ఫ్యాక్ట్ చెక్: కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత అపోలో ఆసుపత్రిలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేరారంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు
రేవంత్ రెడ్డి ఆసుపత్రి పాలయ్యారంటూ పోస్టులను సోషల్ మీడియాలో

Claim :
అపోలో ఆసుపత్రిలో చేరిన సీఎం రేవంత్Fact :
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు
దాదాపు రెండేళ్ల పాటు క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న భారత రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై విమర్శల యుద్ధాన్ని ప్రకటించారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేసీఆర్ రాజకీయ యుద్ధభూమిలోకి అధికారికంగా తిరిగి వస్తున్నట్లు సంకేతాలు ఇచ్చారు. కాంగ్రెస్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం, బీజేపీ నేతృత్వంలోని కేంద్రం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ నీటి వనరులను దోచుకోవడానికి కుట్ర పన్నారని కేసీఆర్ ఆరోపించారు. పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని 90 శాతం పూర్తి చేయడానికి తన ప్రభుత్వం రూ.27,000 కోట్లు ఖర్చు చేసిందని కేసీఆర్ చెప్పారు. అసలు 170 టిఎంసిల నీటి నుండి 45 వేల మిలియన్ క్యూబిక్ అడుగుల (టిఎంసి) నీటిని మాత్రమే ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రాన్ని సిగ్గుచేటుగా అభ్యర్థించడం కరువు పీడిత ప్రాంతానికి మరణశిక్ష విధించడమేనని ఆయన ఆరోపించారు. చంద్రబాబు నాయుడు ఆదేశం మేరకు కేంద్రం ప్రాజెక్టు వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక (DPR)ను తిరిగి ఇచ్చిందని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మౌనంగా ఉందని ఆయన అన్నారు.
ఇంతలో రేవంత్ రెడ్డి ఆసుపత్రి పాలయ్యారంటూ పోస్టులను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. "Revanth Reddy experienced chest pain at around 11:45 PM last night.
He was immediately rushed to Apollo Hospital for medical attention.
Doctors responded promptly and began a thorough examination upon his arrival.
Initial assessments indicated a possible minor neurological event, and further tests were ordered to confirm the condition.
A team of senior doctors is closely monitoring his health.
Multiple diagnostic procedures, including scans and blood tests, are being conducted.
According to available information, his condition is currently stable.
Doctors have stated that there is no immediate cause for panic.
He is under constant observation in the hospital.
Family members and close associates have been informed.
Hospital authorities are providing regular updates on his health status.
Supporters and well-wishers have expressed concern and prayers for his recovery.
Medical experts are taking all necessary precautions.
The hospital has assured that he is receiving the best possible care.
Further details are expected once doctors complete their evaluation and issue an official update." అంటూ ఇంగ్లీష్ లో పోస్టులు పెట్టారు.
"నిన్న రాత్రి 11:45 గంటల ప్రాంతంలో రేవంత్ రెడ్డికి ఛాతీ నొప్పి వచ్చింది.
అతన్ని వెంటనే వైద్య సహాయం కోసం అపోలో ఆసుపత్రికి తరలించారు.
డాక్టర్లు వెంటనే స్పందించి, ఆయన వచ్చిన వెంటనే క్షుణ్ణంగా పరీక్షలు ప్రారంభించారు.
ప్రాథమిక పరీక్షల్లో చిన్న నాడీ సంబంధిత సమస్య ఉన్నట్లు తేలింది, మరియు పరిస్థితిని నిర్ధారించడానికి మరిన్ని పరీక్షలు చేయమని ఆదేశించారు.
సీనియర్ వైద్యుల బృందం ఆయన ఆరోగ్యాన్ని నిశితంగా పర్యవేక్షిస్తోంది.
స్కాన్లు మరియు రక్త పరీక్షలు సహా బహుళ రోగనిర్ధారణ ప్రక్రియలు నిర్వహిస్తున్నారు.
అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, ఆయన పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉంది.
భయపడాల్సిన అవసరం లేదని వైద్యులు పేర్కొన్నారు.
ఆయన ఆసుపత్రిలో వైద్యుల పరిశీలనలో ఉన్నారు.
కుటుంబ సభ్యులు, సన్నిహితులకు సమాచారం అందించబడింది.
