Fri Dec 05 2025 14:58:06 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: పహల్గామ్ ఉగ్రదాడి వెనుక పాకిస్థాన్ ఆర్మీ ఉందంటూ క్రికెటర్ బాబర్ ఆజం తన సోషల్ మీడియా ఖాతాలో వెల్లడించాడు
వైరల్ అవుతున్న వాదనల్లో ఎలాంటి నిజం లేదు

Claim :
పహల్గామ్ ఉగ్రదాడి వెనుక పాకిస్థాన్ ఆర్మీ ఉందంటూ క్రికెటర్ బాబర్ ఆజం ఇంస్టాగ్రామ్ లో పోస్టు పెట్టాడుFact :
వైరల్ అవుతున్న వాదనల్లో ఎలాంటి నిజం లేదు
26 మంది ప్రాణాలను బలిగొన్న ఘోరమైన పహల్గామ్ ఉగ్రవాద దాడి తరువాత, భారత ప్రభుత్వం పాకిస్తాన్‌పై దౌత్యపరమైన చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య, భారత ప్రభుత్వం పాకిస్తాన్ రాజకీయ నాయకులు, క్రికెటర్లు, ప్రముఖులు, టీవీ ఛానెళ్లకు సంబంధించిన అనేక సామాజిక ఖాతాలపై ఆంక్షలు విధించింది.
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, మాజీ మంత్రి బిలావల్ భుట్టో X (గతంలో ట్విట్టర్) ఖాతాలను భారతదేశంలో బ్లాక్ చేశారు. పహల్గామ్ ఉగ్రవాద దాడిపై రెండు దేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అధికారిక యూట్యూబ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలను కూడా అధికారులు బ్లాక్ చేశారు.
బాలీవుడ్ సినిమాల్లో భాగమైన ఫవాద్ ఖాన్, అతిఫ్ అస్లాం అకౌంట్లపై కూడా పరిమితులను విధించారు. ఇక స్టార్ పాకిస్థాన్ క్రికెటర్లు బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్, రిటైర్డ్ ఆటగాళ్ళు షాహిద్ అఫ్రిది, వసీం అక్రమ్ వంటి వారి ఖాతాలను కూడా బ్లాక్ చేశారు. భారతదేశంలో ఈ ఖాతాలను యాక్సెస్ చేయడానికి ప్రయత్నిస్తున్న వినియోగదారులకు ఎలాంటి ఫీడ్ లభించడం లేదు.
ఇంతలో బాబర్ ఆజం పాకిస్థాన్ ఆర్మీని నిందిస్తూ పెట్టిన స్టేటస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇటీవల పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడి నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెటర్ బాబర్ ఆజం ఇన్స్టాగ్రామ్ స్టోరీ వైరల్ అయింది.
బాబర్ ఆజం సందేశంలో భారతదేశం నా రెండవ ఇల్లు అని పేర్కొన్నారు. బాబర్ ఆజం భారతదేశాన్ని ప్రశంసిస్తూ తన రెండవ ఇల్లుగా భావించే చోట తన ఇన్స్టాగ్రామ్ ఖాతా బ్లాక్ చేశారని అందులో ఉంది. ఒక క్రికెటర్‌గా, నేను ఎల్లప్పుడూ భారతదేశంలో ఆడటం ఇష్టపడతాను, క్రికెటర్లు పహల్గామ్ దాడిలో పాల్గొనలేదని స్పష్టం చేయాలనుకుంటున్నానని బాబర్ చెప్పినట్లుగా ఉంది. పహల్గామ్ దాడిని పాకిస్తాన్ సైన్యం నడిపే చెత్త రాజకీయాలంటూ బాబర్ అన్నారు. సైనిక వ్యవస్థ ఉగ్రవాద సంస్థలను రక్షించిందని, సాధారణ పాకిస్తానీలు దాని పరిణామాలను ఎదుర్కొన్నారని ఉంది. పాకిస్తాన్లో నిజంగా ఎవరు అధికారంలో ఉన్నారో, ఉగ్రవాదాన్ని ఎవరు రక్షిస్తున్నారో, మద్దతు ఇస్తున్నారో అందరికీ తెలుసని ఆ టెక్స్ట్ లో ఉంది.
