Fri Feb 27 2026 17:54:22 GMT+0530 (India Standard Time)
ఫ్యాక్ట్ చెక్: దక్షిణాఫ్రికాతో మ్యాచ్ అనంతరం ట్రోల్ చేస్తున్న వాళ్లకు భారత జట్టు కోచ్ గంభీర్ వార్నింగ్ ఇవ్వలేదు
దక్షిణాఫ్రికాతో మ్యాచ్ అనంతరం ట్రోల్ చేస్తున్న వాళ్లకు భారత జట్టు కోచ్ గంభీర్ వార్నింగ్

Claim :
దక్షిణాఫ్రికాతో మ్యాచ్ అనంతరం ట్రోల్ చేస్తున్న వాళ్లకు భారత జట్టు కోచ్ గంభీర్ వార్నింగ్ ఇచ్చారుFact :
ఈ వీడియో పాతది. టీ20 ప్రపంచ కప్ కంటే ముందు నుండి ఆన్ లైన్ లో ఉంది
ఫిబ్రవరి 22, 2026న జరిగిన ఐసిసి పురుషుల టి20 ప్రపంచ కప్‌లో దక్షిణాఫ్రికా చేతిలో భారత్ 76 పరుగుల తేడాతో ఓడిపోయిన తర్వాత భారత జట్టును సోషల్ మీడియా వేదికగా విపరీతంగా ట్రోల్ చేశారు.
టీ20 ప్రపంచకప్‌లో సెమీస్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా విజయాన్ని అందుకుంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో జింబాబ్వేపై 72 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌లో పరుగుల వరద పారించిన భారత్, ఆ తర్వాత బౌలింగ్‌లోనూ రాణించి సెమీఫైనల్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. భారత్ నిర్దేశించిన 257 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో జింబాబ్వే 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 184 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ విజయంతో భారత్ తన సెమీస్ అవకాశాలను మెరుగుపరుచుకుంది. సెమీఫైనల్‌కు అర్హత సాధించాలంటే తమ తదుపరి మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై తప్పక గెలవాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్ మార్చి 1న జరగనుంది. జింబాబ్వేపై టీమిండియా విజయంతో దక్షిణాఫ్రికా జట్టుకు సెమీస్ బెర్తు ఖరారైంది.
భారత క్రికెట్ జట్టు కోచ్ గౌతమ్ గంభీర్ విమర్శకులను హెచ్చరిస్తున్నట్లు చూపించే ఓ వీడియో వైరల్ అయింది. దక్షిణాఫ్రికా జట్టుపై ఓటమి తర్వాత ట్రోల్స్ చేస్తున్న వారిని లక్ష్యంగా చేసుకుని గంభీర్ అలా మాట్లాడినట్లుగా వినియోగదారులు చెబుతున్నారు.
https://www.youtube.com/watch?
https://www.instagram.com/
ఆర్కైవ్ లింక్స్ ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ ఉన్నాయి
వైరల్ పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు
మేము సంబంధిత కీవర్డ్స్ తో గూగుల్ సెర్చ్ చేయగా గంభీర్ ఇటీవలి కాలంలో అలాంటి వ్యాఖ్యలు చేసినట్లుగా ఎలాంటి నివేదికలు మాకు లభించలేదు.
అయితే గౌతమ్ గంభీర్ IPL యజమానిపై విమర్శలు చేసిన కథనాలు మాకు లభించాయి. డిసెంబర్ 6, 2025న హిందూస్తాన్ టైమ్స్ నివేదిక మాకు లభించింది. గౌహతిలో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ ఓటమి తర్వాత భారత రెడ్-బాల్ క్రికెట్‌కు ప్రత్యేక కోచ్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ సహ యజమాని పార్థ్ జిందాల్ డిమాండ్ చేయడంపై గంభీర్ విమర్శించాడని ఆ నివేదికలు తెలిపాయి. విలేకరుల సమావేశంలో, జిందాల్ పేరు పెట్టకుండా "వారి డొమైన్లో ఉండటం" ముఖ్యమని గంభీర్ చెప్పారని నివేదిక పేర్కొంది.
ఆ ఫుటేజ్‌ను అదే తేదీన బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) తన అధికారిక వెబ్సైట్లో అప్లోడ్ చేసింది, వైరల్ భాగం 1 నిమిషం 50 సెకన్ల దూరంలో కనిపించింది, ఇది ఇటీవలి ఓటమికి ముందే చోటు చేసుకుందని నిర్ధారిస్తుంది.
https://www.bcci.tv/video/
సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో భారత్ వైట్‌వాష్‌కు గురైన నేపథ్యంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై విమర్శలు వచ్చాయి. విశాఖపట్నంలో దక్షిణాఫ్రికాపై భారత్ వన్డే సిరీస్ విజయం సాధించిన అనంతరం జరిగిన పోస్ట్ మ్యాచ్ కాన్ఫరెన్స్‌లో కోచ్ గంభీర్ జిందాల్ పేరు ప్రస్తావించకుండానే “తమ హద్దుల్లో ఉండండి” అంటూ ఘాటుగా సమాధానం ఇచ్చారు. మేము సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌లో ఓడిపోయినప్పుడు రకరకాల విషయాలు మాట్లాడారు. వాటిలో సగం క్రికెట్‌కు సంబంధించినవి కూడా కావని గంభీర్ విలేకరులతో అన్నారు. ఒక ఐపీఎల్ యజమాని కూడా స్ప్లిట్ కోచింగ్ గురించి రాశారు. మేము ఎవరి జోలీకి వెళ్లం, కాబట్టి ఎవరి పరిధిలో వారు ఉండటం చాలా ముఖ్యం. ఎందుకంటే మేము ఒకరి జోలీకి వెళ్లనప్పుడు, వారు కూడా మా జోలీకి రావడానికి హక్కు లేదని గంభీర్అన్నాడు.
పలు మీడియా సంస్థలు అప్పట్లో కథనాలను ప్రచురించాయి. వాటిని ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.
దక్షిణాఫ్రికా చేతిలో భారత్ ఇటీవల టీ20 ప్రపంచ కప్ ఓటమి తర్వాత ట్రోలర్లను, భారత క్రికెట్ అభిమానులను గౌతమ్ గంభీర్ హెచ్చరించినట్లు వైరల్ అవుతున్న క్లిప్ ప్రజలను తప్పుదారి పట్టిస్తోంది. భారత క్రికెట్లో కోచింగ్ విభజన గురించి చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా డిసెంబర్ 2025లో ఈ వ్యాఖ్యలు చేశారు గంభీర్.
వైరల్ పోస్టులకు, టీ20 ప్రపంచ కప్ లో భారత జట్టు ఓటమికి సంబంధం లేదు.
Claim : దక్షిణాఫ్రికాతో మ్యాచ్ అనంతరం ట్రోల్ చేస్తున్న వాళ్లకు భారత జట్టు కోచ్ గంభీర్
Claimed By : Social Media Users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Social Media
Fact Check : False
Next Story

