వార్తా నివేదికలు, సోషల్ మీడియా పోస్టులు, PMUY కనెక్షన్లకు 45 రోజులు, నాన్-PMUY సింగిల్ బాటిల్ కనెక్షన్లకు 25 రోజులు, నాన్-PMUY డబుల్ బాటిల్ కనెక్షన్లకు 35 రోజుల చొప్పున LPG రీఫిల్ బుకింగ్ గడువులను సవరించినట్లు ప్రభుత్వ దృష్టికి వచ్చింది. అలాంటి మార్పులేవీ చేయలేదని ఆ పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. కనెక్షన్ రకంతో సంబంధం లేకుండా, ప్రస్తుత రీఫిల్ బుకింగ్ గడువులు యథాతథంగా కొనసాగుతాయి. పట్టణ ప్రాంతాలలో 25 రోజులు, గ్రామీణ ప్రాంతాలలో 45 రోజులు కొనసాగుతున్నాయి.” అని స్పష్టం చేశారు.
అయితే మార్చి 2026 లో ఎల్పీజీ సిలిండర్ల బుకింగ్ విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. బుకింగ్ గడువును మార్చుతూ నిర్ణయం తీసుకుంది. సిలిండర్ బుకింగ్ విషయంలో సిలిండర్‌కు సిలిండర్‌కు మధ్య ఉన్న బుకింగ్ గడువును 21 నుండి 25 రోజులకు పెంచింది. అందుకు సంబంధించిన కథనాలను ఇక్కడ చూడొచ్చు.
కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim : ఎల్పీజీ బుకింగ్ గడువును 35 రోజులకు ప్రభుత్వం అలాంటి నిర్ణయం ప్రభుత్వం తీసుకోలేదు
Claimed By : Social Media Users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Social Media
Fact Check : False
Next Story

