Sat Apr 11 2026 13:54:16 GMT+0530 (India Standard Time)
ఫ్యాక్ట్ చెక్: గుజరాత్ లో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదాన్ని గుంటూరులో జరిగిన ఘటనగా ప్రచారం చేస్తున్నారు
గుజరాత్ లో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదాన్ని గుంటూరులో జరిగిన ఘటనగా

Claim :
గుంటూరులో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ ఇవిFact :
ఈ ఘటన గుజరాత్ లో జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఘటన కాదు
రోడ్డు ప్రమాదాల నివారణకు అధికారులు ఎంతగానో ప్రయత్నాలు చేస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడపడం, సేఫ్ అండ్ డిఫెన్సింగ్ డ్రైవింగ్ పద్ధతులు అనుసరించడం ద్వారా ప్రమాదాలు తగ్గించవచ్చు. బైక్ నడిపే సమయంలో హెల్మెట్, కారు, ఇతర ఫోర్ వీల్ నడిపే వాహనదారులు సీటుబెల్ట్ వినియోగం తప్పనిసరి చేశారు. ముఖ్యంగా రాంగ్ రూట్ లో డ్రైవింగ్ చేస్తూ ఎంతో మంది ప్రాణాలను కోల్పోతున్నారు. సాంకేతికంగా మనం ఎంత ముందుకు వెళ్తున్నా, రహదారులపై మాత్రం మన ప్రాణాలకు భద్రత లేకుండా పోతోందని పలు నివేదికలు చెబుతున్నాయి. భారతదేశంలో రోడ్డు ప్రమాదాల కారణంగా ప్రతి సంవత్సరం లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఎంతో మంది శాశ్వత వైకల్యానికి గురవుతున్నారు.
ఒక కుటుంబ పెద్ద రోడ్డు ప్రమాదంలో మరణిస్తే లేదా వైకల్యానికి గురైతే, ఆ కుటుంబం ఆర్థికంగా, మానసికంగా ఎంతగానో కుంగిపోతుందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. పిల్లల భవిష్యత్తు అంధకారమవుతుంది. ఈ వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంది. నేటి యువత, డ్రైవర్లు చేసే అతిపెద్ద తప్పు డ్రైవింగ్ చేస్తూ మొబైల్ మాట్లాడటం, టెక్స్ట్ మెసేజ్‌లు చేయడం వంటివి చేస్తున్నారు. మన దృష్టి ఒక్క సెకను రోడ్డు మీద నుండి మళ్లినా, అది భారీ మూల్యం చెల్లించుకునేలా చేస్తుంది. మద్యం మత్తులో వాహనం నడపడం కేవలం తప్పు మాత్రమే కాదు, అది సామాజిక ద్రోహం. మద్యం మనిషి ఆలోచనా శక్తిని, ప్రతిస్పందించే వేగాన్ని తగ్గిస్తుందని నిపుణులు చెబుతూనే ఉన్నారు. దీనివల్ల డ్రైవర్ తన ప్రాణాలతో పాటు ఎదుటివారి ప్రాణాలను కూడా బలిగొంటున్నాడు. ఇక సిగ్నల్ జంప్ చేయడం, రాంగ్ రూట్లో వెళ్లడం, ఇండికేటర్లు వేయకుండా మలుపులు తిరగడం, ఓవర్టేక్ చేయడం వంటి చిన్న చిన్న ఉల్లంఘనలే భారీ ప్రమాదాలకు దారితీస్తాయి.
తాజాగా ఓ రోడ్డు ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ వాట్సాప్ లో వైరల్ అవుతూ ఉన్నాయి. ఈ ఘటన గుంటూరు నగరంలో చోటు చేసుకుందంటూ పోస్టులు పెట్టారు.
వైరల్ వాట్సాప్ మెసేజీకి సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు
ఫ్యాక్ట్ చెకింగ్:
ఈ పోస్టు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉంది. వైరల్ వీడియో గుంటూరులో చోటు చేసుకున్న ఘటనకు సంబంధించింది కాదు. ఇది రాజస్థాన్ లో చోటు చేసుకున్న ఘటన.
గుంటూరులో ఇలాంటి ప్రమాదం చోటు చేసుకుండా అని తెలుసుకోడానికి మేము మేము సంబంధిత కీవర్డ్స్ తో గూగుల్ సెర్చ్ చేశాం. అయితే మాకు అందుకు సంబంధించి ఎలాంటి తెలుగు మీడియా కథనాలు లభించలేదు.
ఇక వైరల్ వీడియోను నిశితంగా పరిశీలించగా అందులోని నెంబర్ ప్లేట్ మీద GJ అని ఉండడం మేము గుర్తించాం. ఇది గుజరాత్ కు సంబంధించింది అని స్పష్టమవుతోంది.
మేము సంబంధిత వీడియో లోకి ఫ్రేమ్ ను తీసుకుని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఈ ఘటన అహ్మదాబాద్ లో చోటు చేసుకుందని పలు సోషల్ మీడియా అకౌంట్లలో తెలిపారు.
ఇక దీన్ని క్యూగా తీసుకుని గూగుల్ సెర్చ్ చేయగా పలు మీడియా సంస్థలు కథనాలను ప్రచురించాయి. వాటిని ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.
అహ్మదాబాద్‌లోని షా ఆలం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. రోడ్డుకు రాంగ్ రూట్ లో స్కూటర్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు అమ్మాయిలు, ఎదురుగా వస్తున్న AMTS బస్సును ఢీకొట్టారు. తరువాత వెలుగులోకి వచ్చిన సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం, ఆ అమ్మాయిలు రోడ్డుకు రాంగ్ రూట్ లో ప్రయాణిస్తూ మలుపు తీసుకున్నారు. అదే సమయంలో AMTS బస్సు కూడా మలుపు తీసుకుంటోంది. బస్సు స్కూటర్‌ను ఢీకొట్టింది. దీంతో స్కూటర్‌పై ఉన్న ఇద్దరు మహిళలు కిందపడిపోయారు. అయితే, ఈ ఘటనలో ఎవరికీ తీవ్ర గాయాలు కాలేదు. ఆ ఇద్దరు అమ్మాయిలకు స్వల్ప గాయాలైనప్పటికీ, చుట్టుపక్కల వారు వెంటనే వారికి సహాయం చేసి, చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
కాబట్టి, వైరల్ అవుతున్న ఘటన గుంటూరులో చోటు చేసుకున్న ఘటన కాదు. గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ లో జరిగిన ఘటన.
Claim : ఈ ఘటన గుజరాత్ లో జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఘటన కాదు
Claimed By : Social Media Users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Whatsapp
Fact Check : False
Next Story

