ఫ్యాక్ట్ చెక్: దక్షిణాఫ్రికాలోని సుద్వాలా గుహలలో 6000 సంవత్సరాల పురాతన శివలింగం కనిపించడం నిజం కాదు
భారతదేశంలో అనేక ప్రసిద్ధ శివాలయాలు ఉన్నాయి. వాటిలో 12 జ్యోతిర్లింగాలు కూడా ఉన్నాయి. అత్యంత పవిత్రమైనవిగా, కొన్ని వేల

Claim :
వైరల్ వీడియో దక్షిణాఫ్రికాలోని సుద్వాలా గుహలలో 6000 సంవత్సరాల పురాతన శివలింగాన్ని చూపిస్తోందిFact :
వైరల్ వీడియో భారతదేశంలోని దేవాలయాలకు చెందిన రెండు వేర్వేరు శివలింగాలను చూపిస్తుంది
భారతదేశంలో అనేక ప్రసిద్ధ శివాలయాలు ఉన్నాయి. వాటిలో 12 జ్యోతిర్లింగాలు కూడా ఉన్నాయి. అత్యంత పవిత్రమైనవిగా, కొన్ని వేల సంవత్సరాలకు చెందినవని నమ్ముతారు. భారతదేశం వెలుపల కూడా అనేక శివాలయాలు కనిపిస్తాయి. నేపాల్‌లోని పశుపతినాథ్ ఆలయం, ఇండోనేషియాలోని ప్రంబనన్ ఆలయం, పాకిస్తాన్‌లోని కటస్రాజ్ ఆలయంలో శివుడిని దర్శించుకోవడం కోసం దేశ విదేశాల నుండి భక్తులు తరలి వెళ్తూ ఉంటారు.
దక్షిణాఫ్రికాలోని సుద్వాలా గుహలో 6000 సంవత్సరాల పురాతన శివలింగం ఉందని పేర్కొంటూ శివలింగం ఉన్న ఆలయ ప్రాంగణాన్ని చూపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోస్ట్‌లోని శీర్షికలో ఇలా వివరించారు. “దక్షిణాఫ్రికాలో 6000 సంవత్సరాల పురాతన శివలింగం కనుగొన్నారు. ఈ శివలింగం ఒక రహస్యమైన గుహలో ఉంది, అక్కడ ఇతర విగ్రహాలు కూడా ఉన్నాయి. సనాతన ధర్మం అత్యంత పురాతనమైనది. అనాది కాలం నుండి అక్కడ ఉందని ఎటువంటి సందేహం లేదు. సనాతన ధర్మాన్ని అంతం చేయాలని, చాలామంది ప్రయత్నించారు కానీ వారు దానిని అంతం చేయలేకపోయారు. హర్ హర్ మహాదేవ్”
క్లెయిం ఆర్కైవ్ లింక్ ని ఇక్కడ చూడొచ్చు.
ఫ్యాక్ట్ చెక్:
మొదటి ఫోటో:
మరొక ఇన్స్టాగ్రామ్ యూజర్ వీడియోలో కనిపిస్తున్న శివలింగం చిత్రాన్ని ‘పటేశ్వర్ ఆలయం’ అనే క్యాప్షన్‌తో షేర్ చేశారు.
సతారాలోని పటేశ్వర్ ఆలయం గురించి ఇటీవల అప్లోడ్ చేసిన ఒక వీడియోను కూడా మేము కనుగొన్నాము. ఇది వైరల్ వీడియోలో కనిపించే అదే శివలింగాన్ని చూపిస్తుంది. వీడియోలోని వివరణలో పురాతన శివాలయమని ఉంది. 16వ శతాబ్దానికి చెందినదని నమ్ముతారు. ఆలయ సముదాయంలో ప్రత్యేకమైన రాతితో చెక్కబడిన వెయ్యికి పైగా శివలింగాలు ఉన్నాయి. బ్రహ్మ, విష్ణువు, మహిషాసురమర్దిని, అష్టమాత్రుల విగ్రహాలు, అద్భుతమైన నల్ల రాతి శిల్పాలు, ఖగోళ మూలాంశాలు అక్కడ ఉన్నాయి.
రెండో ఫోటో:
ఈ వాదన 2018 నుండి ఆన్లైన్లో ఉంది. పలు ఫ్యాక్ట్ చెక్ సంస్థలు వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని నిర్ధారించాయి.
కాబట్టి, వైరల్ వీడియో దక్షిణాఫ్రికాలోని సుద్వాలా గుహలలో శివలింగాన్ని చూపించడం లేదు. రెండు శివలింగాలు భారతదేశ దేవాలయాలలో భాగం. వైరల్ అవుతున్న వాదన నిజం కాదు.

