Fri Dec 05 2025 11:26:52 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని భార్య చెప్పుతో కొట్టిందంటూ వైరల్ అవుతున్న న్యూస్ పేపర్ క్లిప్పింగ్ లో ఎలాంటి నిజం లేదు
బీఆర్ఎస్ కు చెందిన కీలక నేత పాడి కౌశిక్ రెడ్డి. తెలంగాణలోని హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి

Claim :
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని భార్య చెప్పుతో కొట్టిందని పేపర్ లో వచ్చిందిFact :
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు
బీఆర్ఎస్ కు చెందిన కీలక నేత పాడి కౌశిక్ రెడ్డి. తెలంగాణలోని హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యుడుగా గెలిచారు. ఆయన పలు సందర్భాల్లో వార్తల్లో నిలిచారు. 2025 జులై నెలలో బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై హుజూరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నిరాధార ఆరోపణలు, అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ నేతల ఫిర్యాదుతో కౌశిక్ రెడ్డి పై 352, 353(1)(b), 353(2) బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు ఫైల్ చేశారు. ఇదే విషయమై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ పీఎస్ లోనూ కేసు నమోదైంది.
కౌశిక్ రెడ్డి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై ఘాటు విమర్శలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రైవేటు హ్యాకర్లతో హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేయిస్తూ వారిని బ్లాక్మెయిల్ చేయిస్తున్నారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ చేయిస్తున్నట్టు రేవంత్‌రెడ్డి స్వయంగా అంగీకరించారని, కాబట్టి దీనిపై సీబీఐ, ఈడీలతో విచారణ జరిపించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ ఆరోపణల నేపథ్యంలో ఆయనపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేయవచ్చనే అనుమానంతో బీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్యే నివాసానికి చేరుకున్నారు. కౌశిక్ రెడ్డిపై ఎన్ఎస్యూఐ నేతలు దాడి చేస్తారనే అనుమానంతో పోలీసులు బందోబస్తు కూడా భారీగానే ఏర్పాటు చేశారు.
ఇలాంటి పరిస్థితుల్లో పాడి కౌశిక్ రెడ్డిని ఆయన భార్య చెప్పుతో కొట్టిందంటూ ఓ న్యూస్ పేపర్ క్లిప్పింగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.
"బీఆర్ఎస్ ఎమ్మెల్యేను చెప్పుతో కొట్టిన భార్య
నిన్న అర్ధరాత్రి బంజారాహిల్స్ లోని పార్క్ హయత్ హెూటల్ లో హంగామా
ప్రముఖ టీవీ యాంకర్ తో అడ్డంగా దొరికిన హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
యాంకర్ తో ఏకాంతంగా ఉన్న కౌశల్ రెడ్డిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య షాలిని రెడ్డి
ఆగ్రహంతో కౌశిక్ రెడ్డిని హెూటల్ రూం నుండి బయట వరకు చెప్పుతో కొట్టుకుంటూ తీసుకొచ్చిన భార్య
ఎవరు వీడియోలు, ఫోటోలు తీయకుండా జాగ్రత్త పడ్డ హెూటల్ సెక్యూరిటీ సిబ్బంది
వారంలో నాలుగైదు సార్లు మీటింగ్స్ పేరుతో కౌశిక్ రెడ్డి పార్క్ హయత్ కు వస్తున్నట్టు సమాచారం
రూం బయట పీఏ కాపలాగా ఉంచి ఇలాంటి నీచమైన పనులు చేస్తున్నాడని తెలుసుకున్న భార్య
పరాయి మహిళతో చనువుగా ఉన్న కౌశిక్ రెడ్డిని చూసి భార్యకు ఫిర్యాదు చేసిన బంధువులు" అంటూ న్యూస్ పేపర్ క్లిప్పింగ్ ను సోషల్ మీడియా యూజర్లు షేర్ చేస్తున్నారు.
వైరల్ అవుతున్న పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించి ఇటీవల చోటు చేసుకున్న మీడియా కథనాల గురించి మేము తెలుసుకోడానికి ప్రయత్నించాం. పలు మీడియా కథనాలను పరిశీలించగా అందులో ఎక్కడా కూడా ఇలాంటి ఘటన గురించిన సమాచారం లేదు.
వైరల్ పేపర్ క్లిప్పింగ్ లో పలు తప్పులు ఉన్నట్లు కూడా మేము గుర్తించాం. మేము పేపర్ క్లిప్పింగ్‌ను జాగ్రత్తగా పరిశీలించగా, ఆ క్లిప్పింగ్ గురువారం, జూలై 26, 2025 తేదీ అని ఉంది. అయితే, జూలై 26 గురువారం కాదు, శనివారం వచ్చింది. దీంతో వైరల్ పేపర్ క్లిప్పింగ్ గురించి అనేక సందేహాలు నెలకొన్నాయి.
తెలుగు స్క్రైబ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల ద్వారా కథనాలను పంచుకుంటుంది. ఈ సోషల్ మీడియా హ్యాండిల్ కు వెబ్సైట్ లేదు.అప్పుడప్పుడు ఇ-పేపర్-శైలి కంటెంట్‌ను పోస్ట్ చేస్తుంది. ఇటీవల ఆ సంస్థకు సంబంధించిన సోషల్ మీడియా హ్యాండిల్స్‌ను పరిశీలించాము, కానీ వైరల్ పేపర్ క్లిప్పింగ్ షేర్ చేసినట్లుగా కనుగొనలేకపోయాం.
ఇక తెలుగు స్క్రైబ్ కు సంబంధించిన ఫ్యాక్ట్ చెక్ టీమ్ కూడా వైరల్ పోస్టుపై నేరుగా స్పందించింది. ఇది ఫేక్ న్యూస్ అని, చాలా జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేసింది.
పలు ఫ్యాక్ట్ చెక్ సంస్థలు కూడా వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని తెలిపాయి. అందుకు సంబంధించిన లింక్ ను ఇక్కడ చూడచ్చు.
కాబట్టి, వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎలాంటి నిజం లేదు.
కాబట్టి, వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎలాంటి నిజం లేదు.
Claim : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని భార్య చెప్పుతో కొట్టిందని పేపర్ లో వచ్చింది
Claimed By : Social Media Users
Claim Reviewed By : Telugu Post
Claim Source : Social Media
Fact Check : False
Next Story

