Mon Mar 09 2026 11:58:37 GMT+0530 (India Standard Time)
ఫ్యాక్ట్ చెక్: చిరుతపులితో కలిసి హోలీ ఆడుతున్న వీడియోను ఏఐ ద్వారా సృష్టించారు
ప్రజలు భయం లేకుండా చిరుతపులితో కలిసి హొలీ ఆడారు

Claim :
ప్రజలు భయం లేకుండా చిరుతపులితో కలిసి హొలీ ఆడారుFact :
చిరుతపులితో కలిసి హోలీ ఆడుతున్న వీడియోను ఏఐ ద్వారా సృష్టించారు
భారతదేశంలోని పలు ప్రాంతాల్లో హోలీని అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. హోలీని హోళికా పూర్ణిమగా కూడా పిలుస్తారు. ఏటా ఫాల్గుణ మాసంలో పౌర్ణమి రోజున వచ్చే ఈ పండుగను.. హోలీ, కాముని పున్నమి, డోలికోత్సవం అంటారు. ముఖ్యంగా యువత కోసం నగరంలో పలు ప్రాంతాల్లో భారీ ఈవెంట్లు, రంగుల పండుగలు ఏర్పాటు చేశారు. హోలీ సంబరాలు జరుపుకునేందుకు వేల సంఖ్యలో చిన్నా, పెద్దా తరలి వచ్చారు.చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ల వరకు రంగులు పూసుకుంటూ.. ఏంతో ఆనందంగా పండుగను జరుపుకున్నారు. కేవలం రంగులతోనే కాకుండా డీజే పాటలు, రెయిన్ డాన్స్ లతో ఎంజాయ్ చేశారు.
బీహార్‌లో కొంతమంది వ్యక్తులు చిరుతతో కలిసి హోలీ ఆడుతున్న వీడియో వైరల్ అవుతోంది. హోలీ సమయంలో బహిరంగంగా చిరుతకు రంగు వేస్తున్నారని పేర్కొంటూ అలాంటి ఒక వీడియోను షేర్ చేస్తున్నారు. వీడియోలో కొంతమంది అబ్బాయిలు హోలీ ఆడుతున్నట్లు చూపిస్తుంది. ఒక చిరుత వారి ముందు నిలబడి ఉండగా, వారు దానికి రంగులు పూస్తున్నారు.
వైరల్ వీడియోకు సంబంధించిన ఆర్కైవ్ లింక్స్ ను ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు
వైరల్ వీడియోకు సంబంధించిన స్క్రీన్ షాట్ ఇక్కడ ఉంది
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. వైరల్ వీడియోను ఏఐ ద్వారా సృష్టించారు.
వైరల్ వీడియోను నిశితంగా పరిశీలించగా.. అందులో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే చిరుత ప్రశాంతంగా కనిపిస్తూ ఉంది. అది ఎవరి మీదా దాడి చేయడం లేదు. పారిపోవడానికి ప్రయత్నించలేదు. అడవి జంతువు అలా ప్రవర్తించే అవకాశాలు అత్యంత అరుదు. ఇక అకస్మాత్తుగా ఎవరి ముందైనా చిరుత పులి కనిపిస్తే, వారు అంత నిర్లక్ష్యంగా దాని దగ్గరకు వెళ్లి రంగులు పూస్తారా? ఇదే వీడియోను అనుమానాస్పదంగా అనిపించేలా చేస్తోంది.
ఇక వైరల్ వీడియోను చూసిన పలువురు నెటిజన్లు ఈ వీడియో ఏఐ అంటూ కామెంట్లు చేయడం గమనించాం.
కొంతమంది వినియోగదారులు దీని గురించి AI చాట్‌బాట్ గ్రోక్‌ను కూడా అడిగారు. గ్రోక్ దీనిని AI ద్వారా తయారు చేసిన కంటెంట్ అని స్పష్టం చేసింది. వీడియోను నిశితంగా పరిశీలిస్తే ఏఐ చెప్పడానికి అనేక ఆధారాలను గుర్తించవచ్చు. చిరుత శరీర కదలికలు అసహజంగా ఉన్నాయి. వీడియో లోని బాలురు, జంతువు మధ్య దూరం, నీడలు సరిపోలడం లేదు. అస్పష్టత, ఆకృతి లోపాలను కూడా చూడవచ్చు. ఈ సంకేతాలన్నీ వీడియో నిజమైన సంఘటన కాదని, డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించి సృష్టించినట్లుగా సూచిస్తున్నాయి.
వైరల్ వీడియో నిజమా కాదా అని తెలుసుకోవడం కోసం మేము హైవ్ ఏఐ డిటెక్షన్ టూల్ ను ఉపయోగించాం. అయితే ఈ వీడియో ఏఐ సృష్టి అని తేల్చింది.
వైరల్ వీడియోకు సంబంధించి నిజమేనంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు. ఇలాంటి ఏఐ వీడియోలను సృష్టించి జనాన్ని నమ్మించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు.
కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. వైరల్ వీడియోను ఏఐ ద్వారా సృష్టించారు.
కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. వైరల్ వీడియోను ఏఐ ద్వారా సృష్టించారు.
Claim : చిరుతపులితో కలిసి హోలీ ఆడుతున్న వీడియోను ఏఐ ద్వారా సృష్టించారు
Claimed By : Social Media Users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Social Media
Fact Check : False
Next Story

