Wed Feb 25 2026 16:05:01 GMT+0530 (India Standard Time)
ఫ్యాక్ట్ చెక్: ఆటోలో కూర్చున్న యువతిని ఒక వ్యక్తి వేధిస్తున్నట్లుగా ఉన్న వీడియో నిజమైన ఘటన కాదు
ఆటోలో కూర్చున్న యువతిని ఒక వ్యక్తి వేధిస్తున్నట్లుగా ఉన్న వీడియో

Claim :
ఆటోలో కూర్చున్న యువతిని బైక్ మీద వచ్చిన ఒక వ్యక్తి వేధిస్తున్నాడుFact :
ఇది స్క్రిప్టెడ్ వీడియో. నిజమైన ఘటన కాదు.
ఎక్కడకు వెళ్లినా మహిళలకు లైంగిక వేధింపులు ఎదురవుతూనే ఉన్నాయి. చాలా మంది వాటిని పట్టించుకోకపోవడం, అధికారులకు ఫిర్యాదు చేయకపోవడంతో కొందరు రెచ్చిపోతూ ఉన్నారు.
మహిళలపై లైంగిక వేధింపులు నిరోధానికి ప్రతీ ఒక్కరూ ముందుకు రావాలి. ఆడవాళ్లు ఇంటివద్ద బయలుదేరిన దగ్గర నుండి ఆఫీసులకు వెళ్లినా, చదువుకోడానికి వెళ్లినా, ఇంటికి వెళ్లే వరకు ఎన్నో విధాలుగా వేధింపులకు గురవుతున్నారు. మహిళలపై లైంగిక వేధింపులు నివారణ చట్టంపై స్పష్టమైన అవగాహన కలిగించాలి. ప్రభుత్వ చట్టం అమలుకు సంబంధించి చట్టం పరిధిలోకి వచ్చే అంశాలు, ఫిర్యాదు ఎవరికీ, ఏ విధంగా చేయాలి, బాధిత మహిళల నుండి ఫిర్యాదు తీసుకోవడం, ఫిర్యాదుపై తదుపరి చర్యలు, వేధింపులు చేసిన వ్యక్తిపై తీసుకోవలసిన చర్యలపై నివేదిక అందించడం, ఫిర్యాదుదారులో ఆత్మస్థైర్యం కలిగించడం వంటివి అవగాహన కలిగించాలి. బాధిత మహిళలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలి. నేరం రుజువైతే సంఘటన తీవ్రతను బట్టి జరిమానా, జైలు శిక్ష విధించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
ఆటో రిక్షాలో కూర్చున్న యువతిని ఒక యువకుడు వేధిస్తున్నట్లు చూపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పలు ప్రాంతాలలో జరిగిన ఘటనగా నెటిజన్లు చెబుతూ ఉన్నారు.
"ఆటోలో కూర్చున్న ఓ అమ్మాయిని యువకుడు వేధించాడంటూ నెట్టింట ఓ వీడియో వైరల్ అవుతోంది. పట్టపగలు నడిరోడ్డుపై బైక్ పై వచ్చి ఓ ఆటో పక్కన ఆగిన యువకుడు.. ఆటో వెనుక కూర్చుకున్న యువతిని పిలిచి.. వచ్చి నా బైక్ పై కూర్చో అని వేధించాడు. అందుకు ఆ యువతి ఘాటైన సమాధానం ఇచ్చింది. చేతులు చూపిస్తూ చెంప పగులుతుందని బదులిచ్చింది." అంటూ పలు మీడియా కథనాలు కూడా వచ్చాయి.
వైరల్ పోస్టులకు సంబంధించిన ఆర్కైవ్ లింక్స్ ను ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు
వైరల్ స్క్రీన్ షాట్స్ ఇక్కడ ఉన్నాయి
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఇది ఒక స్క్రిప్టెడ్ వీడియో. వీడియోలో ఉన్న యువతీ యువకుడు పలు వీడియోలలో కనిపించారు.
వైరల్ వీడియో కీఫ్రేమ్‌లను తీసుకుని మేము రివర్స్ ఇమేజ్ సెర్చ్ నిర్వహించాము. వికాస్ కుమార్ అనే ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఇలాంటి వీడియోలు మాకు కనిపించాయి.
వైరల్ వీడియోలో కనిపించిన ఇద్దరు వ్యక్తులు ఉన్న పలు వీడియోలు మాకు లభించాయి. అనేక ఇతర వీడియోలను మేము కనుగొన్నాము. వీటిలో చాలా వరకు ఈ జంట కనిపించింది.
అదే ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఫిబ్రవరి 22, 2026న అప్లోడ్ చేసిన మరొక వీడియోను కూడా మేము కనుగొన్నాము. వైరల్ క్లిప్‌లో కనిపించే అదే యువకుడు, యువతి ఇందులో ఉన్నారు. ఈ వీడియోలో, వారు తమను తాము కంటెంట్ సృష్టికర్తలుగా పరిచయం చేసుకున్నారు. వికాస్, ప్రియా పటేల్‌గా తమ గుర్తింపులను పేర్కొన్నారు. వైరల్ క్లిప్ స్క్రిప్టెడ్ వీడియో అని, ఇది నిజమైన సంఘటన కాదని ఆ జంట వివరించారు. అలాంటి వీడియో చేసినందుకు ప్రజలకు క్షమాపణలు కూడా చెప్పారు. వీడియో ద్వారా ఎవరి మనోభావాలైనా దెబ్బతీసి ఉంటే క్షమించాలని వారు కోరారు.
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదంటూ కొన్ని మీడియా సంస్థలు కథనాలను ప్రచురించాయి. వాటిని ఇక్కడ చూడొచ్చు.
కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఆటోలో కూర్చున్న యువతిని ఒక వ్యక్తి వేధిస్తున్నట్లుగా ఉన్న వీడియో నిజమైన ఘటన కాదు.
Claim : ఇది స్క్రిప్టెడ్ వీడియో. నిజమైన ఘటన కాదు.
Claimed By : Social Media Users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Social Media
Fact Check : False
Next Story

