Fri Dec 05 2025 21:00:40 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: వందే భారత్ రైలుపై శ్రీరాముడు ఉన్నట్లుగా డిజిటల్ గా సృష్టించారు
శ్రీరాముడి బొమ్మతో వందే భారత్ రైలు

Claim :
శ్రీరాముడి బొమ్మతో వందే భారత్ రైలును ప్రవేశ పెట్టారుFact :
వైరల్ అవుతున్న ఫోటోను డిజిటల్ గా ఎడిట్ చేశారు
భారత రైల్వేలో వందే భారత్ ట్రైన్స్ కు మంచి ఆదరణ దక్కుతోంది. పలు నగరాల మధ్య వందే భారత్ ట్రైన్స్ పరుగులు పెడుతూ ఉన్నాయి. శ్రీనగర్‌ను దేశ రాజధానికి అనుసంధానించే వందే భారత్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జమ్మూలోని కాట్రా నుండి ప్రారంభించే అవకాశం ఉంది. ప్రారంభోత్సవ కార్యక్రమం ఏప్రిల్ 19న జరగాల్సి ఉండగా, దానిని వాయిదా వేశారు. జూన్ మొదటి వారంలో ప్రధాని మోదీ వందే భారత్ రైలును ప్రారంభించడానికి జమ్మూకు ప్రయాణించవచ్చని వర్గాలు తెలిపాయి.
ఈ ప్రారంభోత్సవం జమ్మూ కశ్మీర్ కు ఒక చారిత్రాత్మక క్షణం అవుతుంది. ఈ ప్రాంతంలో పర్యాటకం, వాణిజ్య కార్యకలాపాలను పెంచడానికి సహాయపడుతుంది. ఇటీవల జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన తరువాత వందే భారత్ ట్రైన్ ను ప్రారంభించడం ఓ ఆసక్తికర పరిణామం. పహల్గామ్ దాడి ఘటన పర్యాటక రంగంపై ప్రభావం చూపింది. అప్పటి నుండి ప్రభుత్వం పర్యాటకులను కశ్మీర్ కు తిరిగి రప్పించడానికి ప్రయత్నిస్తోంది. ఈ రైలు గేమ్ ఛేంజర్ గా మారనుంది.
అయితే శ్రీరాముడి బొమ్మ ఉన్న వందే భారత్ ట్రైన్ కు సంబంధించిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. వందే భారత్ ట్రైన్ మీద శ్రీరామ్ అంటూ రాశారని పోస్టుల్లో చెబుతున్నారు.
రాముడిని చిత్రించబడిన రైలును చూపించే చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చాలా మంది వినియోగదారులు ఈ చిత్రాన్ని షేర్ చేస్తున్నారు, ఇది వందే భారత్ ఎక్స్‌ప్రెస్ యొక్క కొత్త డిజైన్ అని చెబుతున్నారు.
అయితే శ్రీరాముడి బొమ్మ ఉన్న వందే భారత్ ట్రైన్ కు సంబంధించిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. వందే భారత్ ట్రైన్ మీద శ్రీరామ్ అంటూ రాశారని పోస్టుల్లో చెబుతున్నారు.
రాముడిని చిత్రించబడిన రైలును చూపించే చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చాలా మంది వినియోగదారులు ఈ చిత్రాన్ని షేర్ చేస్తున్నారు, ఇది వందే భారత్ ఎక్స్‌ప్రెస్ యొక్క కొత్త డిజైన్ అని చెబుతున్నారు.
వైరల్ అవుతున్న పోస్టులకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ను ఇక్కడ చూడొచ్చు
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ ఫోటోలను డిజిటల్ గా సృష్టించారు.
కీలకపదాలను ఉపయోగించి వందే భారత్ రైళ్ల డిజైన్ ఏమైనా మార్చారేమో అని తెలుసుకోడానికి ప్రయత్నించాం. అటువంటి నిర్ణయం తీసుకున్నట్లుగా నిర్ధారించే అధికారిక ప్రకటనలు, మీడియా నివేదికలు మాకు లభించలేదు. రైల్వే మంత్రిత్వ శాఖ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్‌ను కూడా మేము సమీక్షించాము. శ్రీరాముడు చిత్రాలు ఉన్న కొత్త వందే భారత్ డిజైన్ గురించి ప్రస్తావన లేదు.
వైరల్ ఫోటోను తీసుకుని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాం. ఎక్కడా కూడా మాకు సంబంధిత నివేదికలు లభించలేదు.
"the_rail_pilot" అనే ఇన్స్టాగ్రామ్ పేజీలో ఈ ఫోటోను అప్లోడ్ చేసినట్లు మేము గుర్తించాం.
https://www.instagram.com/the_
ఈ అకౌంట్లో పలువురు ప్రముఖుల బొమ్మలతో ట్రైన్స్ ఉన్నట్లుగా ఏఐ తో సృష్టించినట్లు వివరించారు కూడా!!
"A life devoted to Lord Ram is a life filled with blessings! "Jay Shree Ram" May the light of righteousness guide your path!
How it will be! If Indian Railways make such Livery!
These Pictures are Totally made with Artificial Intelligence (AI)
Follow @the_rail_pilot_ for more!" అంటూ శ్రీరాముడి ఫోటోతో ఉన్న ట్రైన్ ఫోటో ఏఐ సృష్టి అని వివరణలో తెలిపారు. ఈ ప్రొఫైల్ లో పలు క్రీడాకారులు, గొప్ప గొప్ప వ్యక్తులకు సంబంధించిన బొమ్మలు ట్రైన్ మీద ఉన్నట్లుగా మనం చూడొచ్చు. పలు పోస్టులకు లక్షల్లో లైక్స్ వచ్చాయి. అలా పలువురు ప్రముఖులతో పాటూ శ్రీరాముడి చిత్రంతో కూడిన ట్రైన్ బొమ్మను కూడా ఏఐ ద్వారా సృష్టించారు. ఈ ఫోటో వైరల్ అవ్వడం, చాలా మంది నిజం అని నమ్మేశారు.
వైరల్ అవుతున్న ఫోటో ఏఐ సృష్టి అవునో.. కాదో తెలుసుకోడానికి హైవ్ మోడరేషన్ టూల్ ను వినియోగించాం. శ్రీరాముడి కళాకృతితో కూడిన కొత్త వందే భారత్ రైలు అంటూ జరుగుతున్న ప్రచారం AI జనరేటెడ్ అని తేలింది.
కాబట్టి, వైరల్ అవుతున్న వందే భారత్ ట్రైన్ ఏఐ ద్వారా సృష్టించారు.
Claim : శ్రీరాముడి బొమ్మతో వందే భారత్ రైలు
Claimed By : Social Media Users
Claim Reviewed By : Telugu Post
Claim Source : Social Media
Fact Check : False
Next Story

