Sat Dec 13 2025 22:31:40 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: బంగ్లాదేశీ సినిమాకు సంబంధించిన విజువల్స్ ను లవ్ జీహాద్ ఘటనగా ప్రచారం చేస్తున్నారు
కొన్ని కొన్ని వీడియోలు చూస్తే అవి నిజంగా జరిగినవా లేదా అనే అనుమానం తప్పకుండా

Claim :
అబ్దుల్ ఆదిల్ ఖాన్ను వివాహం చేసుకున్న అమ్మాయికి ఈ పరిస్థితి వచ్చిందిFact :
వైరల్ విజువల్స్ బంగ్లాదేశీ సినిమాకు సంబంధించింది. ఎలాంటి మతపరమైన కోణం లేవు
కొన్ని కొన్ని వీడియోలు చూస్తే అవి నిజంగా జరిగినవా లేదా అనే అనుమానం తప్పకుండా వస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సృష్టించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ ఉన్నాయి. ఇక ఏదైనా సినిమాలు, షోలకు సంబంధించిన సన్నివేశాలు కూడా నిజంగా జరిగినవనే వాదనతో వైరల్ చేస్తూ వస్తుంటారు.
ఇక ఓ మహిళ ముఖం మీద కాలిన గాయాలతో ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. ఇదొక లవ్ జీహాద్ ఘటన అంటూ ప్రచారం చేస్తున్నారు.
"అబ్దుల్ ప్రేమతో నాశనమైన మరో హిందూ అమ్మాయి, ఈ అమ్మాయి 2023లో అబ్దుల్ ఆదిల్ ఖాన్ను వివాహం చేసుకుంది, తన పేరును నందిని మండల్ నుండి జరా ఇస్లాం గా మార్చుకుంది మరియు ఇస్లాం మతంలోకి మారింది. చాలా మంది హిందువులు ఆమెను ఈ వివాహం చేసుకోవద్దు అని చెప్పి ఒప్పించడానికి ప్రయత్నించారు , కానీ ఆమె నిరాకరించింది. ఈ హిందూ అమ్మాయి అబ్దుల్ ప్రేమలో పూర్తిగా మునిగిపోయింది. ఈ అమ్మాయి సోషల్ మీడియాలో ప్రసిద్ధి చెందింది. చాలా మంది ఆమెను ఒప్పించడానికి ప్రయత్నించారు, "నీ దగ్గర డబ్బు, కీర్తి, అన్నీ ఉన్నాయి. నిన్ను నువ్వు నాశనం చేసుకోకు అని . అబ్దుల్ నిన్ను దోచుకుని మోసం చేస్తాడు. దీన్ని అర్థం చేసుకోవాలని , అతని నుండి దూరంగా ఉండు" అని. కానీ ఈ అమ్మాయి వారి మాటలను పెడచెవిన పెట్టింది, మంచి చెప్పిన వారిపైనే కేసు పెడతానని బెదిరిస్తూ, "నా అబ్దుల్ నన్ను తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడని నా వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని ; నేనే అన్నీ చూసుకుంటాను" అని చెప్పింది. ఇప్పుడు, 2023 నుండి 2025 వరకు, అబ్దుల్ రెండు సంవత్సరాలు తన కోరికను తీర్చుకున్నాడు, ఈ అమ్మాయిని అన్ని విధాలుగా దోపిడీ చేశాడు మరియు ఇప్పుడు అతను ఆమెను కొట్టి ఇంటి నుండి వెళ్ళగొట్టాడు. ఆమె ప్రస్తుత పరిస్థితిని ఉన్న ఫోటోలో చూడండి." అంటూ పోస్టులను వైరల్ చేస్తూ ఉన్నారు.

వైరల్ పోస్టులకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ పోస్టులలో ఎలాంటి మతపరమైన కోణం లేదు. సినిమాకు సంబంధించిన విజువల్స్ ఇవి.
మేము రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా joutyislamm అనే ఇన్స్టాగ్రామ్ ఖాతాలో వైరల్ పోస్టుల్లోని పోస్టర్స్ ను గమనించాం. డిసెంబర్ 26, 2024న పోస్టు పెట్టారు.
"বিধবা বউ"
আজ বৃহস্পতিবার দুপুর ৩ টায়
Choice View Media ইউটিউব চ্যানেলে!
Mohin Khan
Tuhin Chowdhury
Alamin Hosen Najim
Shuvojit Roy
Khaled Hosain Jahid
Sahela Akter" అంటూ పోస్టు పెట్టారు.
దీన్ని బట్టి ఇదొక సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ పోస్టర్ అని స్పష్టంగా తెలుస్తోంది. పలు సందర్భాల్లో ఇదే అకౌంట్ లో ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్ ను షేర్ చేశారు. 'విధవ భార్య' అనే సినిమా అని పోస్టర్స్ ద్వారా తెలుస్తోంది.
ఇక అదే ఖాతాలో 21 అక్టోబర్ 2025న জীবনে সব কিছুর পিছনে একটা অজানা গল্প থাকে ,গল্পটা কেউ জানতে বা বুজতে চাইনা #foryoupagereels #joutyislam #BTS #BanglaNatok #shooting అనే టైటిల్ తో సినిమాకు సంబంధించిన విజువల్స్ ఇవని స్పష్టంగా తెలిపారు. అందులో కాలిన గాయాలతో ఉన్న మహిళకు సంబంధించిన విజువల్స్ సినిమా షూటింగ్ లో భాగంగా ఉందని తెలుస్తోంది.
అంతకు ముందు అక్టోబర్ 11న కూడా అదే వీడియోను joutyislamm పేజీలో పోస్టు చేశారు.
ఇక ఫేస్ బుక్ లో పెట్టిన వీడియోలో ఇది షూటింగ్ లో భాగంగా తీసినది అంటూ ఆమె వివరణ ఇచ్చారు. అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్ చూడొచ్చు.
ఇక వైరల్ అవుతున్న పోస్టులపై అదే అకౌంట్ లో నవంబర్ 3న పోస్టులు పెట్టారు.
"నేను నిద్ర లేచినప్పుడు నా పేరు నందిని మండల్ గా, తుహిన్ చౌదరి గా మారిపోయిందని చూశాను. ఇలాంటి వార్తలు నా కుటుంబం, స్నేహితులు, సహోద్యోగులకు ఇంకా చాలా వస్తున్నాయి అలా జరగకూడదు. దయచేసి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం ఆపండి. మతం గురించి అనవసరమైన సమస్యలను సృష్టించకుండా ఉండండి." అంటూ తెలిపారు.
కాబట్టి, వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎలాంటి నిజం లేదు. మతపరమైన కోణం అసలు లేదు.
Claim : వైరల్ విజువల్స్ బంగ్లాదేశీ సినిమాకు సంబంధించింది. ఎలాంటి మతపరమైన కోణం లేవు
Claimed By : Social Media Users
Claim Reviewed By : TeluguPost
Claim Source : Social Media
Fact Check : False
Next Story