Mon Jan 19 2026 18:34:14 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: కోమటిరెడ్డి ఫోన్ ట్యాప్ చేయించిన రేవంత్ రెడ్డి అంటూ వార్తా కథనంలో ఎలాంటి నిజం లేదు
కోమటిరెడ్డి ఫోన్ ట్యాప్ చేయించిన రేవంత్ రెడ్డి అంటూ

Claim :
కోమటిరెడ్డి ఫోన్ ట్యాప్ చేయించిన రేవంత్ రెడ్డి అంటూ వార్తా కథనంFact :
దిశ పత్రిక ఈ వార్తను ప్రచురించలేదు
తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు కొనసాగుతూ ఉంది. ఇటీవల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు జారీ చేసింది. గతంలో కొండల్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ అయినట్లుగా సిట్ గుర్తించారు. ఈ మేరకు సమాచారం తెలుసుకునేందుకు నోటీసులు జారీ చేశారు. గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్న రేవంత్ రెడ్డిపై నిఘా పెట్టేందుకు ఫోన్ ట్యాపింగ్ చేశారన్న ఆరోపణలను రేవంత్ రెడ్డి పలుమార్లు చేశారు. ఇప్పుడు ఆయన సోదరుడ్ని విచారణకు పిలిచారు.
ఇంతలో తెలంగాణ మంత్రి 'కోమటిరెడ్డి ఫోన్ ట్యాప్ చేయించిన రేవంత్ రెడ్డి' అంటూ ఓ మీడియా కథనం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. దిశ మీడియా సంస్థకు సంబంధించిన పేపర్ క్లిప్పింగ్ అంటూ సోషల్ మీడియాలో పోస్టును షేర్ చేస్తూ ఉన్నారు.
"కోమటిరెడ్డి ఫోన్ ట్యాప్ చేయించిన రేవంత్ రెడ్డి
కోమటి కుటుంబంలో రేవంత్ ఫోన్ ట్యాపింగ్ చిచ్చు.. విడాకుల దాకా వెళ్లిన పంచాయతీ
మహిళా ఐఏఎస్ అధికారితో పీకల్లోతు ప్రేమలో పడిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
అర్ధరాత్రి పూట చాటింగ్స్, కాల్స్.. కోమటిరెడ్డి వైఖరితో కుటుంబ సభ్యులకు అనుమానం
అఫైర్ వ్యవహారం తేల్చాలని రేవంత్ రెడ్డిని ఆశ్రయించిన కోమటిరెడ్డి భార్య, కూతురు
కోమటిరెడ్డికి తెలియకుండా ప్రత్యేక నిఘా పెట్టి ఫోన్ ట్యాపింగ్ చేయించిన రేవంత్ రెడ్డి
కోమటిరెడ్డి ఫోన్ కాల్ రికార్డింగ్స్, వాట్సాప్ స్క్రీన్ షాట్లను మంత్రి భార్యకు అప్పగింత
రేవంత్ ఇచ్చిన ఆధారాలను చూపించి మంత్రిని నిలదీసి ఫోన్ లాక్కున్న మంత్రి భార్య
* తన ఫోన్ ట్యాప్ అయిందని గుర్తించిన కోమటిరెడ్డి, విడాకుల వరకు వెళ్లిన పంచాయతీ
దిశ, తెలంగాణ బ్యూరో: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యవహారం ఇప్పుడు కుటుంబ వివాదం నుంచి రాజకీయ దుమారం దాకా వెళ్లింది. మహిళా ఐఏఎస్ అధికారితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్న అనుమానంతో కోమటిరెడ్డి భార్య, కూతురు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆశ్రయించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే కోమటిరెడ్డికి తెలియకుండా ఫోన్ ట్యాపింగ్ చేయించి, కాల్ రికార్డింగ్స్, వాట్సాప్ స్క్రీన్ షాట్లను సేకరించి మంత్రి భార్యకు అందించారనే ప్రచారం జరుగుతోంది. ఆధారాలతో మంత్రిని నిలదీసి ఫోన్ కూడా లాక్కున్నారని సమాచారం. తన ఫోన్ ట్యాప్ అయిందని గుర్తించిన కోమటిరెడ్డి తీవ్రంగా వృందించారని, ఈ వ్యవహారం విడాకుల దాకా వెళ్లిందన్న కథనాలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. ఇప్పటివరకు ఈ ఆరోపణలపై అధికారిక స్పందన లేకపోవడం గమనార్హం." అంటూ ఓ కథనం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.
