Fri Dec 05 2025 16:24:54 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: ఆంధ్రప్రదేశ్ లో తల్లికి వందనం కేవలం ముస్లింలకు మాత్రమే పరిమితమవ్వలేదు
పేదరికం కారణంగా విద్యను మధ్యలోనే ఆపకుండా విద్యార్థులు తమ చదువును

Claim :
ఆంధ్రప్రదేశ్ లో తల్లికి వందనం ముస్లింలకు మాత్రమే వర్తిస్తోందిFact :
తల్లికి వందనం పథకం కేవలం ఒక కమ్యూనిటీకి పరిమితమవ్వలేదు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం ‘తల్లికి వందనం’. పేదరికం కారణంగా విద్యను మధ్యలోనే ఆపకుండా విద్యార్థులు తమ చదువును కొనసాగించడానికి ఆర్థిక చేయూత అందించడం ఈ పథకం ఉద్దేశ్యం. కూటమి ప్రభుత్వం ‘సూపర్ సిక్స్’ హామీలలో ఈ పథకం ఒకటి. గత వైసీపీ ప్రభుత్వం అమ్మ ఒడి పేరుతో కుటుంబంలో ఒకరికి మాత్రమే చదువుకోడానికి డబ్బులు కేటాయిస్తూ ఉండగా, కూటమి ప్రభుత్వం హయాంలో ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి ఈ పథకం వర్తించేలా నిర్ణయం తీసుకున్నారు.
ఈ పథకం కింద అర్హులైన ప్రతి విద్యార్థికి ఏటా రూ.15,000 ఆర్థిక సహాయం అందిస్తారు. ప్రైవేట్ పాఠశాలలో చదివే విద్యార్థులకు కూడా ఇది వర్తిస్తుంది. కుటుంబంలో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మంది పిల్లలకు ఈ సాయం అందిస్తారు. ఇందులో విద్యార్థికి రూ.13,000 ఇవ్వగా పాఠశాల/ కాలేజీ నిర్వహణ అభివృద్ధికి 2000 రూపాయలు కేటాయిస్తారు. విద్యార్థికి ఇచ్చే మొత్తాన్ని తల్లి బ్యాంక్ ఖాతాలో నేరుగా జమ చేస్తారు.
ఇంతలో ఓ ముస్లిం మహిళకు 12 మంది పిల్లలని, ఆమెకు తల్లికి వందనం డబ్బులు పడ్డాయని చెబుతూ కొన్ని పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఇది కేవలం ముస్లిం మహిళలకే అంటూ ఆ పోస్టులు చెబుతున్నాయి.

వైరల్ అవుతున్న పోస్టులకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
మేము సంబంధిత వెబ్ సైట్స్ ను పరిశీలించగా తల్లికి వందనం స్కీమ్ అర్హత ఎవరికి లభిస్తుందో అందుకు సంబంధించిన వివరాలు మాకు లభించాయి. ఆ వివరాలను ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.
అర్హత ప్రమాణాలు
గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థి కుటుంబం మొత్తం ఆదాయం నెలకు 10,000, పట్టణ ప్రాంతాల్లో 12,000 మించకూడదు.
కుటుంబంలో కనీసం ఒక సభ్యునికి బియ్యం కార్డు ఉండాలి.
భూమికి సంబంధించి:
3 ఎకరాల కంటే తక్కువ చిత్తడి నేల, లేదా
10 ఎకరాల కంటే తక్కువ పొడి భూమి, లేదా
కలిపి 10 ఎకరాల కంటే తక్కువ (తడి + పొడి)
నెలవారీ విద్యుత్ వినియోగం 300 యూనిట్ల కంటే తక్కువ ఉండాలి (సగటున 12 నెలలు).
కుటుంబం 1000 చదరపు అడుగులు లేదా అంతకంటే ఎక్కువ మున్సిపల్ ఆస్తిని కలిగి ఉండకూడదు.
విద్యార్థులు గుర్తింపు పొందిన పాఠశాలల్లో 1 నుండి 12వ తరగతి చదువుతూ ఉండాలి.
