ఫ్యాక్ట్ చెక్: కేటీఆర్ ను తప్పిస్తేనే బీఆర్ఎస్ పార్టీకి మనుగడ అని తెలంగాణ స్క్రైబ్ కథనం అసత్యం. అలాంటి ప్రకటనలు ఏవీ బీఆర్ఎస్ నేతలు చేయలేదు
కేటీఆర్ ను తప్పిస్తేనే బీఆర్ఎస్ పార్టీకి మనుగడ అని తెలంగాణ స్క్రైబ్ కథనం

Claim :
కేటీఆర్ ను తప్పిస్తేనే బీఆర్ఎస్ పార్టీకి మనుగడ అని ఆ పార్టీ నాయకులు కేసీఆర్ కు లేఖ రాశారుFact :
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి హాజరయ్యారు. సభ ప్రారంభమైన కొన్ని నిమిషాల్లోనే బీఆర్ఎస్ అధినేత తిరుగుపయనమయ్యారు. సంతాప తీర్మానాలు ముగిసిన వెంటనే కేసీఆర్ అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారు. నందినగర్‌లోని నివాసం నుంచి అసెంబ్లీకి చేరుకున్నారు కేసీఆర్. ఈ సందర్భంగా మాజీ సీఎంకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు. ఆపై కేసీఆర్‌ను ఎమ్మెల్యేలు సభలోకి తీసుకెళ్లారు. కేసీఆర్ వెళ్లిన కాసేపటికే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. మిగతా సభ్యులు అందరికంటే ముందుగానే కేసీఆర్ వెళ్లి తన చైర్లో కూర్చున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ హాల్లోకి రాగానే కేసీఆర్ దగ్గరికి వెళ్లి కరచాలనం చేశారు. అలాగే సీఎం తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా కేసీఆర్ దగ్గరికి వెళ్లి కరచాలనం చేశారు. ఆపై సభ ప్రారంభం కాగానే కొద్దిసేపు మాత్రమే సభలో ఉన్నారు కేసీఆర్. తర్వాత మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు బయటికి వచ్చారు. అనంతరం అసెంబ్లీ నుంచి తిరిగి నందినగర్ నివాసానికి వెళ్లిపోయారు.
ఇదిలా ఉండగా కేటీఆర్ ను తప్పించాలని పార్టీ నేతలు కేసీఆర్ ను కోరినట్లుగా పలు పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
"కేటీఆర్‌ను తప్పిస్తేనే పార్టీకి మనుగడ!
పార్టీ చీఫ్ కేసీఆర్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల లేఖ.
●వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్ బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి పార్టీ నష్టపోతూనే ఉంది.
●నిలువెల్లా అహంకారం ఉన్నోడు ఎన్నేళ్ళైనా సరే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాలేడు.
●ప్రజా సమస్యలపై పోరాటం తగ్గించి పీఆర్ టీం కోసం పబ్లిసిటీ స్టంట్‌కు పెద్దపీట వేస్తున్నాడు.
●మీ నిర్ణయాన్ని గౌరవించి ఇన్నేళ్లు అతన్ని భరించాం కానీ పార్టీ మనుగడలో ఉండాలంటే దూరం పెట్టాల్సిందే.
●పార్టీ కార్యనిర్వాహక బాధ్యతలను హరీష్ రావుకు అప్పగిస్తే తప్ప వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రాలేము.
●ఎమ్మెల్సీ కవితను పార్టీ నుండి బహిష్కరించి చాలా పెద్ద తప్పు చేసాం తిరిగి పార్టీలోకి తీసుకుందాం.
●బీఆర్ఎస్ నాయకులపై ఆమె చేస్తున్న ఆరోపణల వలన ప్రజల్లో పార్టీ రోజురోజుకు బలహీన పడుతుంది.
●పార్టీ నష్టపోతూ ఉంటే మౌనంగా ఉండలేము అలాగని మా రాజకీయ భవిష్యత్తును పణంగా పెట్టలేము." అంటూ పోస్టులు పెట్టారు.
తెలంగాణ స్క్రైబ్ కథనం అంటూ న్యూస్ పేపర్ క్లిప్పింగ్ వైరల్ అవుతూ ఉంది.
వైరల్ పోస్టులకు సంబంధించిన లింక్స్ ను ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.
వైరల్ పోస్టులకు సంబంధించిన ఆర్కైవ్ లింక్స్ ఇక్కడ, ఇక్కడ ఉన్నాయి.
