Wed Feb 11 2026 03:41:54 GMT+0530 (India Standard Time)
ఫ్యాక్ట్ చెక్: ఇండోనేషియా మాజీ అధ్యక్షుడు జోకో విడోడో ఇటీవల తిరుమలను సందర్శించారనే వాదనలో ఎలాంటి నిజం లేదు
ఇండోనేషియా మాజీ అధ్యక్షుడు జోకో విడోడో ఇటీవల తిరుమలను

Claim :
ఇండోనేషియా మాజీ అధ్యక్షుడు జోకో విడోడో ఇటీవల తిరుమలను సందర్శించారుFact :
వైరల్ వీడియోలో ఉన్న వ్యక్తి ఇండోనేషియా మాజీ అధ్యక్షుడు జోకో విడోడో కాదు
తిరుమల శ్రీవారిని ప్రతి రోజూ వేల మంది దర్శించుకుంటూ ఉంటారు. పలువురు ప్రముఖులు కూడా కాలినడకన వెళ్లి తిరుమల శ్రీవారి దర్శనం చేసుకుంటూ ఉంటారు. దేశ విదేశాలకు చెందిన రాజకీయ నేతలు కూడా వస్తుంటారు. తిరుమలలోని శ్రీవారి కళ్యాణ వేదిక వద్ద ఉన్న పురోహిత సంఘం ఆధ్వర్యంలో భక్తులకు అవసరమైన వివిధ సంప్రదాయ పూజ కార్యక్రమాలను నిర్దేశిత రుసుముతో నిర్వహిస్తున్నారు. ఈ పురోహిత సంఘం ద్వారా వివాహం, ఉపనయనం, సత్యనారాయణ వ్రతం, నామకరణం, అన్నప్రాసన, అక్షరాభ్యాసం, వాహన పూజ తదితర ముఖ్యమైన ధార్మిక కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించేందుకు భక్తుల సౌకర్యార్థం ఈ కార్యక్రమాలను తక్కువ ఖర్చుతో చేసుకునేవిధంగా టీటీడీ అందుబాటులో ఉంచింది.
అయితే ఇటీవల తిరుమలను ఓ ప్రముఖ వ్యక్తి సందర్శించాడంటూ కథనాలు వైరల్ అయ్యాయి. ఒక వ్యక్తికి ఆలయ అధికారులు ప్రత్యేక భద్రత కల్పిస్తున్నట్లు చూపించే వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్‌గా మారింది. ఇండోనేషియా మాజీ అధ్యక్షుడు జోకో విడోడో ఆలయాన్ని సందర్శించారని అన్నారు. జోకో విడోడో తిరుమల తిరుపతి ఆలయాన్ని సందర్శించారని పేర్కొంటూ నివేదికలను పలు మీడియా సంస్థలు ప్రచురించాయి.
"శ్రీవారిని ఇండోనేషియా మాజీ అధ్యక్షుడు జోకో విడోడో వీఐపీ బ్రేక్ సమయంలో దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు." అంటూ కథనాల్లో పేర్కొన్నారు.
https://www.eenadu.net/telugu-
https://www.facebook.com/reel/
వైరల్ పోస్టులకు సంబంధించిన ఆర్కైవ్ లింక్స్ ను ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. శ్రీవారిని దర్శించుకున్న వ్యక్తి జోకో విడోడో కాదు.
జోకో విడోడో తిరుమల శ్రీవారి ఆలయాన్ని సందర్శించడానికి సంబంధించిన ఏదైనా సమాచారాన్ని విశ్వసనీయ ఇండోనేషియా ప్రభుత్వ మూలం లేదా వార్తా సంస్థ ప్రచురించిందా అని తెలుసుకోడానికి మేము ప్రయత్నించాం. అయితే ఎలాంటి వార్తా నివేదిక మాకు లభించలేదు.
జోకో విడోడో సోషల్ మీడియా ఖాతాలను కూడా మేము పరిశీలించాం. ఆయన ఎక్కడా కూడా తిరుమలను సందర్శించినట్లుగా ఇటీవల కథనాలను పోస్టు చేయలేదు.
https://x.com/jokowi
మా తదుపరి పరిశోధనలో ఢిల్లీలోని ఇండోనేషియా రాయబార కార్యాలయం షేర్ చేసిన X పోస్ట్‌ను మేము చూశాము. వైరల్ వీడియో ద్వారా జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. "షేర్ చేసిన సమాచారం తప్పు. ఇండోనేషియా మాజీ అధ్యక్షుడు జోకో విడోడో, తన పదవీకాలంలో లేదా తర్వాత ఏ సమయంలోనూ తిరుమలలోని వెంకటేశ్వర ఆలయాన్ని సందర్శించలేదు." అని స్పష్టం చేసింది.
వైరల్ వీడియోలోని వ్యక్తి ఎవరు అని మేము గుర్తించలేకపోయినప్పటికీ, ఇద్దరూ ఒకరే కాదని స్పష్టంగా తెలుస్తోంది.
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదంటూ పలు ఫ్యాక్ట్ చెక్ సంస్థలు కథనాలను ప్రచురించాయి. వాటిని ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.
కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim : ఇండోనేషియా మాజీ అధ్యక్షుడు జోకో విడోడో
Claimed By : Telugu Media Outlets, Social Media Users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Media Websites, Social Media
Fact Check : False
Next Story

