Thu Dec 18 2025 20:45:57 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: రాఫెల్ ఒప్పంద వివాదానికి సంబంధించిన నకిలీ లేఖ వైరల్ అవుతూ ఉంది
రాఫెల్ ఒప్పంద వివాదానికి సంబంధించిన నకిలీ లేఖ. రాఫెల్ జెట్ ఒప్పంద వివాదం పై ఎస్. జైశంకర్ ఫ్రాన్స్‌కు లేఖ

Claim :
రాఫెల్ జెట్ ఒప్పంద వివాదం పై ఎస్. జైశంకర్ ఫ్రాన్స్‌కు లేఖ రాశారుFact :
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. రాఫెల్ జెట్ ఒప్పందం గురించి ఎస్. జైశంకర్ ఫ్రాన్స్‌కు అలాంటి లేఖ ఏదీ రాయలేదు
భారత్-పాకిస్థాన్ మధ్య చోటు చేసుకున్న ఘర్షణ వాతావరణం సమయంలో రాఫెల్ యుద్ధ విమానాలకు సంబంధించిన చర్చ కూడా జరిగింది. 'ఆపరేషన్ సిందూర్' సమయంలో భారత వైమానిక దళానికి చెందిన మూడు రాఫెల్ యుద్ధ విమానాలను కూల్చివేశామని పాకిస్థాన్ ప్రకటన చేసింది. అయితే దసో ఏవియేషన్ సంస్థ సీఈవో ఎరిక్ ట్రాపియెర్ ఈ వాదనను ఖండించారు. భారత్ ఒక రాఫెల్‌నే కోల్పోయిందని, అది కూడా ఎత్తైన ప్రాంతంలో సాంకేతిక లోపం తలెత్తడం కారణంగానే జరిగిందని స్పష్టత ఇచ్చారు.
డస్సాల్ట్ ఏవియేషన్ భారతదేశం కోసం తయారు చేస్తున్న 26 రాఫెల్ విమానాలకు సంబంధించిన రాడార్లను నెస్ట్ గ్రూప్ ఆధ్వర్యంలోని కేరళకు చెందిన SF టెక్నాలజీస్ నుండి సేకరిస్తూ ఉన్నారు. అధునాతన RBE2 AESA రాడార్లను తయారు చేయడానికి ఈ సంస్థ ఫ్రెంచ్ రక్షణ దిగ్గజం థేల్స్ నుండి కాంట్రాక్టును పొందింది. RBE2 AESA రాడార్ ప్రతికూల వాతావరణంలో కూడా రియల్-టైమ్, హై-రిజల్యూషన్ 3D భూభాగ చిత్రాలను రూపొందించగలదు. ఇది శత్రువుల కదలికలను పసిగట్టగలదు, ఖచ్చితమైన లక్ష్యాలను సాధించగలదు. ఈ ఒప్పందం విలువ, వ్యవధిని సంబంధిత వర్గాలు వెల్లడించలేదు.
ఈ భాగస్వామ్యం రాఫెల్ కార్యక్రమంలో కంపెనీ పాత్రను ప్రతిబింబిస్తుందని, "మేక్ ఇన్ ఇండియా" చొరవను బలోపేతం చేస్తుందని SF టెక్నాలజీస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్. జహంగీర్ అన్నారు.
https://www.google.com/amp/s/
ఈ పరిణామాల మధ్య జైశంకర్ ఫ్రాన్స్‌కు లేఖ రాశారని పోస్టుల్లో ఉంది. రాఫెల్ వివాదం ఇంకా ముగియలేదని, లీక్ అయిన సమాచారాలకు అడ్డుకట్ట వేయడానికి న్యూఢిల్లీ కష్టపడుతోందని అందులో ఉంది. “రాఫెల్ విమానాల కాలక్రమానికి సంబంధించిన కొన్ని సమాచారాలు ఇటీవల ప్రజాక్షేత్రంలోకి వచ్చాయని మా దృష్టికి వచ్చింది. అటువంటి ఏర్పాట్ల సంక్లిష్టతలను, ఇందులో ఉన్న వివరణాత్మక ప్రక్రియలను మేము పూర్తిగా అర్థం చేసుకున్నప్పటికీ, అనుకోకుండా సమాచారం బహిర్గతం అవ్వడం మాకు కొన్ని ఊహించని సవాళ్లను సృష్టించింది” అని ఆ లేఖలో ఉంది.
వైరల్ పోస్టులకు సంబంధించిన ఆర్కైవ్ లింక్స్ ను ఇక్కడ చూడొచ్చు.
https://archive.ph/vab3Y
ఫ్యాక్ట్ చెకింగ్:
రాఫెల్ ఒప్పంద వివాదం కొనసాగుతున్నట్లు సూచిస్తూ ఎస్. జైశంకర్ ఫ్రాన్స్‌కు లేఖ రాశారనే వాదనలో ఎలాంటి నిజం లేదు. అలాంటి లేఖ ఏదీ లేదు, ఆరోపణలు నిరాధారమైనవి.
సంబంధిత కీలకపదాలను ఉపయోగించి మేము వెతికినప్పుడు, ఏ విశ్వసనీయ మీడియా సంస్థ ప్రచురించిన వార్తా కథనం మాకు లభించలేదు. అలాంటి లేఖ ఉండి ఉంటే, అది ప్రామాణికమైన, ప్రధాన స్రవంతి మీడియా ద్వారా నివేదించి ఉండేది.
మేము లేఖ కోసం శోధించినప్పుడు, విదేశాంగ మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా సైట్లలో మాకు ఎటువంటి సమాచారం కనిపించలేదు.
అయితే, వైరల్ క్లెయిమ్‌కు సంబంధించిన డిసెంబర్ 11, 2025 నాటి పోస్ట్ మాకు కనిపించింది. పోస్ట్‌లో, విదేశాంగ మంత్రిత్వ శాఖ, ‘ఈ పోస్ట్‌లోని లేఖ నకిలీది’ అని పేర్కొంది. తప్పుడు సమాచారం గురించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా ఆ పోస్ట్ లో కోరింది.
బూమ్ గతంలో వైరల్ వాదనను తోసిపుచ్చిందని, దానిపై ఒక నివేదికను ప్రచురించిందని మేము కనుగొన్నాము, "రఫేల్ డెలివరీ షెడ్యూల్ లీక్ అయినట్లు, దాని వల్ల కలిగే సమస్యల గురించి విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఫ్రెంచ్ రాయబారి థియరీ మాథౌకు రాసినట్లు చూపించే లేఖ డిజిటల్‌గా ఎడిట్ చేశారు. నకిలీది." అని అందులో తెలిపారు.
https://www.boomlive.in/fact-
విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఫ్రాన్స్‌కు లేఖ రాశారని సూచించే వైరల్ వాదన పూర్తిగా అబద్ధం. అటువంటి లేఖ ఉనికికి మద్దతు ఇవ్వడానికి విశ్వసనీయమైన ఆధారాలు లేదా అధికారిక రికార్డులు లేవు.
అందువల్ల వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని మేము కనుగొన్నాము.
Claim : వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. రాఫెల్ జెట్ ఒప్పందం గురించి ఎస్. జైశంకర్ ఫ్రాన్స్‌కు అలాంటి లేఖ ఏదీ రాయలేదు
Claimed By : Social Media Users
Claim Reviewed By : Telugu Post Fact Check
Claim Source : Social Media
Fact Check : False
Next Story

