Sun Mar 29 2026 01:38:23 GMT+0530 (India Standard Time)
ఫ్యాక్ట్ చెక్: భారతదేశం వద్ద కేవలం రెండు రోజులకు మాత్రమే సరిపడ ఇంధనం ఉందని ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు
భారతదేశం వద్ద కేవలం రెండు రోజులకు మాత్రమే సరిపడ ఇంధనం ఉందని ప్రభుత్వం ఎలాంటి ప్రకటన

Claim :
భారతదేశం వద్ద కేవలం రెండు రోజులకు మాత్రమే సరిపడ ఇంధనం ఉందని ప్రభుత్వం ప్రకటించిందిFact :
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లతో ఉన్నత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహించారు. దాదాపు నెల రోజులుగా నిరంతరాయంగా కొనసాగుతున్న పశ్చిమ ఆసియా యుద్ధానికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. కోవిడ్ మహమ్మారి సమయంలో దేశం పనిచేసిన విధంగానే అన్ని రాష్ట్రాలు “టీమ్ ఇండియా”గా జట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. వాణిజ్య స్థిరత్వాన్ని కాపాడుకోవడం, ఇంధన భద్రతను నిర్ధారించడం, పరిశ్రమలను మరియు సరఫరా గొలుసులను బలోపేతం చేయడం, పౌరుల ప్రయోజనాలను పరిరక్షించడంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. భారతదేశం అప్రమత్తంగా, సన్నద్ధంగా ఉండాలని మోదీ స్పష్టం చేశారు.
ఇలాంటి ప్రపంచవ్యాప్త అంతరాయాలను సమర్థవంతంగా ఎదుర్కోవడంలో దేశానికి గతంలో అనుభవం ఉందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. కోవిడ్ మహమ్మారి సమయంలో సరఫరా గొలుసులు, వాణిజ్యం, దైనందిన జీవితంపై ప్రభావాన్ని తగ్గించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేసిన సమన్వయ ప్రతిస్పందనను ఆయన గుర్తుచేసుకున్నారు.
అయితే భారతదేశం వద్ద కేవలం రెండు రోజులకు మాత్రమే సరిపడ ఇంధనం ఉందని ప్రభుత్వం ప్రకటించిందని కొన్ని పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
వైరల్ పోస్టులకు సంబంధించిన ఆర్కైవ్ లింక్ ను ఇక్కడ చూడొచ్చు
వైరల్ స్క్రీన్ షాట్ ఇక్కడ ఉంది
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
కేంద్రప్రభుత్వం అలాంటి ప్రకటన ఏదైనా చేసిందా అని తెలుసుకోవడం కోసం మేము సంబంధిత కీవర్డ్స్ తో గూగుల్ సెర్చ్ చేశాం. అయితే ఎక్కడా కూడా అలాంటి ప్రకటన చేయలేదు.
ప్రధాని నరేంద్ర మోదీ కూడా ముఖ్యమంత్రులతో మాట్లాడుతూ ఎనర్జీ లాక్ డౌన్ లాంటిదేమీ ఉండదని స్పష్టం చేశారు. వంటగ్యాస్ కొరత, చమురు సరఫరాలో అంతరాయాల నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో ప్రజలు భయాందోళనలతో వస్తువులను కొనుగోలు చేయడం, నిల్వ చేసుకోవడం వంటివి చేస్తుండగా 'ఇంధన లాక్డౌన్' వదంతులను ప్రధాని తోసిపుచ్చారు. దేశవ్యాప్త లాక్డౌన్ ఉండదని ఆయన ఖచ్చితంగా చెప్పారు.
అందుకు సంబంధించిన కథనాలను ఇక్కడ చూడొచ్చు.
ఇక PIB Fact Check సంస్థ కూడా వదంతులను తోసిపుచ్చింది. భారతదేశంలో కేవలం 2 రోజులకు సరిపడా పెట్రోల్ మాత్రమే మిగిలి ఉందని భారత పెట్రోలియం మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించిందని ఒక సోషల్ మీడియా పోస్ట్ పేర్కొంటోంది. ఈ వాదన నకిలీదని తేల్చి చెప్పింది. పెట్రోలియం మంత్రిత్వ శాఖ అలాంటి ప్రకటన ఏదీ చేయలేదు. భారతీయ రిఫైనరీలు 100 శాతం నడుస్తున్నాయి. రాబోయే 60 రోజుల ముడి చమురు సరఫరాలను భారతీయ చమురు కంపెనీలు ఇప్పటికే ఉన్నాయి. భారతదేశానికి 74 రోజుల మొత్తం రిజర్వ్ సామర్థ్యం ఉంది, ప్రస్తుతం వాస్తవ నిల్వలు సుమారు 60 రోజులకు సరిపోతాయి (ముడి చమురు నిల్వలు, ఉత్పత్తుల నిల్వలు కేవర్న్లలోని ప్రత్యేక వ్యూహాత్మక నిల్వలతో కలిపి) అని తెలిపింది. రాబోయే చాలా నెలల వరకు భారతదేశం పూర్తిగా సురక్షితంగా ఉంది. ఇటువంటి సరఫరా పరిస్థితిలో వ్యూహాత్మక కేవర్న్ నిల్వలోని పరిమాణం ద్వితీయ ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. ఖచ్చితమైన సమాచారం కోసం ఎల్లప్పుడూ అధికారిక మూలాలపైనే ఆధారపడాలని కోరింది.
ఇక పలు వదంతులను కూడా ప్రభుత్వం ఖండించింది. అలాంటి అపోహలను నమ్మకండని ప్రభుత్వం సూచించింది.
.
కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. భారతదేశం వద్ద కేవలం రెండు రోజులకు మాత్రమే సరిపడ ఇంధనం ఉందని ప్రభుత్వం ప్రకటించలేదు.
Claim : వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు
Claimed By : Social Media Users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Social Media
Fact Check : False
Next Story