స్వచ్ఛంద సంస్థల ద్వారా నమోదు చేసుకున్న అనాథలు, వీధి పిల్లలు అర్హులు, ఇది డిపార్ట్మెంటల్ నిర్ధారణకు లోబడి ఉంటుంది.
తల్లి బ్యాంక్ ఖాతా ఆధార్-సీడింగ్ చేసి ఉండాలి. DBT చెల్లింపు కోసం NPCI- ప్రారంభించి ఉండాలి.
విద్యార్థులు తదుపరి సంవత్సరానికి అర్హత సాధించాలంటే కనీసం 75% హాజరును కలిగి ఉండాలి.
2025–26 AYకి సంబంధించిన I మరియు XI తరగతి నమోదులను నమోదు తర్వాత పరిగణిస్తారు.
ఇందులో ఎక్కడా కూడా ఒక కులానికి, మతానికి ప్రాధాన్యత అంటూ చెప్పలేదు. అందుకు సంబంధించిన పూర్తీ వివరాలను ఇక్కడ చూడొచ్చు.
ఇక వైరల్ అవుతున్న పోస్టుల్లో ఉన్న ఫోటోను మేము రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాం. అందుకు సంబంధించిన వివరాలు పలు మీడియా సంస్థలు ప్రచురించాయని గుర్తించాం.
అన్నమయ్య జిల్లా లోని ఒక ఉమ్మడి కుటుంబంలో 12 మంది పిల్లలను తల్లికి వందనం పథకానికి అర్హులుగా గుర్తించింది. కలకడకు చెందిన హసీనుల్లాకు నలుగురు కొడుకులు కాగా ఉమ్మడి కుటుంబంలో ఉన్న నలుగురు తల్లుల సంతానం 12 మందికి తల్లికి వందనం డబ్బులు జమ చేసింది. 12 మంది పిల్లలకు గాను మొత్తం రూ.1.56 లక్షల నగదు బదిలీ చేసింది. కలకడకు చెందిన టి.నసీన్, బి.ముంతాజ్, ఇరానీ, ఆసియా అనే తల్లుల అకౌంట్ లలో నగదు జమ అయిందని పలు మీడియా కథనాలు తెలిపాయి.
https://tv9telugu.com/andhra-pradesh/a-family-from-annamayya-district-received-of-rs-1-56-lakh-for-12-children-under-talliki-vandanam-scheme-1559435.html
https://telugu.samayam.com/andhra-pradesh/news/12-students-from-a-joint-family-gets-1-lakh-56000-under-thalliki-vandanam-scheme-in-kalakada-annamayya-district/articleshow/121850693.cms
"ఉమ్మడి కుటుంబంలోని 12 మంది పిల్లలకు పడిన తల్లికి వందనం.
అన్నమయ్య జిల్లా కలకడలో ఉమ్మడి కుటుంబంలో ఉన్న ముగ్గురు తల్లులకు, వారి 12 మంది పిల్లలకు తల్లికి వందనం డబ్బులు జమ అయ్యాయి. ఒకేసారి రూ.1.56 లక్షలు తమ అకౌంట్ లో పడటంతో, ఆ కుటుంబం, ఆ తల్లుల సంతోషానికి అవధులు లేవు." అంటూ తెలుగుదేశం పార్టీ అధికారిక ఖాతాలో కూడా వైరల్ పోస్టులకు సంబంధించిన అసలైన వీడియోను జూన్ 14, 2025న పోస్టు చేశారు.
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
మేము సంబంధిత వెబ్ సైట్స్ ను పరిశీలించగా తల్లికి వందనం స్కీమ్ అర్హత ఎవరికి లభిస్తుందో అందుకు సంబంధించిన వివరాలు మాకు లభించాయి. ఆ వివరాలను ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.
అర్హత ప్రమాణాలు
గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థి కుటుంబం మొత్తం ఆదాయం నెలకు 10,000, పట్టణ ప్రాంతాల్లో 12,000 మించకూడదు.
కుటుంబంలో కనీసం ఒక సభ్యునికి బియ్యం కార్డు ఉండాలి.
