ఫ్యాక్ట్ చెక్: ఏప్రిల్ 1, 2026 నుండి సోషల్ మీడియా, ఇమెయిల్, ఇతర డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లను యాక్సెస్ చేయడానికి ఆదాయపు పన్ను శాఖకు అధికారం ఉంటుందనే వాదన నిజం కాదు.
సోషల్ మీడియా, ఇమెయిల్, ఇతర డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లను యాక్సెస్ చేయడానికి ఆదాయపు పన్ను శాఖకు

Claim :
ఏప్రిల్ 1, 2026 నుండి ట్యాక్స్ పేయర్స్ సోషల్ మీడియా, ఇమెయిల్, ఇతర డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లను యాక్సెస్ చేయడానికి ఆదాయపు పన్ను శాఖకు అధికారం ఉంటుందిFact :
వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉంది
పాన్ కార్డు వినియోగదారులు డిసెంబర్ 31, 2025 కి ముందు తమ కార్డును ఆధార్ తో లింక్ చేసుకోవడం చాలా అవసరం. జనవరి 1, 2026 నుండి లింక్ చేయని అన్ని పాన్ లను ఆదాయపు పన్ను శాఖ పనిచేయనివిగా ప్రకటించే అవకాశం ఉంది. ఏప్రిల్ 3, 2025న జారీ చేసిన నోటిఫికేషన్ నంబర్ 26/2025 ప్రకారం, అక్టోబర్ 1, 2024 కి ముందు ఆధార్ నమోదు ID ని ఉపయోగించి తమ పాన్ కార్డును పొందిన వినియోగదారులు 2025 చివరి నాటికి తమ ఆధార్ కార్డు నంబర్ ఉపయోగించి పాన్ తో అనుసంధాన ప్రక్రియను పూర్తి చేయాలి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ ఈ నిబంధనలను పాటించకపోతే, ఆర్థిక పరిణామాలు ఉంటాయని స్పష్టం చేసింది. ఇందులో జనవరి 1, 2026 నుండి ఆదాయపు పన్ను వాపసులను నిలిపివేయడం అలాగే అధిక పన్ను వర్తింపజేయడం కూడా ఉండవచ్చు. లింకేజీని పూర్తి చేయడానికి, పన్ను చెల్లింపుదారులు చెల్లుబాటు అయ్యే పాన్, ఆధార్ నంబర్, వన్-టైమ్ పాస్వర్డ్లు (OTPలు) పొందడానికి రిజిస్టర్డ్ మొబైల్ ఫోన్‌తో సహా నిర్దిష్ట పత్రాలను కలిగి ఉండాలి.
"సోషల్ మీడియాపై ఆదాయపు పన్ను నిఘా
డిజిటల్ యుగంలో పన్ను ఎగవేతదారుల ఆట కట్టించేందుకు కేంద్రప్రభుత్వం సరికొత్త అస్త్రాన్ని సిద్ధం చేస్తోంది." అంటూ పలు మీడియా కథనాలను ప్రచురించారు.
"డిజిటల్ యుగంలో పన్ను ఎగవేతదారుల ఆట కట్టించేందుకు కేంద్రప్రభుత్వం సరికొత్త అస్త్రాన్ని సిద్ధం చేస్తోంది. ఇప్పటివరకూ కేవలం బ్యాంకు లావాదేవీలు, ఆస్తి రిజిస్ట్రేషన్లకే పరిమితమైన ఐటీ నిఘా, ఇక పై సోషల్ మీడియా ఖాతాల్లోకి కూడా ప్రవేశించబోతోంది. 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న ఈ కొత్త అధికారాలతో పన్ను ఎగవేతదారులకు ఇబ్బందులు తప్పవు" అంటూ పలు కథనాలను కూడా మీడియా సంస్థలు ప్రచురించాయి. ఆ కథనాలను ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.
