Fri Dec 05 2025 08:11:57 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: తిరువనంతపురం ఎయిర్ పోర్టు అదానీ గ్రూప్ కు దక్కకుండా కేరళ ప్రభుత్వం కొనుగోలు చేసిందనే వాదనలో ఎలాంటి నిజం లేదు
తిరువనంతపురం ఎయిర్ పోర్టు అదానీ గ్రూప్ కు దక్కకుండా కేరళ ప్రభుత్వం

Claim :
తిరువనంతపురం ఎయిర్ పోర్టు అదానీ గ్రూప్ కు దక్కకుండా కేరళ ప్రభుత్వం కొనుగోలు చేసిందిFact :
తిరువనంతపురం ఎయిర్ పోర్టు అదానీ గ్రూప్ ఆధీనంలో ఉంది
అదానీ ఎంటర్ప్రైజెస్ వచ్చే 5 నుండి 10 సంవత్సరాలలో తన విమానాశ్రయాలు, అనుబంధ అంశాలపై రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి పెట్టడానికి సన్నాహాలు చేస్తోంది. అదానీ కి చెందిన AAHL ను ప్రపంచ విమానయాన నాయకుడిగా మార్చాలని చూస్తోంది. ఈ గ్రూప్ ప్రస్తుతం భారతదేశం అంతటా ఏడు విమానాశ్రయాలను నిర్వహిస్తోంది. భారతదేశం, విదేశాలలో దాని కార్యకలాపాలను గణనీయంగా పెంచాలని యోచిస్తోంది.
పెట్టుబడిలో భాగంగా టెర్మినల్ సామర్థ్యాన్ని విస్తరించడం, కార్గో మౌలిక సదుపాయాలను పెంచడం కీలకంగా మారింది. హోటళ్ళు, వాణిజ్య స్థలాలు, వ్యాపార పార్కులు వంటి ఆస్తులను అభివృద్ధి చేయడంపై దృష్టి పెడుతుంది. AAHL కు సంబంధించి లాజిస్టిక్స్, గిడ్డంగులు,నిర్వహణ, మరమ్మతులు వంటి సేవలను బలోపేతం చేయాలని కూడా యోచిస్తోంది. విమానాశ్రయాలను కేవలం ప్రయాణ కేంద్రాలుగా కాకుండా సమగ్ర మౌలిక సదుపాయాల పర్యావరణ వ్యవస్థలుగా మార్చే ప్రణాళికలు చేస్తున్నారు. ఈ నిధిలో కొంత భాగం డిజిటలైజేషన్, ఆటోమేషన్, గ్రీన్ ఎనర్జీ, కార్బన్ తగ్గింపు వంటి స్థిరమైన పద్ధతులను పాటించనున్నారు.
ఆ నివేదిక ప్రకారం విమానాశ్రయాల వార్షిక ప్రయాణీకుల నిర్వహణ సామర్థ్యాన్ని ప్రస్తుతం ఉన్న 85 మిలియన్ల నుండి రాబోయే కొన్ని సంవత్సరాలలో 250 మిలియన్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. విమాన ప్రయాణంతో నేరుగా సంబంధం లేని నాన్-ఏరో ఆదాయాలు కూడా గణనీయంగా పెరుగుతాయని అంచనా వేస్తోంది.
ఇంతలో "సంచలన నిర్ణయంతో మోదీకి షాకిచ్చిన కేరళ వామపక్ష ప్రభుత్వం, తిరువనంతపురం ఎయిర్ పోర్టును ప్రైవేటీకరణ చేసి అదానీకి కట్టబెట్టకుండా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి ఎయిర్ పోర్ట్ ను కాపాడిన ముఖ్యమంత్రి పినరయ్ విజయన్” అంటూ ఓ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.
https://www.facebook.com/masthan.basha.5851/posts/1292470862500937/
ఆ ఫోటోలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా ఉన్నారు.
