Sat Dec 14 2024 17:14:44 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: ప్రధాని నరేంద్ర మోదీ పక్కన ఉన్న మహిళ ఎస్.పి.జి. కమాండర్ కాదు
మోదీ పక్కన ఉన్నది ఎస్పీజీ కమాండో కాదని.. ఆమె
Claim :
ప్రధాని నరేంద్ర మోదీకి మహిళా ఎస్.పి.జి. కమాండర్ రక్షణ కల్పిస్తున్నారుFact :
ఆ మహిళ ఎస్.పి.జి. కమాండర్ కాదు.
ప్రధానమంత్రి, మాజీ ప్రధానులు, వారి కుటుంబ సభ్యులకు భద్రత కల్పించేందుకు స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (SPG) ఏర్పాటు చేశారు. SPG అధికారులు నాయకత్వం, వృత్తి నైపుణ్యం, రక్షణలో ప్రత్యేక శిక్షణ పొంది ఉంటారు. SPG చట్టంలోని సెక్షన్ 4 ప్రకారం స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (SPG) ఏర్పాటు చేయబడింది.
ఏప్రిల్ 8, 1985న, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్య తర్వాత స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ను స్థాపించారు. ఇది కేవలం భారత ప్రధానిని రక్షించడానికి మాత్రమే అంకితం చేసిన విభాగం. కొన్ని సందర్భాల్లో వారి కుటుంబ సభ్యులకు కూడా భద్రతను అందిస్తూ ఉంటారు. SPG ఆవిర్భావం 1985లో బీర్బల్ నాథ్ కమిటీ సిఫార్సు కారణంగా జరిగింది. భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు SPG తన విధానాన్ని ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటూ వెళుతోంది. ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారి నేతృత్వంలోని SPG ఇతర భద్రతా సంస్థలు, రాష్ట్ర పోలీసు బలగాల సహకారంతో పని చేస్తుంది.
భారతీయ జనతా పార్టీ ఎంపీ, నటి కంగనా రనౌత్ ఇటీవల షేర్ చేసిన ఫోటోలో ప్రధాని పక్కన ఓ మహిళ ఉన్నారు. పార్లమెంటు వెలుపల ప్రధాని నరేంద్ర మోదీ వెనుక మహిళ నిలబడి ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ముదురు రంగు సూట్లో ఉన్న మహిళ ముందు ప్రధాని మోదీ నడుచుకుంటూ వెళ్తున్నట్లు చిత్రం ఉంది. కంగనా రనౌత్ ఈ చిత్రానికి "లేడీ SPG" అని శీర్షిక పెట్టారు.
పలువురు సోషల్ మీడియా యూజర్లు ఇది నిజమేనని భావించారు.
మోదీజీ మహిళా ఎస్పీజీ రక్షణలో ఉన్నారంటూ పలువురు పోస్టులు పెట్టారు.
వైరల్ పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఆమె మహిళా ఎస్పీజీ అధికారి కాదు.
మహిళా కమాండోలు కొన్నేళ్లుగా SPG లో అంతర్భాగంగా ఉన్నారు. SPGలో ప్రస్తుతం 100 మందికి పైగా మహిళా కమాండోలు ఉన్నారు.
పార్లమెంటు దగ్గర తీసిన వైరల్ చిత్రంలో ప్రధాని నరేంద్ర మోదీ పక్కన ఒక మహిళా అధికారి నడుస్తున్నట్లు చూపిస్తుంది.
ఈ ఫోటోను గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. ఆమె SPG కమాండో కాదంటూ పలు మీడియా సంస్థలు కథనాలను ప్రచురించాయి.
NDTV నివేదిక ప్రకారం, కంగనా షేర్ చేసిన చిత్రంలో కనిపిస్తున్న మహిళా అధికారి SPG కమాండో కాదు. ఆమె CRPF లో అసిస్టెంట్ కమాండెంట్‌గా ఉన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము PSO అని తెలుస్తోంది.
దేశంలోని సాయుధ దళాలలో మహిళలు అత్యున్నత స్థాయిలో ఉన్నారు. మహిళా అధికారులు ఇప్పుడు ఎయిర్ డిఫెన్స్, ఆర్డినెన్స్, ఇంటెలిజెన్స్, సర్వీస్ కార్ప్స్ వంటి విభాగాలను కమాండ్ చేస్తున్నారు.
మహిళా కమాండోలు సంవత్సరాలుగా SPG లో భాగంగా ఉన్నారు. 2015 నుండి మహిళలు కూడా SPG క్లోజ్ ప్రొటెక్షన్ టీమ్ (CPT)లో ఉన్నారు. ప్రస్తుతం SPGలో దాదాపు 100 మంది మహిళా కమాండోలు ఉన్నారు.
ఇండియా టుడే కూడా ఆ మహిళ ఎస్పీజీ కమాండో కాదని నివేదించింది. అందుకు సంబంధించిన లింక్స్ ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు
మోదీ పక్కన ఉన్నది ఎస్పీజీ కమాండో కాదని.. ఆమె రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ అని, సీఆర్ పీఎఫ్ లో అసిస్టెంట్ కమాండెంట్ అని అధికారులు వివరించారు. అంతకుమించిన వివరాలను వారు వెల్లడించలేదని తెలుగు మీడియా వెబ్‌సైట్స్ కూడా నివేదించాయి.
వాటిని ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.
ప్రధాని మోదీ పక్కన ఫోటోలో ఉన్న మహిళ వివరాలను అధికారులు గోప్యంగా ఉంచారు.
కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim : ప్రధాని నరేంద్ర మోదీకి మహిళా ఎస్.పి.జి. కమాండర్ రక్షణ కల్పిస్తున్నారు
Claimed By : Social Media Users
Claim Reviewed By : Telugu Post
Claim Source : Social Media
Fact Check : Misleading
Next Story