Fri Mar 20 2026 23:46:30 GMT+0530 (India Standard Time)
ఫ్యాక్ట్ చెక్: ఇరాన్ భారత్ కు చెందిన నౌకపై దాడి చేసిందంటూ ఏఐ వీడియోను షేర్ చేస్తున్నారు
ఇరాన్ భారత్ కు చెందిన నౌకపై దాడి చేసిందంటూ

Claim :
భారత్ నౌకపై ఇరాన్ దాడి చేసిన వీడియోFact :
ఏఐ ద్వారా సృష్టించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు
ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ క్షిపణి దాడులతో ప్రపంచం మొత్తం ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంది. అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్‌ల మధ్య భీకర సైనిక ఘర్షణ "చమురు యుద్ధం"గా మారిపోయింది. శిలాజ ఇంధన శక్తి ఉత్పత్తికి సంబంధించిన సౌకర్యాలపై ఇరాన్, ఇజ్రాయెల్ తొలిసారిగా దాడులు చేసుకున్నాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా మరింత ప్రకంపనలు సృష్టిస్తుంది. ఇంధనం ఇప్పుడు ఒక యుద్ధ ఆయుధంగా మారింది.
పశ్చిమ ఆసియా ఉద్రిక్తతల వల్ల ప్రపంచ దేశాలకు ముడి చమురు సరఫరా చేసే హార్మూజ్ జలసంధి ప్రస్తుతం మూతపడింది. ఈ క్రమంలో భారత చమురు నౌకలకు ఎటువంటి ముప్పు వాటిల్లకుండా సురక్షితంగా స్వదేశానికి చేర్చేందుకు భారత నౌకాదళం తన యుద్ధ నౌకల మోహరింపును మరింతగా పెంచుతోంది. భారత నౌకాదళం పహారా నడుమ ఇప్పటికే కొన్ని నౌకలు క్షేమంగా చేరుకున్నాయి. ‘శివాలిక్’, ‘నందా దేవి’ అనే రెండు ఎల్పీజీ క్యారియర్లు 92,712 మెట్రిక్ టన్నుల గ్యాస్‌తో భారత తీరానికి చేరుకున్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ )లోని ఫుజైరా పోర్ట్ నుండి బయలుదేరిన ఒక చమురు ట్యాంకర్‌ను కూడా భారత యుద్ధనౌక సురక్షితంగా ఎస్కార్ట్ చేసింది.
ఇలాంటి పరిస్థితుల్లో భారత నౌకపై దాడి జరిగిన వీడియో అంటూ ఓ వీడియోను షేర్ చేస్తున్నారు. ఆ వీడియోలో నౌక మీద దాడి జరగడం మనం చూడొచ్చు.
వైరల్ పోస్టుకు సంబంధించిన ఆర్కైవ్ లింక్ ను ఇక్కడ చూడొచ్చు
వైరల్ వీడియోకు సంబంధించిన స్క్రీన్ షాట్ ఇక్కడ ఉంది
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. భారత్ కు చెందిన నౌక మీద ఇరాన్ ఎలాంటి దాడి చేయలేదు.
మేము సంబంధిత కీవర్డ్స్ తో గూగుల్ సెర్చ్ చేశాం. అయితే భారత్ కు చెందిన నౌక మీద ఇరాన్ దాడి చేయలేదంటూ మాకు పలు కథనాలు లభించాయి. ప్రస్తుతం ఇరాన్ యుద్ధం కారణంగా హోర్ముజ్ జలసంధి వద్ద అనేక దేశాలకు చెందిన నౌకలు చిక్కుకున్నాయి. అందులో ఇండియాకు చమురు తీసుకొచ్చే 22 నౌకలు ఉన్నాయి. వీటిలో కొన్ని ఇండియావి, ఇంకొన్ని విదేశాలకు చెందినవి. మిగిలిన 22 నౌకల్ని కూడా భారత్ కు తీసుకొచ్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని పలు మీడియా కథనాలు తెలిపాయి.
ఇక వైరల్ వీడియోలోని విజువల్స్ ను నిశితంగా పరిశీలించగా ఎన్నో తేడాలు కనిపించాయి. దాడి జరిగిన సమయంలో అందులోని వ్యక్తులు ప్రవర్తించిన తీరు సందేహాస్పదంగా అనిపించింది. ఇది సాధారణంగా ఏఐ వీడియోలలో కనిపించే పొరపాట్లు.
వైరల్ వీడియోను తీసుకుని మేము హైవ్ ఏఐ డిటెక్షన్ టూల్ ద్వారా పరిశీలించాం. అయితే ఇది ఏఐ సృష్టి అంటూ తేల్చింది. అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ఇక్కడ ఉంది.
వైరల్ అవుతున్న వీడియోలో ఎలాంటి నిజం లేదని పలు ఫ్యాక్ట్ చెక్ సంస్థలు కూడా తెలిపాయి. వాటిని ఇక్కడ చూడొచ్చు.
కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఏఐ ద్వారా సృష్టించిన వీడియోను నిజమైన ఘటనగా షేర్ చేస్తున్నారు.
Claim : ఏఐ ద్వారా సృష్టించిన వీడియోను భారత్ నౌకపై ఇరాన్ దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేశారు
Claimed By : Social Media Users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Social Media
Fact Check : False
Next Story

