ఫ్యాక్ట్ చెక్: సముద్రం నుండి శ్రీకృష్ణుడి పిల్లనగ్రోవి బయటపడింది అంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు
సముద్రం నుండి శ్రీకృష్ణుడి భారీ పిల్లనగ్రోవి బయటపడింది

Claim :
సముద్రం నుండి శ్రీకృష్ణుడి భారీ పిల్లనగ్రోవి బయటపడిందిFact :
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. అది ఏఐ సృష్టి
నవంబర్ 2025లో ద్వారక తీరం వెంబడి నీటి అడుగున అన్వేషణ, పురావస్తు పరిశోధనలను ప్రారంభించడానికి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) నుండి ఉన్నత స్థాయి బృందం న్యూఢిల్లీ నుండి గుజరాత్‌లోని ద్వారకకు చేరుకుంది. ASI అదనపు డైరెక్టర్ జనరల్ ప్రొఫెసర్ అలోక్ త్రిపాఠి నేతృత్వంలో ASI పునరుద్ధరించిన అండర్ వాటర్ ఆర్కియాలజీ వింగ్ (UAW) ఆధ్వర్యంలో పరిశోధనలు జరగనున్నాయి. ద్వారక, బెట్ ద్వారక సముద్ర ప్రాంతాల్లో మునిగిపోయిన పురావస్తు అవశేషాలను గుర్తించడం, నమోదు చేయడం, శాస్త్రీయంగా అధ్యయనం చేయడం ఈ బృందం లక్ష్యం. ASI గతంలో 2005, 2007 మధ్య ద్వారకలో పరిశోధనలు నిర్వహించింది. అక్కడ పలు శిల్పాలు, పురాతన కట్టడాలు కనుగొనబడ్డాయి. ఈ పరిశోధనల ఆధారంగా, మరిన్ని ప్రాంతాల్లో నీటి అడుగున తవ్వకాలు జరిగాయి.
క్రేన్ ఉపయోగించి నీటిలో నుండి పెద్ద వేణువు లాంటి నిర్మాణాన్ని బయటకు తీస్తున్నట్లు చూపించే ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వినియోగదారులు శ్రీకృష్ణుని వేణువు సముద్రం నుండి కనుగొన్నారని, దానిని నిజమైన సంఘటనగా షేర్ చేస్తున్నారు.
వైరల్ పోస్టుకు సంబంధించిన లింక్స్ ను ఇక్కడ, ఇక్కడ , ఇక్కడ చూడొచ్చు.
వైరల్ అవుతున్న ఆర్కైవ్ లింక్స్ ఇక్కడ, ఇక్కడ ఉన్నాయి
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. వైరల్ వీడియోను ఏఐ ద్వారా సృష్టించారు.
మేము సంబంధిత కీవర్డ్స్ తో గూగుల్ సెర్చ్ చేశాం. అయితే అలాంటి భారీ వేణువు బయటపడినట్లుగా ఎలాంటి మీడియా కథనాలు మాకు లభించలేదు. అలాంటి ఘటన చోటు చేసుకుని ఉండి ఉంటే.. ఖచ్చితంగా మీడియా సంస్థలు ప్రముఖంగా ప్రచురించి ఉండేవి.
వైరల్ వీడియోను మేము నిశితంగా పరిశీలించాము. వీడియో లోని వ్యక్తుల శరీరాలు పూర్తిగా కనిపించకపోవడం, కొన్ని భాగాలు పాక్షికంగా కనిపించకుండా ఉండటం గమనించవచ్చు. ఇక కదలికలు కూడా AI జనరేటెడ్ వీడియోల తరహాలోనే ఉన్నాయి.
వైరల్ విజువల్స్ కు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ను తీసుకుని మేము Googleలో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసాము. jangid__monu_2444 అనే ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో అప్లోడ్ చేసిన అదే వీడియో మాకు కనిపించింది.
https://www.instagram.com/
ఈ వీడియోలో జెమిని లోగోతో కూడిన Veo వాటర్‌మార్క్ కనిపిస్తుంది. ఇది Veo టూల్ ను ఉపయోగించి సృష్టించిన AI- జనరేటెడ్ వీడియోలలో కనిపిస్తుంది. ఈ అకౌంట్ లో పలు ఏఐ వీడియోలను మేము గుర్తించాం. అందులో సముద్రం నుండి శివలింగం బయటకు తీస్తున్నట్లు, బంగారం బయటకు తీస్తున్నట్లుగా పలు వీడియోలు మాకు లభించాయి. ఇవన్నీ ఏఐ ద్వారా సృష్టించి వైరల్ చేస్తున్నవే.
వైరల్ వీడియో AI ద్వారా సృష్టించాదో లేదో ధృవీకరించడానికి, మేము Hive ఏఐ-డిటెక్షన్ టూల్ ను ఉపయోగించి దానిని విశ్లేషించాము. Hive ఈ వీడియో AI-జనరేటెడ్ కంటెంట్‌గా గుర్తించింది.
వైరల్ వీడియో ఏఐ సృష్టి అని పలు ఫ్యాక్ట్ చెక్ సంస్థలు కూడా ధృవీకరించాయి. వాటిని ఇక్కడ చూడొచ్చు.
కాబట్టి, సముద్రంలో నుండి భారీ వేణువును బయటకు తీశారంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు. వైరల్ అవుతున్న వీడియో ఏఐ సృష్టి.

