Sat Jul 12 2025 12:32:43 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: కుప్పంలో ఎయిర్పోర్టు కోసం 3 ఎకరాలు ప్రభుత్వం లాక్కోవడంతో రైతు మృతి చెందలేదంటున్న ఏపీ అధికారులు
ఎయిర్పోర్ట్ కోసం బలవంతపు భూసేకరణ చేయడంతో కుప్పంలో రైతు

Claim :
ఎయిర్పోర్ట్ కోసం బలవంతపు భూసేకరణ చేయడంతో కుప్పంలో రైతు మృతి చెందారుFact :
ఆ వ్యక్తి చనిపోడానికి కారణం భూసేకరణ కాదని ఏపీ ప్రభుత్వం తెలిపింది
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో ఎయిర్ పోర్టు నిర్మించాలని 2014-2019 సమయంలో ప్రణాళికలు రచించారు. అయితే 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించిన తర్వాత ఆ విషయంపై అడుగులు ముందుకు పడలేదు. ఇక 2024లో టీడీపీ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత కుప్పం ఎయిర్ పోర్టు గురించి చర్చ మొదలైంది. పలు సందర్భాల్లో కుప్పం ఎయిర్ పోర్టు నిర్మాణం గురించి సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో ఏవియేషన్ విశ్వవిద్యాలయం, శిక్షణా కేంద్రం ఏర్పాటుపై దృష్టి పెట్టాలని, ఇప్పటికే ఉన్న ఏడు విమానాశ్రయాలతో పాటు ఏడు కొత్త విమానాశ్రయాలను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు గతంలో అన్నారు. భవిష్యత్తులో విమానాశ్రయాలలో ప్రైవేట్ విమానాల పార్కింగ్ కోసం డిమాండ్ను ముందుగానే అంచనా వేస్తూ, అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని కొత్త విమానాశ్రయాలను నిర్మించాలని అధికారులను ఆదేశించారు.
రాష్ట్ర ప్రభుత్వం మరో ఏడు విమానాశ్రయాలను నిర్మించడానికి చర్యలు ప్రారంభించింది. కుప్పం, దగదర్తి, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, నాగార్జున సాగర్, తుని- అన్నవరం మధ్య, ఒంగోలులో విమానాశ్రయాలను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కుప్పం విమానాశ్రయం కోసం ఇప్పటికే తయారు చేయబడిన సాధ్యాసాధ్యాల నివేదిక ప్రకారం, దీనిని రెండు దశల్లో నిర్మిస్తారు. మొదటి దశలో, 683 ఎకరాలలో, రెండవ, చివరి దశలో 567 ఎకరాలలో నిర్మాణం చేపట్టనున్నారు. మొత్తం 1,250 ఎకరాల విస్తీర్ణంలో కుప్పం ఎయిర్ పోర్టు ఉంటుంది. IAF, HAL, బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయాలు ప్రతిపాదిత కుప్పం విమానాశ్రయానికి దగ్గరగా ఉన్నందున, అన్ని సంస్థల నుండి నిరభ్యంతర ధృవీకరణ పత్రం పొందడంతో పాటు, వైమానిక స్థలం సమస్యను పరిగణనలోకి తీసుకోవాలని అధికారులు ఇప్పటికే సూచించారు.
కుప్పంలో ఎయిర్ పోర్టు భూసేకరణకు సంబంధించి ఓ రైతు మరణించారంటూ కొన్ని పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
"రైతు ప్రాణం తీసిన కుప్పం ఎయిర్పోర్ట్ కోసం బలవంతపు భూసేకరణ !
భూమి మొత్తం లాక్కున్న కూటమి ప్రభుత్వం .. రైతు మృతి
తనకు అన్నం పెట్టే భూమి పోయిందనే దిగులుతో రైతు మృతి.
తనకున్న మూడు ఎకరాలు పొలం ఎయిర్ పోర్ట్ కోసం లాక్కోవడంతో బెంగతో తన తండ్రి చనిపోయాడన్న కుమార్తె
మాది రామకుప్పం మండలం విజిలాపురం పంచాయతీ కిలకుపోడు గ్రామం..
ఎయిర్పోర్ట్ కోసం మా భూమి తీసుకోవడం వల్ల మా నాన్న నెల రోజుల నుంచి ఆహారం తీసుకోకుండా..
ఐదు మంది ఆడపిల్లలు ఉన్నందు వల్ల వాళ్లను ఎలా పెంచాలో తెలియని దిగులుతో బాధపడుతూ గుండెపోటుతో మృతిచెందాడన్న రైతు శ్రీనివాసులు కూతురు" అంటూ పోస్టులు పెట్టారు.

