Sat Dec 13 2025 22:32:15 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ 2025లో భాగంగా భారత్ పాకిస్థాన్ ఆటగాళ్ల మధ్య ఎలాంటి గొడవ జరగలేదు
రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ 2025లో భాగంగా భారత్ పాకిస్థాన్ ఆటగాళ్లు

Claim :
రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ 2025లో భాగంగా భారత్ పాకిస్థాన్ ఆటగాళ్లు చొక్కాలు పట్టుకుని మరీ కొట్లాడారుFact :
వైరల్ వీడియోను ఏఐ ద్వారా సృష్టించారు
దోహాలోని వెస్ట్ ఎండ్ పార్క్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ 2025లో భాగంగా జరిగిన గ్రూప్ బి మ్యాచ్‌లో ఇండియా ఎ జట్టు పాకిస్తాన్ షాహీన్స్ చేతిలో ఎనిమిది వికెట్ల తేడాతో ఓడిపోయింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇండియా ఎ జట్టు 19 ఓవర్లలో 136 పరుగులకే ఆలౌట్ అయింది. 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ 28 బంతుల్లో 45 పరుగులు చేసి భారత క్రికెట్ జట్టు తరఫున అత్యధిక స్కోరు సాధించాడు. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ షాహీన్స్ జట్టు 13.2 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది.
ఆ తర్వాతి మ్యాచ్ లో గెలిచి భారత్ A జట్టు సెమీస్‌కు చేరుకుంది. లీగ్ స్టేజ్‌లో ఒమన్‌పై విజయం సాధించింది. ఒమన్ నిర్దేశించిన 136 పరుగుల లక్ష్యాన్ని భారత్ A కేవలం నాలుగు వికెట్లను కోల్పోయి ఛేదించింది.
అయితే భారత్-పాకిస్థాన్ జట్ల ఆటగాళ్లు కాలర్లు పట్టుకుని మరీ కొట్లాడినట్లుగా కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి.
భారత, పాకిస్తాన్ క్రికెట్ జట్ల జెర్సీల మాదిరిగా కనిపించే బట్టలు ధరించిన వ్యక్తులు మైదానంలో గొడవ పడుతున్నట్లు చూపించే వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశారు. షార్జాలో రెండు జట్ల ఆటగాళ్ల మధ్య జరిగిన గొడవ అంటూ చెబుతున్నారు. ఈ వీడియోలో వ్యక్తులు తీవ్ర వాగ్వాదంలోమునిగిపోయినట్లు, మరికొందరు వారిని శాంతింపజేయడానికి ప్రయత్నిస్తున్నట్లు ఉంది.
వైరల్ పోస్టులకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ను ఇక్కడ చూడొచ్చు
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఏఐ ద్వారా వీడియోను సృష్టించారు.
మేము సంబంధిత కీవర్డ్స్ తో గూగుల్ సెర్చ్ చేశాం. అటువంటి ఘటన చోటు చేసుకుని ఉండి ఉంటే తప్పకుండా వార్తల్లో నిలిచి ఉండేది.
వైరల్ వీడియో లోని కీఫ్రేమ్‌లలో ఒకదాన్ని తీసుకుని గూగుల్ లెన్స్ ఉపయోగించి తనిఖీ చేశాం. ఈ వీడియోను పలు సోషల్ మీడియా ఖాతాలలో షేర్ చేశారు.
వైరల్ వీడియోను నిశితంగా పరిశీలించగా వీడియోలో ఎన్నో తప్పులు మాకు కనిపించాయి. ముఖ్యంగా PAKISTAN స్పెల్లింగ్ లో కూడా తేడాలను మేము గమనించాం. ఇక ఆటగాళ్లు గాలిలో ఉండడం, అంపైర్ల తల మీద ఉండే ఐసీసీ లోగోలో కూడా తేడాలను మనం గమనించవచ్చు.
గాల్లో ఉన్న ఆటగాళ్లు
అంపైర్ తల మీద హ్యాట్ లో ఉండాల్సిన ఐసీసీ లోగోలో తేడాలు
ఇక వైరల్ వీడియోలో భారత జెర్సీ వేసుకున్న యువకుడు అసలు భారత జట్టులోనే లేడు.
భారత ఆటగాళ్లకు సంబంధించిన ఫోటోలను ఇక్కడ చూడొచ్చు.
వైరల్ వీడియో ను తీసుకుని మేము ఏఐ డిటెక్షన్ టూల్స్ లో వెతికాం. ఈ వీడియో ఏఐ సృష్టి అని పలు డిటెక్షన్ టూల్స్ తేల్చాయి.
అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ను ఇక్కడ చూడొచ్చు.
భారత్-పాకిస్థాన్ ఆటగాళ్ల మధ్య ఎలాంటి గొడవ జరగలేదంటూ పలు మీడియా సంస్థలు నిజ నిర్ధారణ చేశాయి. అందుకు సంబంధించిన లింక్స్ ను ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.
కాబట్టి, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సృష్టించిన వీడియోను భారత్-పాకిస్థాన్ ఆటగాళ్ల మధ్య ఎమర్జింగ్ స్టార్స్ ఆసియా కప్ టోర్నమెంట్ లో జరిగిన గొడవగా ప్రచారం చేస్తున్నారు.
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
కాబట్టి, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సృష్టించిన వీడియోను భారత్-పాకిస్థాన్ ఆటగాళ్ల మధ్య ఎమర్జింగ్ స్టార్స్ ఆసియా కప్ టోర్నమెంట్ లో జరిగిన గొడవగా ప్రచారం చేస్తున్నారు.
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim : రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ 2025లో భాగంగా భారత్ పాకిస్థాన్ ఆటగాళ్లు
Claimed By : Social Media Users
Claim Reviewed By : Telugu Post Fact Check
Claim Source : Social Media
Fact Check : False
Next Story

