ఫ్యాక్ట్ చెక్: సీనియర్ సిటిజన్ల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉచితంగా తిరుమల శ్రీవారి దర్శన పథకాన్ని తీసుకుని వచ్చారంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు
సీనియర్ సిటిజన్ల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉచితంగా తిరుమల శ్రీవారి దర్శనాన్ని

Claim :
సీనియర్ సిటిజన్ల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉచితంగా తిరుమల శ్రీవారి దర్శనాన్ని తీసుకుని వచ్చారుFact :
వైరల్ అవుతున్న వాదనల్లో ఎలాంటి నిజం లేదు. టీటీడీ అలాంటి పథకాన్ని ప్రవేశపెట్టలేదు
డిసెంబరు 30వ తేదీన వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) అనుబంధ ఆలయాలలో భక్తుల సౌకర్యార్థం విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అన్ని ఆలయాల్లో ప్రత్యేక క్యూలైన్లు, చలువ పందిళ్లు, రంగవల్లులు తీర్చిదిద్ది వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించనున్నారు. ఇక తిరుమలలో కూడా వైకుంఠ ఏకాదశి కోసం ప్రత్యేక ఏర్పాట్లను చేపట్టారు. తిరుపతి ఎస్పీ కార్యాలయంలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు, భద్రతపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరామయుడు హాజరయ్యారు. వైకుంఠ ఏకాదశి, ద్వాదశికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. డిసెంబరు 30, 31, జనవరి 1వతేదీల్లో లక్షా 80వేలమంది భక్తులు దర్శనం చేసుకునే అవకాశం టీటీడీ కల్పించిందన్నారు. తిరుపతి బస్టాండ్, రైల్వేస్టేషన్, ప్రధాన కూడళ్లు, స్థానిక ఆలయాల వద్ద భద్రతను రెట్టింపు చేస్తున్నామని డ్రోన్ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తామని అధికారులు తెలిపారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు *సీనియర్ సిటిజన్స్* పథకం అంటూ కొన్ని పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. కొత్తగా పథకాన్ని ప్రవేశపెట్టారంటూ పోస్టులను వైరల్ చేస్తున్నారు.
అయితే "*Chief Minister Chandrababu Naidu's Free Tirupati Balaji Darshan Scheme* for *Senior Citizens*
*Beneficiaries : Senior Citizens aged 65 years & above...
*Free Darshan Timings
* 10:00 am
* 3:00 pm
*How to Get in
* You only need to present your *Photo ID* and *Proof of Age* at *Counter S-1*.
*Guidance to the Temple
* Proceed through the Gallery under the Bridge, along the right wall of the temple.
* No stairs are required to climb.
* Ample space is available.
Facilities :
1. *Free Lunch After Darshan, you will be served *Free Hot Sambar (masala) Rice, Curd Rice & Hot Milk*.
2. *Battery Cars For convenience, *Battery Cars* are also available, which will take you from the *Parking Area* to the *Counter* and then to the Exit Gate.
Important Note :
There is no Coercion or Pressure - Darshan is Reserved for Senior Citizens only.
Once you are in the Darshan Queue, you can complete your Visit & Exit in just 30 minutes
Contact for Assistance :
TTD (Tirumala Tirupati Devasthanam) Helpdesk Number :8772277777
Special Request :
Please share this information with all Ur Other Groups as well...!!" అంటూ కొన్ని పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి.
"*ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యొక్క *సీనియర్ సిటిజన్స్* కోసం ఉచిత తిరుపతి బాలాజీ దర్శన పథకం*
*లబ్ధిదారులు: 65 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న సీనియర్ సిటిజన్లు...
*ఉచిత దర్శన సమయాలు
* ఉదయం 10:00 గంటలు
* మధ్యాహ్నం 3:00 గంటలు
*ఎలా ప్రవేశించాలి
* మీరు మీ *ఫోటో ఐడి* మరియు *వయస్సు రుజువు*ను *కౌంటర్ S-1* వద్ద మాత్రమే సమర్పించాలి.
*ఆలయానికి మార్గదర్శకత్వం
* ఆలయం యొక్క కుడి గోడ వెంట వంతెన కింద ఉన్న గ్యాలరీ గుండా వెళ్లండి.
* ఎక్కడానికి మెట్లు అవసరం లేదు.
* తగినంత స్థలం అందుబాటులో ఉంది.
సౌకర్యాలు :
1. *ఉచిత భోజనం దర్శనం తర్వాత, మీకు *ఉచిత వేడి సాంబార్ (మసాలా) బియ్యం, పెరుగు అన్నం & వేడి పాలు* అందించబడతాయి.
