Fri Dec 05 2025 16:22:02 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: రంగరాజన్ నరసింహన్ ను డీఎంకే నేతలు కొట్టారంటూ వైరల్ అవుతున్న వీడియో తెలంగాణకు సంబంధించినది
వైరల్ వీడియో 2022 లో తెలంగాణలో చోటు చేసుకున్న ఘటనకు సంబంధించింది

Claim :
ఆలయాల కోసం పోరాడుతున్న రంగరాజన్ నరసింహన్ ను తమిళనాడులో డీఎంకే నేతలు కొట్టారుFact :
వైరల్ వీడియో 2022 లో తెలంగాణలో చోటు చేసుకున్న ఘటనకు సంబంధించింది
రంగరాజన్ నరసింహన్ ఆలయాల సంక్షేమం కోసం పోరాడుతున్న కార్యకర్తగా తమిళనాడులో ప్రసిద్ధి చెందారు. ఆలయ నిర్వహణకు సంబంధించిన పలు పోరాటాలలో ఆయన పాల్గొన్నారు.
ఆలయ నిర్వహణ పద్ధతులపై బహిరంగ విమర్శలకు పేరుగాంచిన రంగరాజన్ నరసింహన్‌ను 2024 డిసెంబర్ లో అరెస్టు చేశారు. చెన్నై సైబర్ క్రైమ్ పోలీసులు శ్రీపెరంబుదూర్ ఎంబార్ జీయర్, తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్‌పై అవమానకరమైన వ్యాఖ్యలు చేసిన ఆరోపణలపై ఆయనను అరెస్టు చేశారు. రంగరాజన్ అనుమతి లేకుండా తమ మధ్య జరిగిన ఫోన్ సంభాషణను యూట్యూబ్‌లో అప్లోడ్ చేశారని, దాని అర్థాన్ని వక్రీకరించారని ఆరోపిస్తూ ఎంబార్ జీయర్ దాఖలు చేసిన ఫిర్యాదు నేపథ్యంలో అరెస్టు జరిగింది. “అవర్ టెంపుల్స్ - రంగరాజన్ నరసింహన్” అనే యూట్యూబ్ ఛానెల్‌ను నిర్వహిస్తున్న రంగరాజన్, డిఎంకె ప్రభుత్వం మీద, పలువురు నేతల మీద విమర్శలు చేశారు.
డిసెంబర్ 6న అప్లోడ్ చేసిన వీడియోలో తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్‌పై రంగరాజన్ వివాదాస్పద ఆరోపణలు చేశారు. ఒక జ్యోతిష్కుడు సూచించిన విధంగా "బ్రాహ్మణ దోషం" అని భావించి, దానికి పరిష్కారంగా ఉదయనిధి ముగ్గురు బ్రాహ్మణ పూజారులతో కర్మలు చేయించారని ఆయన ఆరోపించారు. సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియా అని పిలిచిన ఉదయనిధి స్టాలిన్ దాని సూత్రాలను పాటించాడని, బ్రాహ్మణ దోషం పోగొట్టుకోవడం వలన 2026 ఎన్నికల్లో విజయం సాధించవచ్చని ఆయనకు చెప్పారని రంగరాజన్ అన్నారు. ఆ తర్వాత జైలులో గడిపిన రంగరాజన్ నరసింహన్ బెయిల్ పై బయటకు వచ్చారు.
ఇంతలో రంగరాజన్ నరసింహన్ ను రోడ్డుపై డీఎంకే కార్యకర్తలు కొడుతున్నారంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.
"హిందూ దేవాలయాలలో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ డిఎంకె ప్రభుత్వంపై కేసు దాఖలు చేసిన రెంకరాజన్ నరసింహన్ పై ఈరోజు తిరుచ్చి కోర్టు ప్రాంగణంలో డిఎంకె రౌడీలు దాడి చేశారు. కనీసం దీన్ని వీలైనంత విస్తృతంగా షేర్ చేయండి మరియు అతని ప్రాణాలకు రక్షణ కల్పించండి. లేకపోతే, మన తరపున నిలబడే ఈ నిజాయితీపరుడైన హిందువుపై మనం పెద్ద పాపం చేసిన వాళ్ళమౌతాము." అంటూ పోస్టులు పెట్టారు.
"Renkarajan Narasimhan, who filed a case against the DMK government for alleged irregularities in Hindu temples, was attacked by DMK rowdies in the Trichy court premises today. At least share this as widely as possible and ensure that his life is protected. Otherwise, we are committing a great sin against this honest Hindu who is standing up for us." అంటూ ఇంగ్లీష్ లోనూ పోస్టులు పెట్టారు.

