Tue Mar 31 2026 01:22:44 GMT+0530 (India Standard Time)
ఫ్యాక్ట్ చెక్: రాజస్థాన్ లో చోటు చేసుకున్న ఘటనను ఢిల్లీలో చోటు చేసుకున్న ఘటనగా ప్రచారం చేశారు
రాజస్థాన్ లో చోటు చేసుకున్న ఘటనను ఢిల్లీలో చోటు చేసుకున్న ఘటనగా

Claim :
ఢిల్లీ లోని ఉత్తమ్ నగర్ లో హిందూ సంస్థల కార్యకర్తలపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారుFact :
వైరల్ వీడియో రాజస్థాన్ లో చోటు చేసుకున్న ఘటనకు సంబంధించింది
మూడు వారాల ఉద్రిక్త పరిస్థితి కారణంగా ఉత్తమ్ నగర్, పరిసర ప్రాంతాలలో ఢిల్లీ పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రజలు పండుగలను శాంతియుతంగా జరుపుకోవడంతో ఆ ప్రాంతంలో కొన్ని ఆంక్షలను సడలించినట్లు సీనియర్ అధికారులు తెలిపారు. ఈద్, రామ్ నవమి పండుగలను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా జరుపుకోవడంతో ఆ ప్రాంతంలోని పలు ఆంక్షలను ఎత్తివేశారు.
ఉత్తమ్ నగర్లో రెండు కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణలో గాయపడి మరణించిన 26 ఏళ్ల యువకుడు తరుణ్ బూతోలియా కుటుంబ సభ్యులు తమ భద్రతకు, రక్షణకు కోరుతున్నట్లయితే, పిటిషనర్లు పోలీస్ కమిషనర్‌ను సమగ్ర వినతిపత్రంతో సంప్రదించవచ్చని భారత సుప్రీంకోర్టు మార్చి 25, 2026 అనుమతించింది. భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం, పోలీసులు ముప్పు అంచనాను పరిశీలించి నివారణ చర్యలు తీసుకుంటారని తెలిపింది. తరుణ్ కుటుంబ సభ్యుల ఆందోళనలను పరిష్కరించకపోతే, ఆ కుటుంబం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించేందుకు స్వేచ్ఛ ఉంటుందని తెలిపింది.
పోలీసులు లాఠీఛార్జ్ చేస్తుండగా పెద్ద సంఖ్యలో ప్రజలు పరుగులు తీస్తున్న వీడియో ఒకటి వైరల్ అవుతూ ఉంది. ఢిల్లీలోని ఉత్తమ్ నగర్లో బజరంగ్ దళ్ కార్యకర్తలపై జరిగిన చర్యకు సంబంధించినదని పేర్కొంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ప్రజలు పారిపోవడం, గుంపును చెదరగొట్టడానికి పోలీసులు ప్రయత్నించడం వంటి ఉద్రిక్త పరిస్థితిని చూపిస్తున్న ఈ దృశ్యాలను పలువురు వినియోగదారులు పంచుకున్నారు.
వైరల్ పోస్టులకు సంబంధించిన ఆర్కైవ్ లింక్స్ ను ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు
వైరల్ పోస్టులకు సంబంధించిన స్క్రీన్ షాట్ ఇక్కడ ఉంది

ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఈ వీడియో ఢిల్లీకి సంబంధించింది కాదు.
వైరల్ వీడియో లోని స్క్రీన్ షాట్స్ ను తీసుకుని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ నిర్వహించాం. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించిన అదే వీడియోను ఫిబ్రవరి 9, 2026న 'పత్రికా న్యూస్' ఒక కథనాన్ని ప్రచురించింది. దూడ మృతిపై నిష్పక్షపాత విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ బారన్ నగరంలో నిరసన చేస్తున్న గోరక్షకులు, వివిధ హిందూ సంస్థల కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జ్ చేసి చెదరగొట్టారని ఆ నివేదికలో పేర్కొన్నారు.
https://www.patrika.com/baran-
అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ఇక్కడ ఉంది
దీన్ని క్యూగా తీసుకుని మా తదుపరి పరిశోధనలో రాజస్థాన్‌లోని బారన్ జిల్లాలో పశువుల మరణాలపై నెలకొన్న ఉద్రిక్తత సందర్భంగా చోటు చేసుకున్న ఘటన ఇదని మీడియా సంస్థలు తెలిపాయి. ఫిబ్రవరి 6వ తేదీన ఈ వివాదం మొదలైంది. పశువుల మరణాలపై నిష్పక్షపాతంగా విచారణ జరగడం లేదని గోరక్షకులు ఆరోపించారు. దీంతో బారన్లో నగరవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చారు. ప్రతాప్ చౌక్ వద్ద నిరసనకారులకు, పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణ లాఠీచార్జికి దారితీసింది. ఈ ఘటనలో కొందరు గాయపడ్డారని ఆ నివేదికలు తెలిపాయి.
వైరల్ వీడియో లోని లొకేషన్ ను కూడా ఇక్కడ చూడొచ్చు. లొకేషన్ లింక్ ఇక్కడ ఉంది.
అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ఇక్కడ ఉంది.
వైరల్ వీడియో లోని ప్రాంతం, జియో లొకేషన్ లోని ప్రాంతం ఒకటేనని స్పష్టంగా తెలుస్తోంది.
కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. రాజస్థాన్‌లోని బారన్ జిల్లాలో పశువుల మరణాలపై నెలకొన్న ఉద్రిక్తత సందర్భంగా చోటు చేసుకున్న ఘటనను ఢిల్లీకి ఆపాదిస్తున్నారు.
వైరల్ అవుతున్న వాదన నిజం కాదు.
కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. రాజస్థాన్‌లోని బారన్ జిల్లాలో పశువుల మరణాలపై నెలకొన్న ఉద్రిక్తత సందర్భంగా చోటు చేసుకున్న ఘటనను ఢిల్లీకి ఆపాదిస్తున్నారు.
వైరల్ అవుతున్న వాదన నిజం కాదు.
Claim : వైరల్ వీడియో రాజస్థాన్ లో చోటు చేసుకున్న ఘటనకు సంబంధించింది
Claimed By : Social Media Users
Claim Reviewed By : Unknown
Claim Source : Social Media
Fact Check : False
Next Story