ఫ్యాక్ట్ చెక్: జాతీయ రహదారులపై టూ-వీలర్లకూ టోల్ ఛార్జీలు వసూలు చేయనున్నట్లు జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు.
జాతీయ రహదారులపై ఇకపై టూ-వీలర్లకూ టోల్ ఛార్జీలు

Claim :
జాతీయ రహదారులపై ఇకపై టూ-వీలర్లకూ టోల్ ఛార్జీలు వసూలు చేస్తారుFact :
అలాంటి నిర్ణయం తీసుకోలేదని NHAI తెలిపింది
భారతదేశంలో FASTag వినియోగదారులు త్వరలోనే మరింత సౌకర్యవంతమైన, సంవత్సరానికి ఒకసారి వార్షిక పాస్‌ను అందించనుంది. భారత రహదారులపై ఇబ్బంది లేకుండా ప్రయాణించడానికి వీలుగా FASTag వార్షిక పాస్‌ను ప్రారంభిస్తున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఇప్పటికే ప్రకటించింది. వార్షిక పాస్ ధర రూ.3,000తో ఈ సంవత్సరం ఆగస్టు 15 నుండి కొనుగోలుకు అందుబాటులోకి వస్తుంది. ఈ పాస్ కార్లు, జీపులు, వ్యాన్లు వంటి వాణిజ్యేతర ప్రైవేట్ వాహనాలకు మాత్రమే చెల్లుతుంది.
"📢Big Breaking..
🔹ఇకపై.. బైకులకు టోల్ గేట్ ఫీజు..
భారతదేశంలో.. జూలై 15, 2025 నుండి, జాతీయ రహదారులపై ద్విచక్ర వాహనాలకు టోల్ మినహాయింపు ముగియబోతోందని NHAI మరియు రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఇకపై.. హైవే ఎంట్రీ పాయింట్ల వద్ద టోల్ చెల్లించడానికి సిద్ధంగా ఉండండి.." అంటూ మరొక యూజర్ చేసిన పోస్టును మేము గుర్తించాం.
జాతీయ రహదారులపై ద్విచక్ర వాహనాలపై టోల్ పన్నును ప్రవేశపెట్టినట్లు మీడియాలో వస్తున్న తప్పుడు నివేదికలను కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ కూడా ఖండించారు. అటువంటి ప్రతిపాదన ఏదీ లేదని, ద్విచక్ర వాహనాలకు పూర్తి టోల్ మినహాయింపు మారదని గడ్కరీ స్పష్టం చేశారు. ద్విచక్ర వాహనాలకు టోల్ మినహాయింపు పూర్తిగా కొనసాగుతుందని ఆయన తన ట్విట్టర్ ఖాతాలో స్పష్టం చేశారు.