వైరల్ పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. తిరువనంతపురం ఎయిర్ పోర్టు బాధ్యతలు అదానీ గ్రూప్ చేతుల్లోనే ఉన్నాయి.
మేము సంబంధిత కీవర్డ్స్ తో గూగుల్ సెర్చ్ చేయగా 2021 అక్టోబర్ నెలలో తిరువనంతపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు బాధ్యతలు అదానీ గ్రూప్ కు కేటాయించినట్లుగా కథనాలు మాకు లభించాయి.
తిరువనంతపురంలోని అంతర్జాతీయ విమానాశ్రయం నిర్వహణ, అభివృద్ధిని అదానీ గ్రూప్ తీసుకుంది. విమానాశ్రయాన్ని అధికారికంగా స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు. విమానాశ్రయాన్ని ప్రైవేట్ సంస్థలకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ అధికార LDF, ప్రతిపక్ష UDF రెండూ నిరసన వ్యక్తం చేసినప్పటికీ అదానీ సంస్థ విమానాశ్రయ కార్యకలాపాల బాధ్యతలను చేపట్టింది. 2020 సంవత్సరంలో కేరళ అసెంబ్లీ విమానాశ్రయాన్ని ప్రైవేటీకరించడాన్ని నిరసిస్తూ ఏకగ్రీవంగా ఒక తీర్మానాన్ని ఆమోదించింది.
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ విమానాశ్రయాన్ని అదానీ గ్రూప్ స్వాధీనం చేసుకోవడాన్ని విమర్శించారు, ఇది సౌకర్యాల అభివృద్ధి కోసం కాదు, గుత్తాధిపత్యాల ప్రయోజనాలను కాపాడటానికి అంటూ విమర్శించారు. తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని 1932లో స్థాపించారు. ఈ విమానాశ్రయం ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా యాజమాన్యంలో ఉంది.
అందుకు సంబంధించిన కథనాలను ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.
అదానీకి సంబంధించిన సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించగా అదానీ గ్రూప్ కు సంబంధించిన ట్వీట్ ను మేము చూశాం. అక్టోబర్ 14, 2021న తిరువనంతపురం ఎయిర్ పోర్టు బాధ్యతలను తీసుంటున్నట్లు తెలిపారు. ఆ ట్వీట్ ను ఇక్కడ చూడొచ్చు.
ఇక తిరువనంతపురం ఎయిర్ పోర్టుకు సంబంధించి అధికారిక వెబ్ సైట్ ను పరిశీలించగా అదానీ గ్రూప్ యాజమాన్యం పరిధిలో ఉందని స్పష్టంగా తెలుస్తోంది.
https://www.adani.com/
తిరువనంతపురం విమానాశ్రయ నిర్వహణను అదానీ గ్రూప్‌కు అప్పగించాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ కేరళ ప్రభుత్వం 2019లో కేరళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, ఈ పిటిషన్‌ను కేరళ హైకోర్టు 2020 అక్టోబర్‌లో కొట్టివేసింది. కేరళ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ 2020లో కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. సుప్రీంకోర్టు ధర్మాసనం 17 అక్టోబర్ 2022న, ఈ పిటిషన్‌ను కొట్టివేసింది.
అందుకు సంబంధించిన కథనాలను ఇక్కడ, ఇక్కడ చూడచ్చు.
కాబట్టి, తిరువనంతపురం ఎయిర్ పోర్టు అదానీ సంస్థ చేతుల్లోకి వెళ్లకుండా కేరళ ప్రభుత్వం అడ్డుకుందనే వాదనలో ఎలాంటి నిజం లేదు.
వైరల్ అవుతున్న వాదన నిజం కాదు.
Claim : తిరువనంతపురం ఎయిర్ పోర్టు అదానీ గ్రూప్ కు దక్కకుండా కేరళ ప్రభుత్వం
Claimed By : Social Media Users
Claim Reviewed By : Telugu Post
Claim Source : Social Media
Fact Check : False
Next Story