ఈ పోస్టును పలువురు సోషల్ మీడియా వినియోగదారులు షేర్ చేస్తున్నారు.
వైరల్ పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
బాబర్ ఆజం పాకిస్థాన్ లో ఒక స్టార్ క్రికెటర్. అతడు అలాంటి పోస్టు పెట్టి ఉండి ఉంటే అది పాకిస్థాన్ మీడియాలో ప్రముఖంగా ప్రచురించి ఉండేవారు. కానీ అలాంటి కథనాలు ఏవీ మాకు ఇటీవలి కాలంలో కనిపించలేదు.
ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా, చాలా మంది పాకిస్థాన్, బంగ్లాదేశ్ కు చెందిన సోషల్ మీడియా వినియోగదారులు ఈ కథనం నకిలీదని నిర్ధారించారు. భారతదేశంలోని వినియోగదారులు పోస్ట్ ప్రామాణికతను నిర్ధారించలేకపోయినప్పటికీ, భారతదేశం వెలుపలి వినియోగదారులు ఈ స్టోరీ నకిలీదని నిర్ధారించారు. అందుకు సంబంధించిన వీడియోలను కూడా ప్రూఫ్స్ గా పలువురు పోస్టు చేశారు.
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
బాబర్ ఆజం పాకిస్థాన్ లో ఒక స్టార్ క్రికెటర్. అతడు అలాంటి పోస్టు పెట్టి ఉండి ఉంటే అది పాకిస్థాన్ మీడియాలో ప్రముఖంగా ప్రచురించి ఉండేవారు. కానీ అలాంటి కథనాలు ఏవీ మాకు ఇటీవలి కాలంలో కనిపించలేదు.
ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా, చాలా మంది పాకిస్థాన్, బంగ్లాదేశ్ కు చెందిన సోషల్ మీడియా వినియోగదారులు ఈ కథనం నకిలీదని నిర్ధారించారు. భారతదేశంలోని వినియోగదారులు పోస్ట్ ప్రామాణికతను నిర్ధారించలేకపోయినప్పటికీ, భారతదేశం వెలుపలి వినియోగదారులు ఈ స్టోరీ నకిలీదని నిర్ధారించారు. అందుకు సంబంధించిన వీడియోలను కూడా ప్రూఫ్స్ గా పలువురు పోస్టు చేశారు.
మేము సంబంధిత కీవర్డ్స్ తో గూగుల్ సెర్చ్ చేయగా బాబర్ ఆజమ్ అలాంటి పోస్టు ఏదీ చేయలేదని పలు మీడియా సంస్థలు నివేదించాయి.
వాటిని ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.
ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వ్యాపించింది. కానీ భారతదేశంలో అతని ఖాతా బ్లాక్ చేయడం, 24 గంటల తర్వాత స్టోరీ ఉండదు కాబట్టి, అతను నిజంగా ఆ పోస్ట్ చేశాడో లేదో ధృవీకరించడానికి ఎటువంటి ప్రామాణిక మార్గం లేదు.
అయితే, చాలా మంది వినియోగదారులు ఆ పోస్ట్ నకిలీదని నిర్ధారించారు. పాకిస్తాన్ సైన్యాన్ని బహిరంగంగా విమర్శించి ఉంటే అది అంతర్జాతీయ క్రికెట్ సర్కిల్స్ లో సంచలనంగా మారి ఉండేవి.
కాబట్టి, బాబర్ ఆజం పాకిస్థాన్ సైన్యానికి వ్యతిరేకంగా ఎలాంటి పోస్టు పెట్టలేదు.
Claim : వైరల్ అవుతున్న వాదనల్లో ఎలాంటి నిజం లేదు
Claimed By : Social Media Users
Claim Reviewed By : Telugu Post
Claim Source : Social Media
Fact Check : False
Next Story

