Wed Jan 28 2026 19:46:00 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: తెలంగాణలోని నల్గొండలో చోటు చేసుకున్న ఘటనను ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుందిగా ప్రచారం చేస్తున్నారు
తెలంగాణలోని నల్గొండలో చోటు చేసుకున్న ఘటనను ఉత్తరప్రదేశ్ లో

Claim :
ఆర్ఎస్ఎస్కు వ్యతిరేకంగా ఒక వ్యక్తి నినాదాలు చేస్తున్నట్లు చూపించే వైరల్ వీడియో ఉత్తరప్రదేశ్‌కు చెందినదిFact :
ఈ వీడియో ఉత్తరప్రదేశ్ కు సంబంధించింది కాదు. తెలంగాణలోని నల్గొండలో చోటు చేసుకుంది.
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) చీఫ్ మోహన్ భగవత్ పలు రాష్ట్రాల్లో పర్యటిస్తూ ఉన్నారు. జనవరి నెలలో బీహార్‌లో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం చేరుకున్నారు. భగవత్ గర్హాలో జరిగిన ఒక సెమినార్లో ప్రసంగించారు. దీనికి 18 జిల్లాల నుండి 300 మందికి పైగా RSS వాలంటీర్లు హాజరయ్యారు. ముజఫర్‌పూర్, దర్భంగా, సీతామర్హి, షియోహార్, సమస్తిపూర్, మధుబని, తూర్పు, పశ్చిమ చంపారన్, కోసి ప్రాంతం, నౌగాచియా నుండి పాల్గొన్నారు. ముజఫర్‌పూర్‌లోని ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో భగవత్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. గణతంత్ర దినోత్సవం నాడు సంఘ్‌చాలక్ ఒక ప్రావిన్షియల్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించడం ఇదే తొలిసారి అని ఆ సంస్థ తెలిపింది.
ఒక సమూహం లోని సభ్యులు ఆర్ఎస్ఎస్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.
కొంతమంది వ్యక్తులు RSS కి వ్యతిరేకంగా అవమానకరమైన నినాదాలు చేస్తున్నట్లు చూపించే వీడియో ఉత్తరప్రదేశ్‌లో రికార్డ్ చేసారంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.
వైరల్ పోస్టులకు సంబంధించిన ఆర్కైవ్ లింక్స్ ను ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.
స్క్రీన్ షాట్ ను ఇక్కడ ఉంది
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో నిజం లేదు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకున్నది కాదు. తెలంగాణలో జరిగిన ఘటన.
ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల ఇలాంటి నినాదాలతో కూడిన ర్యాలీ ఏదైనా జరిగిందా అని తనిఖీ చేయడానికి మేము మొదట గూగుల్‌లో కీవర్డ్ శోధనను నిర్వహించాము. ఈ వాదనకు మద్దతు ఇచ్చే విశ్వసనీయ వార్తా నివేదికలు ఏవీ మాకు కనిపించలేదు.
అయితే మాకు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పలు వార్తా నివేదికలు లభించాయి. ఆగస్టు 23, 2022న బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌కు వ్యతిరేకంగా నల్గొండలో జరిగిన ర్యాలీలో కలీం ఉద్దీన్ అనే వ్యక్తి RSSకు వ్యతిరేకంగా నినాదాలు చేశాడు. నిందితుడిని గుర్తించి అరెస్టు చేశామని, IPC సెక్షన్లు 153, 295(A), 506 కింద కేసు నమోదు చేశామని నల్గొండ ఎస్పీ రమా రాజేశ్వరి ధృవీకరించారు.
"Telangana | Yesterday during a rally in Nalgonda against suspended BJP MLA Raja Singh, person named Kaleem Uddin raised derogatory slogans against RSS, echoed by others. Accused was identified & arrested. Case registered under sec 153, 295a & 506: Nalgonda SP Rema Rajeshwari" అంటూ ఏఎన్ఐ ఆగస్టు 24, 2022న చేసిన ట్వీట్ మాకు లభించింది.
మా తదుపరి పరిశోధనలో ది హిందూ కథనం కూడా లభించింది. ది హిందూ 2022లో అదే వైరల్ వీడియోలోని కీఫ్రేమ్‌లను ఉపయోగించి ఒక ఫ్యాక్ట్-చెక్‌ను ప్రచురించింది. తెలంగాణలోని నల్గొండ లో చోటు చేసుకుందని వివరించారు. ఎమ్మెల్యే రాజా సింగ్ ముహమ్మద్ ప్రవక్త గురించి అవమానకరమైన వ్యాఖ్యలు చేసిన తర్వాత జరిగిన నిరసనలకు సంబంధించినదని తెలుస్తోంది.
ఇక వైరల్ వీడియో లో ఉన్న లొకేషన్ ను మేము గూగుల్ స్ట్రీట్ వ్యూ ద్వారా గుర్తించాం.
https://www.google.com/maps/
వైరల్ వీడియోను నిశితంగా పరిశీలించగా అందులో “Royal Time House” అని ఉంది. ఆ లొకేషన్ తెలంగాణలోని నల్గొండలో ఉందని గుర్తించాము.
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని పలు ఫ్యాక్ట్ చెక్ సంస్థలు తెలిపాయి. అందుకు సంబంధించిన లింక్ ను ఇక్కడ చూడొచ్చు.
కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim : ఈ వీడియో ఉత్తరప్రదేశ్ కు సంబంధించింది కాదు. తెలంగాణలోని నల్గొండలో చోటు చేసుకుంది.
Claimed By : Social Media Users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Social Media
Fact Check : False
Next Story

