Sat Dec 07 2024 18:49:59 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: మహేష్ బాబు కుమారుడు గౌతమ్ తెలుగుదేశం పార్టీ కండువాను వేసుకోలేదు. వైరల్ ఫోటోను ఎడిట్ చేశారు.
నటుడు మహేష్ బాబు, అతని కుమారుడు గౌతమ్ ఘట్టమనేని కలిసి నిలబడి ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది
Claim :
మహేష్ బాబు కొడుకు గౌతమ్ టీడీపీ గుర్తు ఉన్న స్టోల్ ధరించాడుFact :
గౌతమ్ తన గ్రాడ్యుయేషన్ వేడుకకు హాజరైనప్పుడు పసుపు రంగు స్టోల్ ధరించాడు
లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరికొద్ది రోజుల్లో వెలువడనున్న నేపథ్యంలో రాజకీయ వాతావరణం రోజురోజుకూ వేడెక్కుతోంది. అభ్యర్థులే కాదు, ప్రజలు కూడా ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎన్నికల ఫలితాలు ఎప్పుడు వస్తాయా అని ఆత్రుతగా ఎదురుచూస్తూ ఉన్నారు.
ఈ నేపథ్యంలో, నటుడు మహేష్ బాబు, అతని కుమారుడు గౌతమ్ ఘట్టమనేని కలిసి నిలబడి ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఇద్దరూ కలిసి ఉన్న ఒక ఫోటో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతూ ఉంది. ఫోటోలో, గౌతమ్ టీడీపీ (తెలుగు దేశం పార్టీ) జెండా గుర్తుతో పసుపు స్టోల్ ధరించి ఉన్నాడు.
“MESSAGE IS CLEAR” అంటూ ఈ ఫోటోను వైరల్ చేస్తున్నారు.
“మహేష్ బాబు కూడా TDP ఎరా” అంటూ ఈ ఫోటోను సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని మేము కనుగొన్నాము.
గౌతమ్ స్టోల్‌కు టీడీపీ జెండా లోగో ఉండేలా ఫోటోను ఎడిట్ చేశారు. అసలు చిత్రంలో.. గౌతమ్ తన గ్రాడ్యుయేషన్ వేడుక కోసం ISH (ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ హైదరాబాద్) లోగోను ముద్రించిన పసుపు స్టోల్ ధరించాడు.
వైరల్ పోస్ట్ కామెంట్స్ విభాగంలో.. పలువురు యూజర్లు వైరల్ ఫోటోను పోలిన మరొక ఫోటోను పంచుకున్నారు. ఈ ఫోటోలో మహేష్ బాబు అతని భార్య నమ్రతా శిరోద్కర్, వారి కుమారుడు గౌతమ్, వారి కుమార్తె సితార కలిసి ఉన్నారు. ఈ ఫోటోలో, గౌతమ్ అదే పసుపు స్టోల్ ధరించాడు కానీ దానిపై వేరే లోగో ఉంది.
జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత, వైరల్ ఇమేజ్ ఎడిట్ చేశారని.. అసలు ఫోటోలో ఉన్న గుర్తులతో పోలిస్తే పూర్తిగా భిన్నంగా ఉన్నాయని స్పష్టంగా తెలుస్తుంది.
మహేష్ బాబు కుటుంబ సభ్యులు పెట్టిన పలు ఫోటోలలో ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ సింబల్ కనిపించలేదు. ఆ ఫోటోలలో "ISH 2024" అని మాత్రమే పసుపు రంగు కండువా మీద ఉంది.
రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. మహేష్ బాబు తన సోషల్ మీడియా అకౌంట్ లో వీడియోను పోస్టు చేశారు. “My heart bursts with pride! Congratulations on your graduation, son! This next chapter is yours to write, and I know you’ll shine brighter than ever. Keep chasing your dreams, and remember, you’re always loved! I am a proud father today @gautamghattamaneni” అంటూ శుభాకాంక్షలు చెబుతూ పోస్టు పెట్టాడు. తన కుమారుడు సాధించిన దానికి ఎంతో గర్వంగా ఉందని.. భవిష్యత్తులో మరింత ఎత్తుకు వెళ్లాలని తన కొడుకు విషయంలో ఆకాంక్షించాడు.
అదే పోస్ట్‌లో, మహేష్ బాబు గౌతమ్ తో కలిసి ఉన్న ఫోటోలు, వీడియోను పంచుకున్నట్లు మేము కనుగొన్నాము. పోస్ట్‌లో, గౌతమ్ ISH లోగోతో ముద్రించిన స్టోల్ ధరించాడు. వీడియోలో, గౌతమ్ అదే యూనిఫామ్‌తో డిగ్రీ పొందుతున్నట్లు చూడొచ్చు.
మేము ISH గురించి తెలుసుకోడానికి సెర్చ్ చేయగా.. అది "ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ హైదరాబాద్" అనే విద్యా సంస్థకు సంబంధించినదని మేము కనుగొన్నాము. వారి వెబ్సైట్లో ISH లోగోను చూడొచ్చు.
రివర్స్ ఇమేజ్ సెర్చ్ సమయంలో, అనేక మీడియా పేజీలు ఒకే ఫోటోగ్రాఫ్‌లను షేర్ చేసినట్లు కూడా మేము కనుగొన్నాము.
మే 27, 2024 న హిందూస్తాన్ టైమ్స్ “మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ కొడుకు గౌతమ్ గ్రాడ్యుయేషన్ వేడుకకు హాజరయ్యారు" అనే శీర్షికతో ఒక కథనాన్ని ప్రచురించింది.
న్యూస్ 18 కూడా.. మహేష్ బాబు తన కొడుకు గౌతమ్ ఘట్టమనేని గ్రాడ్యుయేషన్ వేడుకకు హాజరయ్యారని కథనాన్ని ప్రచురించింది. పలు తెలుగు మీడియా సంస్థలు కూడా మహేష్ బాబు తన కొడుకు గురించి పెట్టిన పోస్టుపై కథనాలను ప్రచురించాయి. ఎందులోనూ గౌతమ్ టీడీపీ కండువాను కప్పుకుని కనిపించలేదు.
మా పరిశోధన, అనేక మీడియా నివేదికల ఆధారంగా, వైరల్ చిత్రం ఎడిట్ చేశారని మేము కనుగొన్నాము. మహేశ్ బాబు తనయుడు గౌతమ్ గ్రాడ్యుయేషన్ వేడుకకు హాజరైన సందర్భంగా ఐఎస్‌హెచ్ లోగో ఉన్న పసుపు రంగు స్టోల్ ను ధరించాడు.
Claim : మహేష్ బాబు కొడుకు గౌతమ్ టీడీపీ గుర్తు ఉన్న స్టోల్ ధరించాడు
Claimed By : Social Media Users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Social Media
Fact Check : False
Next Story