Fri Dec 05 2025 13:20:18 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: ఎన్ కౌంటర్ అయిన రియాజ్ మృతదేహాన్ని చూడడానికి భారీ ఎత్తున జనం వచ్చారంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు.
కానిస్టేబుల్ అమర్ ఎంపల్లి ప్రమోద్ కుమార్ హత్య కేసులో నిందితుడైన షేక్ రియాజ్

Claim :
నిజామాబాద్ లో ఎన్ కౌంటర్ అయిన రియాజ్ మృతదేహాన్ని చూడడానికి పెద్ద ఎత్తున జనం తరలి వచ్చారుFact :
వైరల్ వీడియోకు, నిజామాబాద్ లో ఎన్ కౌంటర్ అయిన రియాజ్ కు ఎలాంటి సంబంధం లేదు
కానిస్టేబుల్ అమర్ ఎంపల్లి ప్రమోద్ కుమార్ హత్య కేసులో నిందితుడైన షేక్ రియాజ్ సోమవారం (అక్టోబర్ 20, 2025) నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయుధాన్ని లాక్కొని అధికారులపై కాల్పులు జరపడానికి ప్రయత్నించాడని ఆరోపిస్తూ పోలీసులు అతనిని కాల్చి చంపారు. నిజామాబాద్ సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసు నిందితుడు రియాజ్ పోలీసు కాల్పుల్లో మృతి చెందాడని అధికారులు కూడా ధృవీకరించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నిందితుడు, కానిస్టేబుల్ వద్ద తుపాకీ లాక్కొని ట్రిగ్గర్ నొక్కబోయాడు. తుపాకీ కింద పడేయాలని పోలీసులు హెచ్చరించినా వినకపోవడంతో నిందితుడిపై ఆర్ఐ కాల్పులు జరిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీపీ సాయిచైతన్య తెలిపారు.
అయితే రియాజ్ అంత్యక్రియలకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారని పేర్కొంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. పెద్ద ఎత్తున ముస్లింలు హాజరైనట్లుగా విజువల్స్ వైరల్ అవుతున్నాయి. కొందరు అంబులెన్స్ వెనుక పరిగెత్తడం కూడా మనం చూడొచ్చు.
"*నిన్న నిజాంబాద్ లో ఎన్కౌంటర్ అయిన రియాజ్ గాని మృతదేహానికి వాళ్ళు ఇస్తున్న విలువ చూడండి చచ్చినవాడు టెర్రరిస్టు అయినా దేశద్రోహి అయినా ఎవరైనా వారికి సంబంధం లేదు. వాడు ముస్లిం అయితే అంతే వాళ్లంతా ఒకటవుతారు.*
*దయచేసి మిత్రులారా జాతీయ వాదులారా దేశ భక్తులారా ఈ వీడియోను నిశితంగా పరిశీలించి మనమెంత ఐక్యమత్యంగా ఉన్నాము మరి వారు ఎంత ఐకమత్యంగా ఉన్నారు గమనించి కొంచమైనా తెచ్చుకుని కళ్ళు తెరిచి మనవాడు పగవాడైన మనం కూడా ఎవరికి ఏ ఆపద వచ్చినా ధర్మంగా మనమంతా ఒకటేనని చాటి చెప్పే సమయం ఆసన్నమైంది మిత్రులారా దయచేసి అర్థం చేసుకోండి" అంటూ పలువురు పోస్టులు పెట్టారు.
"నిన్న నిజాంబాద్ లో ఎన్కౌంటర్ అయిన రియాజ్(అంట) గాని మృతదేహానికి వాళ్ళు ఇస్తున్న విలువ చూడండి.
చచ్చినవాడు టెర్రరిస్టు అయినా దేశద్రోహి అయినా ఎవరైనా వారికి సంబంధం లేదు. వాడు ముస్లిం అయితే అంతే వాళ్లంతా ఒకటవుతారు. అన్ని మతాలు సమానం అనే భ్రమలో ఉన్నవాళ్లు ఈ వీడియో చూడండి." అంటూ మరికొందరు పోస్టులు పెట్టారు.
