Fri Dec 05 2025 09:12:51 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: కేంద్ర ప్రభుత్వం ప్రతి విద్యార్థికి ల్యాప్ టాప్ ఇస్తున్నట్లుగా ఎలాంటి ప్రకటన చేయలేదు
కేంద్ర ప్రభుత్వం ప్రతి విద్యార్థికి ఒక ల్యాప్ టాప్ ఉచితంగా

Claim :
కేంద్ర ప్రభుత్వం ప్రతి విద్యార్థికి ఒక ల్యాప్ టాప్ ఉచితంగా ఇవ్వనుందిFact :
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు
విద్యార్థులు ఉన్నత చదువులు చదవడం మొదలు పెట్టాక డిజిటల్ గ్యాడ్జెట్ల అవసరం తప్పకుండా ఉంటుంది. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థులకు ట్యాబ్లెట్లు, ల్యాప్ టాప్ వంటివి అందిస్తూ ఉంటాయి.
అయితే కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ల్యాప్ టాప్ లను అందిస్తూ ఉందంటూ ఓ వీడియో వైరల్ అవుతూ ఉంది.
Talk 2 Guruji అనే యూట్యూబ్ పేజీలో " PM Free Laptop योजना | One Student One Laptop Yojana 2025 | How To Apply Free Laptop Yojana Aicte" అనే టైటిల్ తో ఓ వీడియోను అప్లోడ్ చేశారు. ఈ వీడియోకు 60వేలకు పైగా వ్యూస్ వచ్చాయి.
ఈ వీడియోకు సంబంధించిన థంబ్ నైల్ లో ప్రధాని నరేంద్ర మోదీ ఫోటో ను ఉపయోగించారు. ప్రతి ఒక్కరికీ ఉచితంగా ల్యాప్ టాప్ లభిస్తుందంటూ ఆ థంబ్ నైల్ లో ఉంది. కొందరు పిల్లలు ల్యాప్ టాప్ పట్టుకుని ఉండడం కూడా అందులో చూడొచ్చు.
"ఈ పథకం కింద అర్హత కలిగిన అమ్మాయిలకు ఉచిత ల్యాప్‌టాప్‌లు ఇస్తారు, ఆన్లైన్ తరగతులు, డిజిటల్ లెర్నింగ్ సులభంగా చేయవచ్చు. 10, 12 లేదా గ్రాడ్యుయేషన్ విద్యార్థులు ఇందులో దరఖాస్తు చేసుకోవచ్చు." అని ఆ వీడియోలో తెలిపారు.
ఆ యూట్యూబ్ వీడియోకు సంబంధించిన థంబ్‌నైల్ ఇక్కడ చూడొచ్చు

ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
కేంద్ర ప్రభుత్వం ఇటీవలి కాలంలో ఉచితంగా అమ్మాయిలకు ల్యాప్ టాప్ లను అందిస్తోందా అని తెలుసుకోడానికి మేము సంబంధిత వెబ్ సైట్లను పరిశీలించాం. అయితే ఎక్కడా కూడా మాకు అలాంటి వివరాలు లభించలేదు.
సంబంధిత కీవర్డ్స్ తో గూగుల్ చేయగా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ల్యాప్ టాప్ లను అందించాలని యోచిస్తోందంటూ మే, 2025లో కథనాలను చూశాం.
తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేయడానికి 10 లక్షల ల్యాప్‌టాప్‌లను కొనుగోలు చేయడానికి అంతర్జాతీయ టెండర్‌ను పిలిచింది. రెండేళ్లలో కళాశాల విద్యార్థులకు 20 లక్షల ల్యాప్‌టాప్‌లను అందిస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించింది. ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్‌తో ఇటీవల జరిగిన సమావేశం తర్వాత, ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ తమిళనాడు (ELCOT) మొదటి దశలో 10 లక్షల మిడ్-స్పెక్ ల్యాప్‌టాప్‌లను కొనుగోలు చేయడానికి టెండర్లను పిలిచింది. ప్రతి ల్యాప్‌టాప్‌ను సుమారు 20,000 ఖర్చుతో కొనుగోలు చేస్తామని, ఈ బడ్జెట్లో 2,000 కోట్లు, తదుపరి బడ్జెట్లో సమాన నిధులు కేటాయిస్తారని అధికారులు తెలిపారు. ప్రకటించిన ల్యాప్‌టాప్‌ల ధర సాధారణంగా మార్కెట్లో 30,000 మరియు 35,000 మధ్య ఉంటుంది. టెండర్లు చెల్లుబాటు కావాలంటే కాంట్రాక్టర్ కనీసం ఒక లక్ష ల్యాప్‌టాప్‌లను అందించాలని ELCOT అధికారులు తెలిపారు. ఇంటెల్ కోర్ I3 లేదా AMD రైజెన్కు సమానమైన లేదా అంతకంటే ఎక్కువ సామర్థ్యం గల ఏదైనా ప్రాసెసర్‌తో ల్యాప్‌టాప్‌లను సరఫరా చేయాలని స్పెసిఫికేషన్లు సంస్థలను ఆదేశించాయి, కనీసం ఎనిమిది గిగాబైట్ల RAMతో ఉండాలని తెలిపారు. ల్యాప్‌టాప్‌లు 14 అంగుళాలు లేదా 15.6 అంగుళాలు ఉండాలని సూచించారు.
అందుకు సంబంధించిన కథనాలను ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.
మా తదుపరి పరిశోధనలో ఇటీవలి కాలంలో పలు సందర్భాల్లో PIB ఫ్యాక్ట్ చెక్ టీమ్ ఉచితంగా ల్యాప్ టాప్ లను ప్రభుత్వం ఇస్తోందంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని తెలిపింది.
""Free Scheme" के नाम पर चलने वाली Clickbait वीडियोज से सावधान रहें!
#YouTube चैनल 'Talk2Guruji' के एक वीडियो थंबनेल में यह दावा किया गया है कि 'PM Free Laptop योजना' के तहत सरकार सभी को मुफ्त लैपटॉप प्रदान कर रही है
#PIBFactCheck
सतर्क हो जाएं! यह दावा पूरी तरह से #फर्जी है
भारत सरकार ऐसी कोई योजना नहीं चला रही है
इन Clickbait वीडियो का मकसद सिर्फ व्यूज़ और सब्सक्राइबर बढ़ाना होता है, न कि आपको सही जानकारी देना
सतर्क रहें, सुरक्षित रहें" అంటూ పోస్టు పెట్టింది.
https://x.com/PIBFactCheck/status/1926560989392044284
మే 18న కూడా ఇలాంటి ఓ పోస్టును PIB ఫ్యాక్ట్ చెక్ టీమ్ ఖండించింది.

https://x.com/PIBFactCheck/
మే 18న కూడా ఇలాంటి ఓ పోస్టును PIB ఫ్యాక్ట్ చెక్ టీమ్ ఖండించింది.
ఇలాంటి క్లిక్ బెయిట్ థంబ్ నైల్స్ తో యూట్యూబ్ వీడియోల వ్యూస్ ను పెంచుకోవడం లేదా ఏది పడితే ఆ లింక్ ను ఇచ్చేసి వాటిపై క్లిక్ చేయడం ద్వారా మీ డేటాను తస్కరించడం వంటివి కొందరు చేస్తూ ఉంటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.
ప్రధాని మోదీ ఉచితంగా ల్యాప్ టాప్ లను ఇస్తున్నారంటూ ఇటీవల ఆన్లైన్ న్యూస్ పోర్టల్లలో అనేక తప్పుదారి పట్టించే వార్తా కథనాలు వచ్చాయి. వెబ్సైట్ లింక్ ద్వారా విద్యార్థులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నాయి, అయితే వాస్తవానికి భారత ప్రభుత్వం అలాంటి పథకాన్ని ప్రారంభించలేదు. ఈ లింకుల ద్వారా విద్యార్థులను, తల్లిదండ్రులను మోసగించే అవకాశం ఉంది, కాబట్టి అలాంటి వార్తల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim : కేంద్ర ప్రభుత్వం ప్రతి విద్యార్థికి ఒక ల్యాప్ టాప్ ఉచితంగా
Claimed By : Social Media Users
Claim Reviewed By : Telugu Post
Claim Source : Social Media
Fact Check : False
Next Story