ఇక వైరల్ అవుతున్న వాదనకు సంబంధించిన స్క్రీన్ షాట్ ఇక్కడ ఉంది.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
వైరల్ పోస్టుల్లోని కీవర్డ్స్ తీసుకుని గూగుల్ సెర్చ్ చేయగా మాకు ప్రధాన మీడియా సంస్థల్లో ఇందుకు సంబంధించిన కథనాలు ఏవీ లభించలేదు. ఇలాంటి పరిస్థితి బీఆర్ఎస్ లో చోటు చేసుకుని ఉండి ఉంటే దాన్ని పలు మీడియా సంస్థలు ప్రముఖంగా పరుచురించి ఉండేవి. కాబట్టి, అలాంటి ఘటన ఏదీ బీఆర్ఎస్ లో చోటు చేసుకోలేదు.
ముఖ్యంగా ‘తెలంగాణ స్క్రైబ్’ అన్నది నిజమైన వార్తాపత్రిక కాదు. ఉనికిలో లేని మీడియా అవుట్లెట్ నుండి అనేక నకిలీ వార్తాపత్రిక క్లిప్పింగ్‌లు గతంలో వైరల్ అయ్యాయి. వీటిని తెలుగు పోస్ట్ ఖండిస్తూ కథనాలను ప్రసారం చేసింది. ఈ వార్తాపత్రిక క్లిప్పింగ్‌ల బ్యానర్లు, నివేదికలు వెబ్‌సైట్‌కు ఎటువంటి లింక్‌ను అందించవు. ఈ వైరల్ పోస్టుల్లో ఎలాంటి వాస్తవాలు లేవని తెలుస్తోంది.
తెలంగాణ స్క్రైబ్ గురించి మరింత తెలుసుకోడానికి మేము ప్రెస్ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో ‘తెలంగాణ స్క్రైబ్’ రిజిస్ట్రేషన్ కోసం వెతికాం. అయితే ‘తెలంగాణ స్క్రైబ్’ అనే వెబ్ సైట్ ఉనికిలో లేదని మేము కనుగొన్నాము.
అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ఇక్కడ ఉంది.
ఇక తెలంగాణ స్క్రైబ్ వెబ్సైట్ ను నిశితంగా పరిశీలించాం. అయితే అందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, సాధారణ వార్తలు వంటి వివిధ అంశాలపై కథనాలను మేము కనుగొన్నాము. అయితే ఈ వెబ్‌సైట్‌లోని పోస్ట్లలు ప్రచురించిన తేదీ జూలై 2025 వరకు మాత్రమే. జూలై తర్వాత ప్రచురించబడిన నివేదికలు ఏవీ మాకు కనిపించలేదు. ‘తెలంగాణ స్క్రైబ్’ అనే పేరుతో వార్తాపత్రిక క్లిప్పింగ్‌లను పోస్ట్ చేసే ఫేస్బుక్ లేదా ఇన్స్టాగ్రామ్ ఖాతాలు కూడా లేవు.
‘tscribe4u’ అనే యూజర్‌నేమ్‌తో ‘Telangana Scribe’ అనే X ఖాతాను మేము కనుగొన్నాము. ప్రొఫైల్ పిక్చర్ వార్తాపత్రిక క్లిప్పింగ్‌లలోని లోగోతో సరిపోలుతుంది. అందులో వైరల్ వార్తాపత్రిక క్లిప్పింగ్‌లను పోస్ట్ చేసినట్లు చూశాం. అయితే, ఈ ఖాతాలో సాధారణ వార్తా నివేదికలు లేవు. ఇది ఏ వార్తా వెబ్‌సైట్‌కు కూడా లింక్ చేయబడలేదు. ఈ ఖాతా తెలుగు వార్తాపత్రికల క్లిప్పింగ్‌లను తప్పుడు సమాచారంతో పంచుకుంటుందని స్పష్టంగా తెలుస్తోంది.
https://x.com/tscribe4u
ఈ పేజీలో ఉన్న న్యూస్ క్లిప్పింగ్స్ అన్నీ అసత్యాలేనని స్పష్టంగా తెలుస్తోంది.
కేటీఆర్ ను తప్పిస్తేనే బీఆర్ఎస్ పార్టీకి మనుగడ అని తెలంగాణ స్క్రైబ్ కథనం నిజం కాదు.
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.

