Mon Jun 16 2025 19:56:34 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: ఏఐ వీడియోను భారత్ లో భారీ వరదలకు సంబంధించిన విజువల్స్ గా షేర్ చేస్తున్నారు
వైరల్ వీడియోను ఏఐ ద్వారా సృష్టించారు

Claim :
భారత్ లో భారీ వరదలకు సంబంధించిన విజువల్స్ ఇవిFact :
వైరల్ వీడియోను ఏఐ ద్వారా సృష్టించారు
నైరుతి రుతుపవనాల కారణంగా భారతదేశంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు భారీగా కురుస్తూ ఉన్నాయి. అస్సాంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. అస్సాం రాష్ట్రంలోని 12 జిల్లాల్లోని 41 రెవెన్యూ సర్కిళ్లు, 999 గ్రామాల్లో మొత్తం 3,37,358 మంది వరద ముంపుకు గురయ్యారని అధికారులు తెలిపారు. అధికారిక బులెటిన్ ప్రకారం ఈ సంవత్సరం వరదలు, కొండచరియలు విరిగిపడటం వల్ల మరణించిన వారి సంఖ్య 23 కి పెరిగింది. బ్రహ్మపుత్రతో సహా ప్రధాన నదుల్లో వరద నీరు కాస్త తగ్గుతున్న ధోరణి ఉంది. అయితే ధుబ్రి వద్ద బ్రహ్మపుత్ర, ధరమ్‌తుల్ వద్ద కోపిలి, బిపి ఘాట్ వద్ద బరాక్, శ్రీభూమి వద్ద కుషియారా నదులు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి.
ప్రతి సంవత్సరం, అస్సాంలో రుతుపవనాలు సమయంలో నదులు ఉప్పొంగుతూ ఉండడం, కట్టలు తెగిపోతూ ఉండడంతో గ్రామాలు నీటిలో మునిగిపోతాయి. 2019 నుండి 900 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. బ్రహ్మపుత్ర ఉగ్రరూపం దాలుస్తూ ఉండడం, వాతావరణ మార్పులు, అస్సాం మునిగిపోవడానికి గల కారణాలని అంటున్నారు. 133 సహాయ శిబిరాల్లో 36,000 మందికి పైగా నిరాశ్రయులైన వ్యక్తులు ప్రస్తుతం ఆశ్రయం పొందుతున్నారు, 68 సహాయ పంపిణీ కేంద్రాలు కూడా పనిచేస్తున్నాయి. 12,659 హెక్టార్లలోని పంట భూములు ఇంకా నీట మునిగిపోయి ఉన్నాయి. కాజిరంగ జాతీయ ఉద్యానవనం, పోబిటోరా వన్యప్రాణుల అభయారణ్యం కూడా వరదలకు ప్రభావితమై ఉన్నాయని అధికారులు తెలిపారు.
ఇంతలో, భారీ వర్షాలకు భారతదేశంలోని పలు ప్రాంతాల్లో రోడ్లు తెగిపోయాయంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.
"पूर्वोत्तर में बाढ़ से हाहाकार, अब तक 36 मौत
पूर्वोत्तर भारत में भारी बारिश और बाढ़ से हाहाकार मचा है।
पिछले 4 दिनों से जारी भारी बारिश और बाढ़ के कारण अब तक 36 लोगों की मौत हो चुकी है, जबकि क्षेत्र के कई राज्यों में 5.5 लाख से अधिक लोग प्रभावित हुए…" అంటూ కొండల మధ్య రోడ్డు తెగిపోయి ఉండడం, వాహనాలు నీటిలో మునిగిపోతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.
"ఈశాన్య భారతదేశంలో వరదలు బీభత్సం సృష్టించాయి, ఇప్పటివరకు 36 మంది మరణించారు
ఈశాన్య భారతదేశంలో భారీ వర్షాలు వరదలు విధ్వంసం సృష్టించాయి. గత 4 రోజులుగా కొనసాగుతున్న భారీ వర్షాలు మరియు వరదల కారణంగా ఇప్పటివరకు 36 మంది మరణించారు, ఈ ప్రాంతంలోని అనేక రాష్ట్రాల్లో 5.5 లక్షలకు పైగా ప్రజలు ప్రభావితమయ్యారు" అని ఈ పోస్టులు చెబుతున్నాయి.

హిమాచల్ ప్రదేశ్ లో చోటు చేసుకుందంటూ మరికొన్ని పోస్టులు కూడా వైరల్ అవుతూ ఉన్నాయి.
వైరల్ పోస్టులకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ను ఇక్కడ చూడొచ్చు
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వీడియోను ఏఐ ద్వారా సృష్టించారు.
వైరల్ వీడియోలోని స్క్రీన్ షాట్స్ తీసుకుని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాం. ఈ వీడియోను ఏ మీడియాకు సంబంధించిన ఛానల్స్ కానీ యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ కానీ పోస్టు చేయలేదు.
వైరల్ వీడియోను పరిశీలించగా అందులోని కార్ల తీరులో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. అంతేకాకుండా నీరు ప్రవహిస్తున్న విధానంలో కూడా తేడాలను గమనించవచ్చు.
మా తదుపరి పరిశోధనలో PAVOROSO అనే యూట్యూబ్ ఛానల్ లో 28 మే 2025న ఇదే వీడియోను అప్లోడ్ చేశారు. ఈ వీడియో పోస్టు చేసిన సమయానికి ఆ ప్రాంతాల్లో భారీ వరదలు సంభవించలేదు.
ఇక ఈ వీడియో వివరణలో
"Enxurrada abre cratera que engole veiculos em estrada para cidade.
Entretenimento apocalíptico criado por inteligência artificial." అని ఉంది. దీన్ని బట్టి ఈ వీడియోను ఏఐ ద్వారా సృష్టించారని స్పష్టంగా వివరించారు.
ఎడిట్ చేసిన సింథటిక్ కంటెంట్ గానూ.. అందులోని ఆడియో లేదా దృశ్యాలను ఎడిట్ లేదా డిజిటల్‌గా రూపొందించినట్లుగా తెలిపారు.
వివరణకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు
ఇక ఈ ఛానల్ లో పలు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తో రూపొందించిన కంటెంట్ ను మనం చూడవచ్చు.
వైరల్ వీడియో ఏఐ సృష్టి అవునో కాదో తెలుసుకోడానికి మేము ఏఐ డిటెక్షన్ టూల్స్ ను ఉపయోగించి తెలుసుకోడానికి ప్రయత్నించగా రిజల్ట్స్ లో అది ఏఐ సృష్టి అని తేలింది.
ఇదే వైరల్ వీడియో మయన్మార్ లో చోటు చేసుకుందిగా కూడా గతంలో వైరల్ అయింది. అయితే అందులో ఎలాంటి నిజం లేదంటూ ఫ్యాక్ట్ చెక్ సంస్థ ధృవీకరించింది. ఆ లింక్ ను ఇక్కడ చూడొచ్చు.
Social media users share AI-generated video of devastating India floods అంటూ బీబీసీ కూడా వైరల్ వీడియోను ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రూపొందించారంటూ నివేదించింది.
కాబట్టి, వైరల్ అవుతున్న వీడియో ఏఐ సృష్టి అంటూ స్పష్టంగా తెలుస్తోంది. ఈ వీడియో భారతదేశంలో వచ్చిన వరదలకు సంబంధించినది కాదు.

Claim : వైరల్ వీడియోను ఏఐ ద్వారా సృష్టించారు
Claimed By : Social Media Users
Claim Reviewed By : TeluguPost
Claim Source : Social Media
Fact Check : False
Next Story