Sun Dec 28 2025 22:31:46 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: UKలో ఇస్లామిక్ రాడికల్స్ క్రిస్మస్ చెట్టును తగులబెట్టారనే వాదనలో ఎలాంటి నిజం లేదు.
చైనాలో ఒక పెద్ద క్రిస్మస్ చెట్టు ప్రమాదవశాత్తూ మంటల్లో చిక్కుకుంది

Claim :
UKలో ఇస్లామిక్ రాడికల్స్ క్రిస్మస్ చెట్టును తగులబెట్టారుFact :
చైనాలో ఒక పెద్ద క్రిస్మస్ చెట్టు ప్రమాదవశాత్తూ మంటల్లో చిక్కుకుంది
యునైటెడ్ కింగ్డమ్ లో ప్రజలు క్రిస్మస్ ను ఘనంగా జరుపుకున్నారు. క్రిస్మస్ సందర్భంగా కింగ్ చార్లెస్ ప్రజలకు సందేశాన్ని ఇచ్చారు. తన క్రిస్మస్ ప్రసంగంలో ప్రజలు తమ కమ్యూనిటీల వైవిధ్యంలో బలాన్ని కనుగొని సరైన దిశ వైపు నడవాలని కోరారు. రెండవ ప్రపంచ యుద్ధ తరం స్ఫూర్తిని కింగ్ ఛార్లెస్ ఉదహరించారు. సంవత్సరాలు గడిచేకొద్దీ, రెండవ ప్రపంచ యుద్ధం ముగింపును ఇప్పుడు మనలో తక్కువ మంది గుర్తుంచుకుంటున్నారు. కానీ మన సైనికులు, మహిళల ధైర్యం, త్యాగం ఇంత గొప్ప సవాలును ఎదుర్కొనేందుకు సమాజాలు కలిసి వచ్చిన విధానం మనందరికీ కలకాలం గుర్తుండిపోవాలన్నారు.
బోండి బీచ్ కాల్పులు, మాంచెస్టర్ సినాగోగ్ దాడి తర్వాత ఇతరులను రక్షించడానికి పలువురు చూపిన తెగువను కూడా ప్రశంసించారు. ప్రపంచం ఎప్పటికీ వేగంగా మారుతున్నప్పుడు కొత్త సాంకేతికతలు పుట్టుకు వస్తున్నాయన్నారు. ప్రజా శ్రేయస్సు, సమాజ ఐక్యతపై ఎప్పటికప్పుడు దృష్టి పెట్టాలని కింగ్ ఛార్లెస్ అన్నారు. ఈ పండుగ సమయం తమలో తాము రీఛార్జ్ అవ్వడానికి, సమాజాలు బలంగా ఎదగడానికి ఒక ముఖ్యమైన క్షణం కావచ్చని సూచించారు.
ఇంతలో యునైటెడ్ కింగ్డమ్ లో ఇస్లామిక్ రాడికల్స్ క్రిస్మస్ చెట్టును తగులబెట్టారనే వాదనతో ఓ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
అందుకు సంబంధించిన లింక్స్ ను ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు
యునైటెడ్ కింగ్డమ్లో ఇస్లామిక్ తీవ్రవాదులు క్రిస్మస్ చెట్టును తగలబెట్టారనే వాదనతో, ఒక మాల్ లోపల కాలిపోతున్న ఒక పెద్ద క్రిస్మస్ చెట్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆర్కైవ్ లింక్స్ ఇక్కడ, ఇక్కడ ఉన్నాయి.
వైరల్ ఘటనకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ఇక్కడ ఉన్నాయి.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
UKలో అలాంటి సంఘటన ఇటీవల జరిగిందా అని ధృవీకరించడానికి మేము కీవర్డ్ సెర్చ్ ను నిర్వహించాము. అయితే ఈ ఆరోపణలకు మద్దతు ఇచ్చే విశ్వసనీయ నివేదికలు లభించలేదు.
వైరల్ వీడియో నుండి స్క్రీన్షాట్లను తీసుకొని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయడం ద్వారా మేము మా దర్యాప్తును ప్రారంభించాము. దీని ఫలితంగా డిసెంబర్ 31, 2024న ది న్యూయార్క్ పోస్ట్‌లో ప్రచురితమైన ఒక నివేదిక మాకు లభించింది. అందులో ఇలాంటి వీడియో ఉంది.
ఈ నివేదికల ప్రకారం, ఆ వీడియో చైనాలోని చెంగ్డులోని ఒక షాపింగ్ సెంటర్ లో చోటు చేసుకుందని స్పష్టం చేశారు. క్రిస్మస్ చెట్టుకు మంటలు అంటుకున్నాయని, వెంటనే స్పందించిన మాల్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు.
దీన్ని క్యూగా తీసుకుని మేము గూగుల్ సెర్చ్ చేశాం. చైనా షాపింగ్ మాల్ లో క్రిస్మస్ చెట్టుకు మంటలు అంటుకున్న పలు కథనాలు లభించాయి.
డిసెంబర్ 2024లో ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా అంతర్జాతీయ, చైనీస్ స్థానిక మీడియాకు సంబంధించిన అనేక నివేదికలు లభించాయి.
ఈ నివేదికల ప్రకారం, 2024 డిసెంబర్లో చైనాలోని చెంగ్డులోని సాన్లీ ప్లాజా వద్ద 10 మీటర్ల పొడవైన ఒక పెద్ద క్రిస్మస్ చెట్టు మంటల్లో చిక్కుకుంది. దట్టమైన పొగ ఆ ప్రాంతాన్ని నింపింది. చాలా మంది అగ్నిమాపక యంత్రాలతో పరిగెత్తుకుంటూ వచ్చి నిమిషాల్లోనే మంటలను ఆర్పగలిగారు. ఎవరికీ గాయాలు కాలేదని, అయితే చెట్టు కాలిపోయిందని అధికారులు నివేదించారు.

ప్రాథమిక నివేదికల ప్రకారం సిగరెట్ కారణంగా మంటలు చెలరేగి ఉండవచ్చని తెలిపారు. అయితే, దర్యాప్తు తర్వాత ప్రచురించబడిన తదుపరి నివేదికలు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయని పేర్కొన్నాయి. ఈ సంఘటన ప్రమాదవశాత్తు జరిగిందని, ఎవరూ పనిగట్టుకుని చేసిన నిర్వాకం కాదని ఇది నిర్ధారిస్తుంది.
కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim : చైనాలో ఒక పెద్ద క్రిస్మస్ చెట్టు ప్రమాదవశాత్తూ మంటల్లో చిక్కుకుంది
Claimed By : Social Media Users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Social Media
Fact Check : False
Next Story