ఇక వైరల్ పోస్టులకు సంబంధించిన ఆర్కైవ్ లింక్స్ ను ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు
వైరల్ పోస్టులకు చెందిన స్క్రీన్ షాట్ ఇక్కడ ఉంది.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉన్నాయి.
మేము సంబంధిత కీవర్డ్స్ తో సెర్చ్ చేయగా.. ఏప్రిల్ 1, 2026 నుంచి ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ ప్రజల సోషల్ మీడియా ఖాతాలు, ఈమెయిల్స్, ఇతర డిజిటల్ వేదికలపై నిఘా పెట్టనుందంటూ జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఈ పోస్ట్ లను తప్పుదారి పట్టించేదిగా స్పష్టం చేసింది. నిజాయితీగల పన్ను చెల్లింపుదారులు ప్రభావితమవ్వరు. పన్ను ఎగవేతకు సంబంధించిన ఆధారాల కారణంగా పన్ను చెల్లింపుదారు అధికారిక సెర్చ్ ఆపరేషన్‌కు గురైతే తప్ప, వారి ప్రైవేట్ డిజిటల్ స్థలాలను యాక్సెస్ చేయడానికి విభాగానికి అధికారం లేదు" అని PIB పేర్కొంది. ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులచే సామూహిక డిజిటల్ నిఘాను క్లెయిమ్ చేస్తూ తప్పుదారి పట్టించే పోస్ట్ లను షేర్ చేశారని PIB హైలైట్ చేసింది. PIB ప్రకారం, ఆదాయపు పన్ను శాఖ సాధారణ అంచనాలు, డేటా ప్రాసెసింగ్ లేదా స్క్రూటినీ కేసుల కోసం ప్రైవేట్ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లను యాక్సెస్ చేయదు. చట్టాన్ని గౌరవించే పన్ను చెల్లింపుదారులు ఈ నిబంధనల వల్ల ప్రభావితం కారని ప్రభుత్వం స్పష్టం చేసింది.
అందుకు సంబంధించిన ట్వీట్ ను ఇక్కడ చూడొచ్చు.
ఇక పలు మీడియా సంస్థలు కూడా వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేవంటూ కథనాలను ప్రచురించాయి. ఆ కథనాలను ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.
ఎవరి డిజిటల్ స్పేస్ ను పరిశీలించే అవకాశం ఉంటుంది?
ఈ కథనాల ప్రకారం ప్రభుత్వం వివరణ ఇచ్చింది. భారీగా పన్ను ఎగవేసినట్లు బలమైన ఆధారాలు ఉండి, ఒక వ్యక్తి లేదా సంస్థపై అధికారికంగా సోదాలు జరుగుతున్నప్పుడు మాత్రమే వారి డిజిటల్ స్పేస్‌ను పరిశీలించే అధికారం అధికారులకు ఉంటుంది. ఇప్పటికే అమల్లో ఉన్న ఆదాయ పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 132 ప్రకారం భౌతిక సోదాల సమయంలో పత్రాలు, ఆధారాలు స్వాధీనం చేసుకునే అధికారం ఉంది. ఇప్పుడు డిజిటల్ యుగానికి అనుగుణంగా ఆ నిబంధనలను ఆధునికీకరించారు. ఆన్లైన్ బ్యాంకింగ్, డిజిటల్ వాలెట్లు, క్రిప్టో ఆస్తులు, ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌లు, కమ్యూనికేషన్ రికార్డులు వంటి వర్చువల్ డిజిటల్ స్పేస్‌లను కూడా సోదాల్లో భాగంగా పరిశీలించవచ్చు.
సోదాలు, తనిఖీల సమయంలో డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకొనే అధికారం ఆదాయపు పన్ను చట్టం, 1961లో కూడా ఉందని, మారిన పరిస్థితులకు అనుగుణంగా డిజిటల్ రికార్డుల స్వాధీనం అనేది కొత్తగా చేర్చారని కేంద్రం స్పష్టం చేసింది. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉన్నాయి.

