Thu Feb 26 2026 12:49:02 GMT+0530 (India Standard Time)
ఫ్యాక్ట్ చెక్: భారత్-పాకిస్థాన్ మ్యాచ్ సమయంలో గాయత్రీ మంత్రం, శివస్తోత్రం ప్లే చేయలేదు. డబ్ల్యూపీఎల్ 2026 సమయంలో తీసిన వీడియో
భారత్-పాకిస్థాన్ మ్యాచ్ సమయంలో గాయత్రీ మంత్రం, శివస్తోత్రం ప్లే

Claim :
భారత్-పాకిస్థాన్ మ్యాచ్ సమయంలో గాయత్రీ మంత్రం, శివస్తోత్రం ప్లే చేశారుFact :
డబ్ల్యూపీఎల్ 2026 సమయంలో చోటు చేసుకున్న ఘటన ఇది
మహిళల టీ20 ప్రపంచకప్-2026 షెడ్యూల్‌ను ఐసీసీ ప్రకటించింది. ఇంగ్లండ్ ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీ జూన్ 12 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో బర్మింగ్‌హామ్ వేదికగా ఇంగ్లండ్-శ్రీలంక జట్టు తలపడనున్నాయి. గ్రూపు-ఎలో ఉన్న భారత్-పాకిస్తాన్ జట్లు జూన్ 14న ఎడ్జ్‌బాస్టన్ వేదికగా తలపడనున్నాయి. భారత్‌కు ఇదే తొలి మ్యాచ్. గ్రూపు-ఎలో భారత్, పాక్‌తో పాటు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ ఉన్నాయి.
అయితే మెన్స్ టీ20 ప్రపంచ కప్-2026 గ్రూప్ స్టేజ్ లో భారత్-పాకిస్థాన్ తలపడ్డాయి. ఆ మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది. 2026 ICC మెన్స్ T20 వరల్డ్ కప్ లో భారత్-పాక్ మ్యాచ్ పాత రికార్డులు బద్దలుకొట్టింది. ఈ టోర్నమెంట్ అధికారిక డిజిటల్, టీవీ భాగస్వామి జియోస్టార్ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది. ఈ మ్యాచ్ 2026 ఫిబ్రవరి 15న కొలంబోలో జరిగింది. ఇండియా 61 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసి 175/7 స్కోరు చేసింది. ఇషాన్ కిషన్ 77 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఆ తర్వాత ఛేదను దిగిన పాకిస్తాన్ 114 రన్స్‌కే ఆల్ అవుట్ అయింది. ఈ మ్యాచ్ ను 163 మిలియన్ల మంది చూశారు. ఏ ICC T20 ఈవెంట్లో అయినా ఇప్పటివరకు ఇదే అత్యధికమని జియో స్టార్ తెలిపింది.
ఈ మ్యాచ్ ప్రసారం చేస్తున్న సమయంలో గాయత్రీ మంత్రం, శివస్తోత్రం ప్లే చేశారంటూ కొన్ని పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఆ పోస్టులకు సంబంధించిన ఆర్కైవ్ లింక్స్ ను ఇక్కడ చూడొచ్చు
వైరల్ స్క్రీన్ షాట్ ఇక్కడ ఉంది
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. వైరల్ వీడియో మహిళల ప్రీమియర్ లీగ్ సందర్భంగా చోటు చేసుకున్నది.
వైరల్ వీడియోలోని కీఫ్రేమ్స్ ను తీసుకుని గూగుల్ లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా beingkru21 అనే ఇన్స్టాగ్రామ్ పేజీలో అదే వీడియోను పోస్టు చేశారు. WPL - #sachetparampara #sachettandon #paramparatandon
@sachettandonofficial
@sachetparamparaofficial అనే క్యాప్షన్ ఇచ్చారు. అంతేకాకుండా సాకేత్-పరంపర పెర్ఫార్మెన్స్ అంటూ అందులో తెలిపారు.
22, జనవరి 2026 నుండి ఈ వీడియో ఆన్ లైన్ లో ఉంది. టీ20 ప్రపంచ కప్-2026లో భాగంగా భారత్-పాకిస్థాన్ మ్యాచ్ 2026 ఫిబ్రవరి 15న కొలంబోలో జరిగింది. కాబట్టి, వైరల్ వీడియో టీ20 ప్రపంచ కప్ ప్రారంభం అవ్వడానికంటే ముందే ఆన్ లైన్ లో అందుబాటులో ఉంది.
అదే వీడియోను సింగర్ సచేత్ టాండన్ తన అకౌంట్ లో షేర్ చేశారు.
బాలీవుడ్ మ్యూజిక్ ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్న సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ సచేత్ టాండన్. ఉత్తరప్రదేశ్‌లోని లక్నోకు చెందిన సచేత్ 2015లో వచ్చిన 'ది వాయిస్ ఇండియా' సింగింగ్ రియాలిటీ షో ద్వారా తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. అదే షోలో పరిచయమైన మరో టాలెంటెడ్ సింగర్ పరంపరా ఠాకూర్‌తో కలిసి 'సచేత్-పరంపర' పేరుతో మ్యూజిక్ కంపోజర్‌గా మారాడు. ఆ తర్వాత వాళ్లిద్దరూ ప్రేమించి పెళ్లి కూడా చేసుకున్నారు! సచేత్ కెరీర్‌ను ఒక్కసారిగా మలుపు తిప్పిన పాట 'కబీర్ సింగ్' సినిమాలోని "బేఖయాలి". ఎన్నో హిట్ సాంగ్స్ పాడి, కంపోజ్ చేసి కుర్రకారులో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం తన భార్యతో కలిసి సోషల్ మీడియాలో ఎన్నో అద్భుతమైన కవర్ సాంగ్స్ పాడుతూ ఆకట్టుకుంటూ ఉంటున్నాడు సచేత్ టాండన్. TATA WPL-2026 సమయంలో సచేత్ తన భార్యతో కలిసి ప్రదర్శన ఇచ్చారు.
ఇక వైరల్ వీడియోలోని పలు చోట్ల TATA WPL అని బ్యానర్లు ఉండడం గమనించవచ్చు.
దీన్ని బట్టి ఈ వీడియో మహిళల ప్రీమియర్ లీగ్ సందర్భంగా చోటు చేసుకున్నది.
కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. వైరల్ వీడియో మహిళల ప్రీమియర్ లీగ్ సందర్భంగా చోటు చేసుకున్నది. భారత్-పాకిస్థాన్ ప్రపంచ కప్ మ్యాచ్ సమయంలో చోటు చేసుకోలేదు.
Next Story