మరొక పోస్టులో "కుప్పంలో ఎయిర్పోర్ట్ కోసం బలవంతంగా భూసేకరణ.. దిగులుతో రైతు మృతి
తనకున్న మూడు ఎకరాల పొలం ఎయిర్పోర్ట్ కోసం లాక్కోవడంతో బెంగతో తన తండ్రి చనిపోయాడని కుమార్తె ఆవేదన
రామకుప్పం మండలం విజిలాపురం పంచాయతీ కిలకుపోడు గ్రామంలో ఎయిర్పోర్ట్ కోసం తన భూమి తీసుకోవడం వల్ల మా నాన్న నెల రోజుల నుంచి ఆహారం తీసుకోకుండా,
ఐదుగురు ఆడపిల్లలను ఎలా పెంచాలో తెలియక దిగులుతో బాధపడుతూ గుండెపోటుతో మృతి చెందాడని ఆవేదన వ్యక్తం చేసిన రైతు శ్రీనివాసులు కూతురు" అంటూ తెలిపారు.
వైరల్ అవుతున్న పోస్టులకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ను ఇక్కడ చూడొచ్చు
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని ఏపీ ఫ్యాక్ట్ చెక్ విభాగం తెలిపింది.
మేము మరింత సమాచారం తెలుసుకోవడం కోసం కుప్పం పోలీసులను ఫోన్ కాల్ లో సంప్రదించాం. అయితే వారు అలాంటిదేమీ లేదని ఆయన అనారోగ్యంతో మరణించారంటూ వివరణ ఇచ్చారు. అప్పటికే పలు వ్యాధులతో ఆయన బాధపడుతూ ఉన్నారని తెలిపారు. ఇక చనిపోయిన వ్యక్తికి 3 ఎకరాలు భూమి లేదని పోలీసులు వివరించారు.
కీవర్డ్ సెర్చ్ చేయగా ఏపీ ఫ్యాక్ట్ చెక్ విభాగం వైరల్ అవుతున్న వాదనల్లో ఎలాంటి నిజం లేదని వివరించింది.
"కుప్పం విమానాశ్రయానికి బలవంతంగా భూసేకరణ చేస్తున్నారు అనేది పూర్తిగా అవాస్తవం. కొంత మంది శ్రీనివాసులుకు ఉన్న 3 ఎకరాలు ప్రభుత్వం బలవంతంగా లాక్కుందని సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారం చేస్తున్నారు. కుప్పంకు చెందిన శ్రీనివాసులుకు 3 ఎకరాలు ఉంది అనేది అవాస్తవం. ఆయనకు 1.71 ఎకరాలు ఉంటే దానిని ఇష్టపూర్వకంగానే భూసేకరణకు ఇస్తున్నానని తన స్వహస్తాలతో సంతకం చేశారు. శ్రీనివాసులు భూమిని ప్రభుత్వం లాక్కుందని గుండెపోటుతో చనిపోయాడనేది పూర్తిగా దుష్ప్రచారం. గత రెండేళ్లుగా ఆస్తమా, గుండెజబ్బు సమస్యలతో బాధపడుతున్న శ్రీనివాసులు ఈరోజు ఉదయం నిద్రలోనే గుండెపోటుతో మృతిచెందారు. కుప్పం విమానాశ్రయాన్ని అడ్డుకోవాలని చూస్తున్న వారి అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మవద్దు." అంటూ సోషల్ మీడియాలో వివరించింది.

మా తదుపరి పరిశోధనలో "ఏపీలో కొత్త ఎయిర్పోర్ట్ కోసం భూసేకరణ.. ఆ జిల్లా దశ తిరిగినట్లే, రైతు మరణంపై వివాదం.. క్లారిటీ ఇదే" అంటూ సమయం వెబ్సైట్ లో వచ్చిన కథనం మాకు లభించింది.
ఆ లింక్ ను ఇక్కడ చూడొచ్చు.
https://telugu.samayam.com/
"కుప్పంలో బలవంతంగా భూసేకరణ చేయడం లేదని, శ్రీనివాసులు అనే రైతు గుండెపోటుతో మరణించారని, ఆయన భూమిని స్వచ్ఛందంగానే ఇచ్చారని ప్రభుత్వం స్పష్టం చేసింది. తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని విజ్ఞప్తి చేసింది." అని ఈ కథనంలో ఉంది.
కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని ఏపీ ప్రభుత్వం స్పష్టతను ఇచ్చింది.
Claim : ఎయిర్పోర్ట్ కోసం బలవంతపు భూసేకరణ చేయడంతో కుప్పంలో రైతు
Claimed By : social media users
Claim Reviewed By : TeluguPost
Claim Source : social media
Fact Check : False
Next Story