అది దిశ మీడియా సంస్థ కథనం అంటూ పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులను వైరల్ చేస్తూ ఉన్నారు.
ఆ కథనాలను ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.
ఆర్కైవ్ లింక్స్ ఇక్కడ, ఇక్కడ ఉన్నాయి.
వైరల్ పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ఇక్కడ ఉంది.

ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
మేము సంబంధిత కీవర్డ్స్ తో గూగుల్ సెర్చ్ చేశాం. అయితే మాకు వైరల్ అవుతున్న పోస్టులను సమర్థించే కథనాలు లభించలేదు. అలాంటి ఘటనే చోటు చేసుకుని ఉండి ఉంటే తెలుగు మీడియా సంస్థలు ఈ విషయాన్ని ప్రముఖంగా ప్రచురించి ఉండేవి.
దిశా సంస్థకు సంబంధించిన వెబ్ సైట్ ను మేము పరిశీలించగా ఎక్కడా కూడా అందుకు సంబంధించిన కథనం లభించలేదు.
ఇక వైరల్ క్లిప్పింగ్ లో ఉన్న తేదీని పరిశీలించాము. ఆ తేదీన ప్రచురించిన ఈ-పేపర్ ను కూడా చూశాం. ఆ లింక్స్ ఇక్కడ, ఇక్కడ ఉన్నాయి. ఎక్కడా కూడా 'కోమటిరెడ్డి ఫోన్ ట్యాప్ చేయించిన రేవంత్ రెడ్డి' అనే కథనం లభించలేదు.
https://epaper.dishadaily.com/
https://epaper.dishadaily.com/
మా తదుపరి పరిశోధనలో తెలంగాణ ఫ్యాక్ట్ చెక్ టీమ్ వైరల్ అవుతున్న వాదనను ఖండించింది.
"ఫేక్ న్యూస్ అలర్ట్ (FAKE NEWS ALERT)
దిశ డైలీ దినపత్రిక పేరుతో ఒక నకిలీ వార్తా పత్రిక క్లిప్పింగ్ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారమవుతోంది.
అటువంటి వార్తను దిశ డైలీ ప్రచురించలేదు.
ప్రచారంలో ఉన్న ఆ క్లిప్పింగ్ పూర్తిగా సృష్టించబడింది. అందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు తెలంగాణ క్యాబినెట్ సభ్యులపై చేసిన ఆరోపణలు అబద్ధం మరియు ధృవీకరించబడనివి. ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఈ తప్పుడు వార్తను నిజమైన రిపోర్టులాగా చిత్రీకరించారు. ప్రజలను అయోమయానికి గురిచేయడానికి మరియు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయాలనే దురుద్దేశంతోనే ఈ కంటెంట్‌ను కావాలని సృష్టించారు.
ప్రజలకు విజ్ఞప్తి:
• ఇలాంటి నకిలీ క్లిప్పింగ్‌ను నమ్మకండి, ఇతరులకు షేర్ చేయకండి.
• సమాచారాన్ని కేవలం అధికారిక మరియు నమ్మదగిన సోర్స్ ద్వారా మాత్రమే నిర్ధారించుకోండి.
• నకిలీ కంటెంట్‌ను రిపోర్ట్ చేయడం ద్వారా తప్పుడు ప్రచారాన్ని అరికట్టడంలో సహాయపడండి" అంటూ వివరణ ఇచ్చింది.
కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim : కోమటిరెడ్డి ఫోన్ ట్యాప్ చేయించిన రేవంత్ రెడ్డి అంటూ వార్తా కథనం
Claimed By : Social Media Users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Social Media
Fact Check : False
Next Story