2. *బ్యాటరీ కార్లు సౌలభ్యం కోసం, *బ్యాటరీ కార్లు* కూడా అందుబాటులో ఉన్నాయి, ఇవి మిమ్మల్ని *పార్కింగ్ ఏరియా* నుండి *కౌంటర్* వరకు మరియు తరువాత ఎగ్జిట్ గేట్ వరకు తీసుకెళతాయి.
ముఖ్య గమనిక:
ఎటువంటి బలవంతం లేదా ఒత్తిడి లేదు - దర్శనం సీనియర్ సిటిజన్లకు మాత్రమే కేటాయించబడింది.
మీరు దర్శన క్యూలో ఉన్న తర్వాత, మీరు మీ సందర్శన & నిష్క్రమణను కేవలం 30 నిమిషాల్లో పూర్తి చేయవచ్చు
సహాయం కోసం సంప్రదించండి:
TTD (తిరుమల తిరుపతి దేవస్థానం) హెల్ప్‌డెస్క్ నంబర్:8772277777
ప్రత్యేక అభ్యర్థన:
దయచేసి ఈ సమాచారాన్ని మీ ఇతర గ్రూపులన్నింటికీ షేర్ చేయండి...!!" అంటూ తెలుగులో పోస్టులు వైరల్ చేస్తున్నారు. వాటిని ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.
వైరల్ పోస్టులకు సంబంధించిన ఆర్కైవ్ లింక్స్ ను ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.
వైరల్ పోస్టులకు సంబంధించిన స్క్రీన్ షాట్ ఇక్కడ ఉంది
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ, టీటీడీ కానీ అలాంటి పథకం ఏదైనా తీసుకుని వచ్చిందా అని తెలుసుకోవడం కోసం మేము సంబంధిత కీవర్డ్స్ తో వెతికాం. అయితే మాకు ఎలాంటి మీడియా కథనాలు కూడా లభించలేదు. అలాంటి పథకాన్ని ప్రవేశపెట్టి ఉంటే అది తప్పకుండా మీడియా దృష్టిని ఆకర్షించి ఉండేది.
మేము టీటీడీ అధికారిక సోషల్ మీడియా ఖాతాలు, వెబ్ సైట్లలో కూడా ఈ పథకానికి సంబంధించిన సమాచారం కోసం వెతికాం. అయితే అందులో ఎక్కడా కూడా ఇందుకు సంబంధించిన సమాచారం లభించలేదు.
https://news.tirumala.org/
https://x.com/TTDevasthanams
వైరల్ అవుతున్న పోస్టులను ఖండిస్తూ టీటీడీ సోషల్ మీడియాలో పోస్టులను పెట్టడం మేము గమనించాం.
తిరుమల గురించి వ్యాపించే నకిలీ వార్తలు, తప్పుదారి పట్టించే సందేశాల పట్ల జాగ్రత్త వహించాలని అందులో సూచించారు. భక్తులు అధికారిక ప్రకటనలు, ధృవీకరించబడిన TTD ప్లాట్‌ఫామ్‌ల నుండి వచ్చే సమాచారంపై మాత్రమే ఆధారపడాలని TTD కోరింది.
అంతేకాకుండా వైకుంఠ ద్వార దర్శనాలపై అసత్య ప్రచారాలు నమ్మవద్దని టీటీడీ ప్రజలను కోరింది. డిసెంబర్ 30 నుండి జనవరి 8వ తేది వరకు తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శనాలపై సోషియల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు భక్తులకు విజ్ఞప్తి చేశారు. తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ వైకుంఠ ద్వార దర్శనాలకు టోకెన్ లేని భక్తులకు తిరుమలకు అనుమతి లేదంటూ సోషియల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. భక్తులను తిరుమలకు రావద్దని చెప్పే అధికారం ఎవ్వరికీ లేదని ఆయన స్పష్టం చేశారు. గత రెండు నెలలుగా వైకుంఠ ద్వార దర్శనాల ఏర్పాట్ల కోసం టీటీడీ అధికారులు విశేషంగా కృషి చేస్తున్నారని చెప్పారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని డిసెంబర్ 30, 31, జనవరి 1వ తేదిలకు ఈ-డిప్ ద్వారా భక్తులకు టోకెన్లు కేటాయించామని చెప్పారు. ఈరోజుల్లో టోకెన్ ఉన్న భక్తులను మాత్రమే దర్శనాలకు అనుమతిస్తామని, టోకెన్ లేని భక్తులు తిరుమలకు రావచ్చని స్పష్టం చేశారు. కాకపోతే టోకెన్ లేని భక్తులకు దర్శనాలు లేకపోవటంతో ఇబ్బంది పడే అవకాశం ఉంటుందని చెప్పారు.
అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను ఇక్కడ చూడొచ్చు.
ఈ విషయాన్ని పలు మీడియా సంస్థలు కూడా ధృవీకరించాయి. అందుకు సంబంధించిన కథనాలను ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.
కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.

