Sat Dec 13 2025 22:34:58 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: టాటా కంపెనీ 125 సీసీ బైక్ ను మార్కెట్ లోకి ప్రవేశపెట్టడం లేదు
టాటా కొత్త 125cc బైక్‌ను విడుదల చేయబోతుందని, ఇది 90kmpl మైలేజీని అందిస్తుందని

Claim :
టాటా కంపెనీ 125 సీసీ బైక్ ను మార్కెట్ లోకి తీసుకుని వచ్చిందిFact :
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని టాటా కంపెనీ వివరణ ఇచ్చింది
ఇటీవల డీమెర్జర్ తర్వాత టాటా మోటార్స్ మరోసారి 30-స్టాక్ సెన్సెక్స్ ఇండెక్స్ నుండి మినహాయింపును ఎదుర్కొనే అవకాశం ఉంది. వాణిజ్య వాహన వ్యాపారం విడిపోవడంతో, కంపెనీ మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ విభజించబడింది. వాణిజ్య వాహన విభాగం ఇప్పుడు రూ. 1.19 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ కలిగి ఉండగా, ప్రయాణీకుల వాహన విభాగం రూ. 1.37 లక్షల కోట్ల వద్ద ఉంది.
ఇక టాటా సంస్థ ఎప్పటికప్పుడు కొత్త తరహా వాహనాలను ప్రవేశ పెడుతూ ఉంది. అటు కొత్త కొత్త కార్లతో మార్కెట్ లో మంచి పట్టు సాధించింది. పలు కార్లకు మంచి పాపులారిటీ వచ్చింది.
అయితే అతి తక్కువ ధరకు 125 సీసీ బైక్ ను అందించడానికి టాటా మోటార్స్ సంస్థ సిద్ధమైందంటూ పలు పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. టాటా మోటార్స్ 125cc మోటార్ సైకిల్‌ను విడుదల చేయడం ద్వారా ద్విచక్ర వాహన విభాగంలోకి ప్రవేశించాలని పేర్కొంటూ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో అనేక పోస్ట్‌లు వైరల్ అవుతున్నాయి. ఈ బైక్ రాయల్ ఎన్ ఫీల్డ్ కంపెనీ క్లాసిక్ 350 మోడల్ ను పోలి ఉంది.
మరికొన్ని పోస్టుల్లో టాటా కొత్త 125cc బైక్‌ను విడుదల చేయబోతుందని, ఇది 90kmpl మైలేజీని అందిస్తుందని చెబుతూ ఉన్నాయి. చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు గతంలో టాటా నానోను ఎలాగైతే ప్రవేశ పెట్టారో, టాటా ఇప్పుడు ద్విచక్ర వాహన విభాగంలో ఇలాంటి ప్రయోగాన్ని ప్రయత్నిస్తున్నట్లు భావిస్తూ పోస్టులు పెట్టారు. తెలుగు మీడియా సంస్థలు కూడా నిజమని నమ్మేస్తూ కథనాలను ప్రసారం చేశాయి.

తక్కువ ధరతో టాటా కంపెనీ బైక్స్ ను విడుదల చేసిందంటూ కూడా పోస్టులు పెడుతున్నారు
వైరల్ పోస్టులకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ను ఇక్కడ చూడొచ్చు
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
టాటా ఇటీవల ఏదైనా వాహనాన్ని లాంఛ్ చేసిందేమో అని తెలుసుకోవడం మేము సంబంధిత కీవర్డ్స్ సెర్చ్ చేయగా ఆ కంపెనీకి చెందిన ఐకానిక్ కారు 'టాటా సియెర్రా' ను తిరిగి మార్కెట్ లోకి లాంఛ్ చేయబోతోందని పలు మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది.
ఆ కథనాలను ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.
అంతే తప్ప టాటా సంస్థ బైక్స్ కు మార్కెట్ లోకి తీసుకొస్తున్నట్లుగా కథనాలేవీ మాకు లభించలేదు.
మేము టాటా మోటార్స్ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్, వెబ్‌సైట్‌ను కూడా తనిఖీ చేసాము. అయితే, అక్కడ కూడా వైరల్ క్లెయిమ్‌కు మద్దతు ఇచ్చే సమాచారం ఏదీ మాకు దొరకలేదు.
అయితే టాటా మోటార్స్ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో వైరల్ పోస్టులను ఖండిస్తూ పోస్టులు పెట్టారు. టాటా మోటార్స్ ద్విచక్ర వాహన విభాగంలోకి ప్రవేశించే ప్రణాళికలు లేవని స్పష్టం చేసింది.

ఇక వైరల్ పోస్టుల్లోకి బైక్స్ చాలా వరకూ ఇతర కంపెనీలకు చెందిన బైక్స్ ను పోలి ఉన్నాయి.
ఎటువంటి ప్రోటో టైప్ కానీ.. కాన్సెప్ట్ బైక్ కానీ టాటా కంపెనీ విడుదల చేయలేదు. భవిష్యత్తులో మోటార్ సైకిల్ విభాగంలోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాలు కూడా లేవని తేల్చి చెప్పింది.
ప్యాసింజర్, కమర్షియల్, ఎలక్ట్రిక్ వాహనాల్లో 4- వీలర్‌పైనే దృష్టి సారించినట్లుగా టాటా మోటార్స్ స్పష్టం చేసింది. అంతేకాకుండా ఇటీవల టాటా మోటార్స్ రెండు సంస్థలుగా విడిపోయింది. ప్యాసింజర్ వెహికిల్స్, ఎలక్ట్రిక్ వెహికిల్స్, జాగ్వార్ ల్యాండ్ రోవర్ కలిసి టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికిల్స్ లిమిటెడ్‌గా మారింది. అలాగే టాటా మోటార్స్ కమర్షియల్ వెహికిల్స్ లిమిటెడ్ అనే మరో కంపెనీగా వేరైంది. ఈ డీమెర్జర్ జరిగిన సమయంలో కూడా టూవీలర్ మార్కెట్ లోకి ప్రవేశిస్తున్నట్లుగా టాటా సంస్థ ప్రకటన చేయలేదు.
కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim : నిజం లేదని టాటా కంపెనీ వివరణ ఇచ్చింది
Claimed By : Social Media Users
Claim Reviewed By : Telugu Post Fact Check
Claim Source : Social Media
Fact Check : False
Next Story