ఆసుపత్రి అధికారులు ఆయన ఆరోగ్య స్థితిపై క్రమం తప్పకుండా నవీకరణలను అందిస్తున్నారు.
ఆయన కోలుకోవాలని మద్దతుదారులు, శ్రేయోభిలాషులు ప్రార్థనలు చేశారు.
వైద్య నిపుణులు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
అతనికి సాధ్యమైనంత ఉత్తమమైన సంరక్షణ లభిస్తుందని ఆసుపత్రి హామీ ఇచ్చింది.
వైద్యులు తమ మూల్యాంకనం పూర్తి చేసి అధికారిక నవీకరణ జారీ చేసిన తర్వాత మరిన్ని వివరాలను పంచుకోనున్నారు." అంటూ పోస్టులు వైరల్ అవుతున్నాయి.
వైరల్ పోస్టులకు సంబంధించిన ఆర్కైవ్ లింక్ ను ఇక్కడ చూడొచ్చు
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆరోగ్యానికి సంబంధించి మేము సంబంధిత కీవర్డ్స్ తో గూగుల్ సెర్చ్ చేశాం. ఆయన ఆసుపత్రి పాలైనట్లుగా ఎలాంటి కథనాలు కూడా మాకు లభించలేదు. అలాంటిది ఏదైనా ఇటీవల జరిగి ఉండి ఉంటే ఖచ్చితంగా అది వార్తల్లో నిలిచి ఉండేది.
సీఎం రేవంత్ రెడ్డికి ఛాతీ నొప్పి వచ్చిందని లేదా అపోలో ఆసుపత్రిలో చేరారని సూచించే విశ్వసనీయ మీడియా నివేదికలు లేదా అధికారిక ధృవీకరణలు లేవు.
మేము సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ సీఎంఓ కు సంబంధించిన అధికారిక ఖాతాలను పరిశీలించాం. ఎక్కడా కూడా ఆయన ఆసుపత్రి పాలైనట్లుగా పోస్టులు కనిపించలేదు. ఆయన పలు కార్యక్రమాలకు హాజరయ్యారు.
"గ్రామ పంచాయతీ ప్రజా ప్రతినిధుల విధులు, బాధ్యతలకు సంబంధించి సమగ్ర సమాచారంతో రూపొందించిన గ్రామ ‘పంచాయతీ ప్రజా ప్రతినిధుల కరదీపిక’ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. పంచాయతీ రాజ్ చట్టం 2018 ప్రకారం గ్రామ పంచాయతీల విధులు, బాధ్యతలకు సంబంధించి 292 పేజీలతో తెలంగాణ గ్రామీణాభివృద్ధి సంస్థ #TGIRD ఈ పుస్తకాన్ని రూపొందించింది." అంటూ డిసెంబర్ 22న జరిగిన కార్యక్రమానికి సంబంధించిన విజువల్స్ తెలంగాణ సీఎంఓ ఖాతాలో మేము గమనించాం.
డిసెంబర్ 22న భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ముకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడ్కోలు పలికారు. "శీతాకాల విడిది ముగించుకొని హకీంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి తిరుగు ప్రయాణమైన సందర్భంగా ముఖ్యమంత్రి రాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణు దేవ్ వర్మ గారితో కలిసి రాష్ట్రపతి గారికి వీడ్కోలు పలికారు." అంటూ ఉన్న పోస్టులను మేము గమనించాం.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్న పలు లైవ్ కార్యక్రమాలకు సంబంధించిన లింక్స్ ను ఇక్కడ చూడొచ్చు.
వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎలాంటి నిజం లేదంటూ తెలంగాణ ఫ్యాక్ట్ చెక్ బృందం పోస్టు పెట్టింది. వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎలాంటి నిజం లేదని తేల్చి చెప్పింది. తెలంగాణ ప్రభుత్వ అధికారిక ఫ్యాక్ట్-చెక్ హ్యాండిల్, @FactCheck_TG, X వైరల్ అయిన వాదనను ఖండించింది. కొన్ని సామాజిక వ్యతిరేక శక్తులు ముఖ్యమంత్రి ఆరోగ్యం గురించి తప్పుడు, దురుద్దేశపూరిత పుకార్లను వ్యాప్తి చేస్తున్నాయని పేర్కొంది.
కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.