వైరల్ అవుతున్న పోస్టులకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఈ వీడియో తెలంగాణలో 2022లో చోటు చేసుకున్న ఘటన.
వైరల్ వీడియోలోని ఆడియోను విన్న తర్వాత అక్కడి వారు మాట్లాడుతున్న భాష తెలుగు అని మేము గుర్తించాం. దీన్ని బట్టి ఇది తమిళనాడులో చోటు చేసుకున్న ఘటన కాదని తెలుస్తోంది.
ఇక ఇటీవల రంగరాజన్ నరసింహన్ పై ఎవరైనా బహిరంగంగా దాడి చేశారా అనే విషయం తెలుసుకోడానికి మేము ప్రయత్నించాం. అయితే అలాంటి ఘటన ఏదీ చోటు చేసుకోలేదని తెలుస్తోంది. రంగరాజన్ నరసింహన్ పై అటువంటి దాడి జరిగి ఉంటే అది ఖచ్చితంగా వార్తల్లో నిలిచి ఉండేది.
వైరల్ వీడియోలోని కీ ఫ్రేమ్స్ ను తీసుకుని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాం. డిసెంబర్ 2022లో తెలంగాణలో చోటు చేసుకున్న ఘటనలకు సంబంధించిన నివేదికలు లభించాయి.
ఓ బహిరంగ సభలో అయ్యప్ప స్వామిపై 'అవమానకరమైన' వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో 'భారత నాస్తిక సమాజం' అధ్యక్షుడు బైరి నరేష్ పై హైదరాబాద్ నగర పోలీసులు కేసు నమోదు చేశారు. నరేష్ పై భారత శిక్షాస్మృతి (ఐపీసీ) సెక్షన్ 153A కింద కేసు నమోదు చేశారు. నరేష్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ హిందూ నాయకులు గురుస్వామి వీరేందర్ యాదవ్ మాదన్నపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన విజువల్స్ ను పలు తెలుగు మీడియా సంస్థలు నివేదించాయి.
'బైరి నరేష్ ఇంకా దొరకలేదు : Vikarabad SP Koti Reddy | Bairi Naresh controversial comments - TV9' అనే టైటిల్ తో 30 డిసెంబర్ 2022 న టీవీ9 పోస్టు చేసిన వీడియోను మేము గుర్తించాం.
"రణరంగంగా మారిన కోస్గి | Ayyappa Devotees attacked Bhairi Naresh for His Controversial Comments|hmtv" అనే టైటిల్ తో hmtv Telugu News యూట్యూబ్ ఛానల్ పోస్టు చేసిన వీడియో కూడా మాకు లభించింది.
ఈ నివేదికల ప్రకారం, ఈ సంఘటన 2022 డిసెంబర్ 30న తెలంగాణలోని వికారాబాద్ జిల్లా కోస్గి పట్టణంలో జరిగింది. దాడిలో గాయపడిన వ్యక్తిని బాలరాజ్ గా గుర్తించారు. అయ్యప్ప స్వామి గురించి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో భారత నాస్తిక సంఘం అధ్యక్షుడు బైరి నరేష్ కు వ్యతిరేకంగా శివాజీ చౌక్ సమీపంలో నిరసన చేపట్టిన అయ్యప్ప భక్తుల బృందం అతనిపై దాడి చేసింది. నరేష్ వర్గానికి చెందిన వ్యక్తిగా బాలరాజ్ ను తప్పుగా భావించి, నిరసనను రికార్డ్ చేశాడని అనుమానించారు. దీంతో అతనిపై దాడి చేశారు. పోలీసులు జోక్యం చేసుకుని బాలరాజ్ ను కాపాడారు.
వైరల్ అవుతున్న వీడియోలోని విజువల్స్, ఈ విజువల్స్ ఒకటేనని స్పష్టంగా తెలుస్తోంది.
కాబట్టి, ఆలయాల కోసం పోరాడుతున్న రంగరాజన్ నరసింహన్ ను తమిళనాడులో డీఎంకే నేతలు కొట్టారనే వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim : వైరల్ వీడియో 2022 లో తెలంగాణలో చోటు చేసుకున్న ఘటనకు సంబంధించింది
Claimed By : Social Media Users
Claim Reviewed By : TeluguPost
Claim Source : Social Media
Fact Check : False
Next Story