Sun Mar 22 2026 16:23:14 GMT+0530 (India Standard Time)
ఫ్యాక్ట్ చెక్: ఇరాన్ కు ప్రధాని నరేంద్ర మోదీ మద్దతు ఇవ్వలేదంటూ ఆయన దిష్టిబొమ్మ దగ్ధం చేశారనే వాదనలో ఎలాంటి నిజం లేదు
ఇరాన్ కు ప్రధాని నరేంద్ర మోదీ మద్దతు ఇవ్వలేదంటూ ఆయన దిష్టిబొమ్మ దగ్ధం చేశారనే వాదన

Claim :
ఇరాన్ కు ప్రధాని నరేంద్ర మోదీ మద్దతు ఇవ్వలేదంటూ ఆయన దిష్టిబొమ్మ దగ్ధం చేశారుFact :
వైరల్ వీడియో 2026, జనవరి నెల నుండి ఆన్ లైన్ లో అందుబాటులో ఉంది
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్‌తో మార్చి 21, 2026న టెలిఫోన్లో సంభాషించారు. మధ్యప్రాచ్య సంక్షోభం తీవ్రమవుతున్న నేపథ్యంలో తమపై జరుగుతున్న దురాక్రమణలను అడ్డుకోవాలని ఇరాన్ భారత్ ను కోరింది. భారతదేశం ఉన్న బ్రిక్స్ కూటమి కూడా స్వతంత్ర పాత్ర పోషించాలని టెహ్రాన్ కోరింది.
ఫిబ్రవరి 28న ఉద్రిక్తతలు చెలరేగినప్పటి నుండి ఇరు దేశాల నాయకుల మధ్య చోటు చేసుకున్న రెండవ ఫోన్ కాల్. భారతదేశంలోని ఇరాన్ రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో "ఇరాన్‌పై అమెరికా, జియోనిస్ట్ పాలన కొనసాగిస్తున్న సైనిక దురాక్రమణల నేపథ్యంలో, ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ అధ్యక్షుడు భారత ప్రధానమంత్రితో టెలిఫోన్లో సంభాషించారు. ఈ సందర్భంగా వారు ద్వైపాక్షిక సంబంధాలు, అలాగే ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై చర్చించి, అభిప్రాయాలను పంచుకున్నారు." అని తెలిపింది. నౌకాయానం స్వేచ్ఛగా కొనసాగాలని, నౌకామార్గాలు తెరచి ఉంచడం, వాటిని సురక్షితంగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇరాన్‌లోని భారతీయుల రక్షణకు ఆ దేశం తీసుకుంటున్న చర్యలను ప్రధాని మోదీ ప్రశంసించారు. చర్చలు, దౌత్యమార్గాల్లోనే సంక్షోభాలను పరిష్కరించుకోవాలని ఇరాన్ అధ్యక్షుడికి సూచించారు.
ఇంతలో భారత ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను తగలబెడుతూ ప్రజలు నిరసన తెలుపుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇజ్రాయెల్‌తో సంబంధాలను కొనసాగిస్తున్నారని, ఇరాన్‌తో ఉద్రిక్తతలు సృష్టించడం వంటి చర్యలకు పాల్పడినందుకు మోదీకి వ్యతిరేకంగా భారతీయులు నిరసన తెలుపుతున్నారని ఆ వీడియోను పోస్టు చేస్తున్నారు.
వైరల్ పోస్టుకు సంబంధించిన ఆర్కైవ్ లింక్ ఇక్కడ ఉంది.
https://archive.ph/ARdKI
వైరల్ వీడియోకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఇజ్రాయెల్‌తో సంబంధాలను కొనసాగిస్తున్నారని, ఇరాన్‌తో ఉద్రిక్తతలు సృష్టించడం వంటి చర్యలకు పాల్పడినందుకు మోదీకి వ్యతిరేకంగా భారతీయులు నిరసన తెలుపుతున్నారనే వాదన నిజం కాదు. ఈ వీడియో 2026, జనవరి నెల నుండి ఆన్ లైన్ లో అందుబాటులో ఉంది.
మేము సంబంధిత కీవర్డ్స్ తో గూగుల్ సెర్చ్ చేశాం. ఇరాన్ పై దాడులను భారత ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతించినట్లుగా ఎలాంటి కథనాలు మాకు లభించలేదు. ఆయన ఖండించినట్లుగా వచ్చిన మీడియా కథనాలను ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.
వైరల్ వీడియోలోని కీఫ్రేమ్‌లను తీసుకుని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఈ వీడియో బీహార్‌లోని ఆరాలో రికార్డు చేసినట్లుగా గుర్తించాం. UGC మార్గదర్శకాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలియజేశారు.
28 జనవరి 2026న పలు సోషల్ మీడియా ఖాతాలలో వైరల్ వీడియోను షేర్ చేశారు. వైరల్ అవుతున్న వీడియోలో “@ara_with_ritik.” అనే వాటర్ మార్క్ ను పరిశీలించాం. ఆ అకౌంట్ లో ఈ వీడియోలు ఉన్నాయి.
పశ్చిమాసియాలోని ప్రస్తుత సంక్షోభానికి ముందే, జనవరి 28, 2026న అప్లోడ్ చేసినట్లుగా కనుగొన్నాము. వీడియోల అసలు వెర్షన్లో ఎలాంటి సంగీతం లేదు, నినాదాలు స్పష్టంగా వినిపించాయి. నిరసనకారులు "యూజీసీని వెనక్కి తీసుకోండి" వంటి నినాదాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి, ఈ వీడియోకు పశ్చిమాసియాలోని ప్రస్తుత సంక్షోభానికి ఎలాంటి సంబంధం లేదని తేలింది.
పలు ఫ్యాక్ట్ చెక్ సంస్థలు కూడా వైరల్ అవుతున్న వీడియోను ఖండించాయి. వాటిని ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.
కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఇజ్రాయెల్‌తో సంబంధాలను కొనసాగిస్తున్నారని, ఇరాన్‌తో ఉద్రిక్తతలు సృష్టించడం వంటి చర్యలకు పాల్పడినందుకు మోదీకి వ్యతిరేకంగా భారతీయులు నిరసన తెలపడం, దిష్టిబొమ్మను తగులబెట్టారనే వాదన నిజం కాదు.
Claim : ఇరాన్ కు ప్రధాని నరేంద్ర మోదీ మద్దతు ఇవ్వలేదంటూ వైరల్ వీడియో 2026, జనవరి నెల నుండి ఆన్ లైన్ లో అందుబాటులో ఉంది
Claimed By : Social Media Users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Social Media
Fact Check : False
Next Story