వైరల్ పోస్టులకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ను ఇక్కడ చూడొచ్చు
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
మేము రియాజ్ అరెస్ట్-ఎన్ కౌంటర్ కు సంబంధించిన సంఘటనల గురించి మీడియా కథనాలను పరిశీలించాం. నిజామాబాద్ సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ను కిరాతకంగా చంపిన నిందితుడు రియాజ్ పోలీసు కాల్పుల్లో హతమయ్యాడు. అక్టోబర్ 17న రాత్రి ఓ చోరీ కేసులో పట్టుకొస్తుండగా కానిస్టేబుల్ ప్రమోద్‌పై కత్తితో దాడి చేసి అక్కడి నుంచి పారిపోయాడు. నిందితుడు ఆ రాత్రంతా పోలీసులకు దొరక్కుండా తిరిగాడు. అతన్ని పట్టుకోవడానికి నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 9 బృందాలుగా విడిపోయి ముమ్మరంగా గాలించారు. సారంగాపూర్ శివారులో ఉన్నాడనే సమాచారంతో అక్కడికి వెళ్లగా, అక్కడ పాత లారీ క్యాబిన్లో దాక్కొని ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులను పసిగట్టిన రియాజ్ పారిపోవాలని ప్రయత్నించగా సమీపంలోనే ఉన్న ఆసిఫ్ అనే వ్యక్తి పట్టుకునే ప్రయత్నం చేశాడు. నిందితుడు తన వద్ద ఉన్న కత్తితో ఆయనపై దాడి చేసి ఎడమచేతిని తీవ్రంగా గాయపరిచాడు. అప్రమత్తమైన పోలీసులు నిందితుడిని చుట్టుముట్టి తాళ్లతో బంధించి అదుపులోకి తీసుకున్నారు. రియాజ్, ఆసిఫ్ మధ్య జరిగిన పెనుగులాటలో నిందితుడు గాయపడగా, ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న రియాజ్ పహారా కాస్తున్న కానిస్టేబుల్ దగ్గరున్న తుపాకీ లాక్కొని ట్రిగ్గర్ నొక్కే ప్రయత్నం చేశాడు. తుపాకీ కింద పడేయాలని పోలీసులు హెచ్చరించినప్పటికీ నిందితుడు వినిపించుకోలేదు. గత్యంతరం లేని పరిస్థితుల్లో రియాజ్‌పై ఆర్ఐ కాల్పులు జరపగా, చనిపోయినట్లు నిజామాబాద్ సీపీ సాయిచైతన్య తెలిపారు.
అందుకు సంబంధించిన కథనాలను ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.
ఈ ఘటనపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ స్పందించింది. ఎన్ కౌంటర్ కు దారితీసిన పరిస్థితులను వివరిస్తూ వివరణాత్మక వాస్తవ నివేదికను సమర్పించాలని తెలంగాణ డీజీపీని ఆదేవించింది. షేక్ రియాజ్ ఎన్ కౌంటర్‌కు సంబంధించి ఓ పత్రికలో వచ్చిన కథనం ఆధారంగా సుమోటోగా స్వీకరించిన మానవ హక్కుల కమిషన్ ఈ ఆదేశాలను జారీ చేసింది.
ఎక్కడా కూడా రియాజ్ అంత్యక్రియల కోసం పెద్ద ఎత్తున ప్రజలు వచ్చారనే కథనాలు మాకు లభించలేదు.
మేము వైరల్ వీడియోలోని కీ ఫ్రేమ్స్ ను తీసుకుని గూగుల్ రివర్స్ ఇమేజ్ చేయగా ఇది పలమనేరులో చోటు చేసుకున్న ఘటన అంటూ పలు వీడియోలు మాకు లభించాయి.
PALAMANER NEWS అనే యూట్యూబ్ ఛానల్ లో యూనిస్ ను చూసేందుకు ఏరియా ఆసుపత్రికి భారీగా చేరుకున్న స్నేహితులు,బంధువులు | PALAMANER NEWS అనే టైటిల్ తో వీడియోను అప్లోడ్ చేసినట్లు మేము గుర్తించాం. వైరల్ విజువల్స్ తో ఈ వీడియోలోని విజువల్స్ సరిపోలాయి. ఈ వీడియోలో 0:36 వద్ద వైరల్ వీడియోలోని విజువల్స్ ను మనం చూడొచ్చు.

సంబంధిత కీవర్డ్స్ తో సెర్చ్ చేయగా "పలమనేరు రూరల్ మండలంలోని కళ్యాణ రేవు జలపాతంలో పట్టణానికి చెందిన యూనిస్ (23) అనే యువకుడు గల్లంతయ్యాడు. స్నేహితులతో కలిసి జలపాతం చూడటానికి వచ్చిన యూనిస్ ప్రమాదవశాత్తు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయినట్లు సమాచారం. దట్టమైన అడవిలో ఉన్న ఈ జలపాతం వద్దకు చేరుకోవడానికి వర్షం అడ్డంకిగా మారింది. పూర్తి వివరాలు పోలీసుల విచారణలో వెల్లడి కానున్నాయి." అంటూ కథనాలు మాకు లభించాయి.
అందుకు సంబంధించిన కథనాలు మాకు లభించాయి. కళ్యాణ రేవు జలపాతంలో పడి యూనిస్ మరణించాడని కథనాలు తెలిపాయి. ఆ కథనాలను ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.
ఇక రియాజ్ మృతదేహాన్ని చూడడానికి పెద్ద ఎత్తున అతడి స్నేహితులు, బంధువులు వచ్చారంటూ వీడియోలు మాకు లభించాయి.
పోలీస్ ఎన్కౌంటర్లో రియాజ్ 20 అక్టోబర్ 2025న మరణించగా, వైరల్ అవుతున్న వీడియో 18 అక్టోబర్ 2025 నుంచే ఇంటర్నెట్లో ఉన్నాయి.
కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Next Story