భూమికి సంబంధించి:
3 ఎకరాల కంటే తక్కువ చిత్తడి నేల, లేదా
10 ఎకరాల కంటే తక్కువ పొడి భూమి, లేదా
కలిపి 10 ఎకరాల కంటే తక్కువ (తడి + పొడి)
నెలవారీ విద్యుత్ వినియోగం 300 యూనిట్ల కంటే తక్కువ ఉండాలి (సగటున 12 నెలలు).
కుటుంబం 1000 చదరపు అడుగులు లేదా అంతకంటే ఎక్కువ మున్సిపల్ ఆస్తిని కలిగి ఉండకూడదు.
విద్యార్థులు గుర్తింపు పొందిన పాఠశాలల్లో 1 నుండి 12వ తరగతి చదువుతూ ఉండాలి.
స్వచ్ఛంద సంస్థల ద్వారా నమోదు చేసుకున్న అనాథలు, వీధి పిల్లలు అర్హులు, ఇది డిపార్ట్మెంటల్ నిర్ధారణకు లోబడి ఉంటుంది.
తల్లి బ్యాంక్ ఖాతా ఆధార్-సీడింగ్ చేసి ఉండాలి. DBT చెల్లింపు కోసం NPCI- ప్రారంభించి ఉండాలి.
విద్యార్థులు తదుపరి సంవత్సరానికి అర్హత సాధించాలంటే కనీసం 75% హాజరును కలిగి ఉండాలి.
2025–26 AYకి సంబంధించిన I మరియు XI తరగతి నమోదులను నమోదు తర్వాత పరిగణిస్తారు.
ఇందులో ఎక్కడా కూడా ఒక కులానికి, మతానికి ప్రాధాన్యత అంటూ చెప్పలేదు. అందుకు సంబంధించిన పూర్తీ వివరాలను ఇక్కడ చూడొచ్చు.
ఇక వైరల్ అవుతున్న పోస్టుల్లో ఉన్న ఫోటోను మేము రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాం. అందుకు సంబంధించిన వివరాలు పలు మీడియా సంస్థలు ప్రచురించాయని గుర్తించాం.
అన్నమయ్య జిల్లా లోని ఒక ఉమ్మడి కుటుంబంలో 12 మంది పిల్లలను తల్లికి వందనం పథకానికి అర్హులుగా గుర్తించింది. కలకడకు చెందిన హసీనుల్లాకు నలుగురు కొడుకులు కాగా ఉమ్మడి కుటుంబంలో ఉన్న నలుగురు తల్లుల సంతానం 12 మందికి తల్లికి వందనం డబ్బులు జమ చేసింది. 12 మంది పిల్లలకు గాను మొత్తం రూ.1.56 లక్షల నగదు బదిలీ చేసింది. కలకడకు చెందిన టి.నసీన్, బి.ముంతాజ్, ఇరానీ, ఆసియా అనే తల్లుల అకౌంట్ లలో నగదు జమ అయిందని పలు మీడియా కథనాలు తెలిపాయి.
https://tv9telugu.com/andhra-
https://telugu.samayam.com/
"ఉమ్మడి కుటుంబంలోని 12 మంది పిల్లలకు పడిన తల్లికి వందనం.
అన్నమయ్య జిల్లా కలకడలో ఉమ్మడి కుటుంబంలో ఉన్న ముగ్గురు తల్లులకు, వారి 12 మంది పిల్లలకు తల్లికి వందనం డబ్బులు జమ అయ్యాయి. ఒకేసారి రూ.1.56 లక్షలు తమ అకౌంట్ లో పడటంతో, ఆ కుటుంబం, ఆ తల్లుల సంతోషానికి అవధులు లేవు." అంటూ తెలుగుదేశం పార్టీ అధికారిక ఖాతాలో కూడా వైరల్ పోస్టులకు సంబంధించిన అసలైన వీడియోను జూన్ 14, 2025న పోస్టు చేశారు.
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. తల్లికి వందనం పథకం కేవలం ముస్లింలకు మాత్రమే పరిమితమనే వాదన అబద్ధం.
Claim : తల్లికి వందనం పథకం కేవలం ఒక కమ్యూనిటీకి
Claimed By : Social Media Users
Claim Reviewed By : TeluguPost
Claim Source : Social Media
Fact Check : False
Next Story