Fri Feb 20 2026 17:23:40 GMT+0530 (India Standard Time)
ఫ్యాక్ట్ చెక్: యుద్ధానికి సిద్ధమైన రోబోలు అంటూ వైరల్ అవుతున్న వీడియోను ఏఐ ద్వారా సృష్టించారు
యుద్ధానికి సిద్ధమైన రోబోలు అంటూ వైరల్ అవుతున్న వీడియోను

Claim :
యుద్ధంలో ఆరి తేరిపోయిన రోబోలు. ఇకపై యుద్ధాలు వీటితోనేFact :
వైరల్ అవుతున్న వీడియోను ఏఐ ద్వారా సృష్టించారు
దేశ రాజధాని ఢిల్లీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్’ నిర్వహించారు. ఈ సమిట్లో గ్రేటర్ నోయిడాకు చెందిన గోల్గోతియాస్ యూనివర్సిటీకి చేదు అనుభవం ఎదురైంది. సమిట్ నిర్వాహకులు గోల్గోతియాస్ యూనివర్సిటీ ప్రతినిధులను అక్కడినుంచి వెంటనే వెళ్లిపోమని ఆదేశించారు. సదరు యూనివర్సిటీకి చెందిన ప్రతినిధులు చేసిన తప్పుడు ప్రచారం కారణంగానే బహిష్కరణకు గురయ్యారు. చైనా రోబో డాగ్ ను కొని తెచ్చి తామే అభివృద్ధి చేశామంటూ ప్రచారం చేసుకున్నారు. దక్షిణ కొరియా తయారు చేసిన సాకర్ డ్రోన్ ను కొనుగోలు చేసి ఈ సదస్సుకు తీసుకొచ్చింది. అది కూడా తమ వర్సిటీ విద్యార్థులే తయారుచేశారని చెప్పుకుంది. యూనివర్సిటీ తరఫున సదస్సుకు హాజరైన ప్రొఫెసర్ నేహా సింగ్ రోబో డాగ్ తో పాటు ఈ సాకర్ డ్రోన్ ను, థర్మాకోల్ డ్రోన్ ను తమ ఘనతగా ప్రచారం చేసుకున్నారు.
ఒకవైపు ఈ రోబో డాగ్ గురించి చర్చ జరుగుతూ ఉండగా, మరోవైపు హ్యుమనాయిడ్ రోబోల సైన్యానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. "ARMED ROBOTS TESTED — FUTURE OF WAR WITHOUT HUMANS? Footage of a Unitree Robotics robot during a shooting test is circulating.The idea of autonomous machines carrying weapons is unsettling. If this is the direction technology is heading, future wars may no longer require human soldiers." అంటూ పోస్టులు పెట్టారు.
ఆ హ్యూమనాయిడ్ రోబోలు చేతుల్లో గన్స్ పట్టుకుని వెళుతూ ఉండడం. లక్షాలను కాలుస్తూ ఉండడం ఈ వీడియోలలో చూడొచ్చు. చైనా దేశ జెండా ఆ రోబో భుజాల మీద ఉంది.
వైరల్ వీడియోకు సంబంధించిన ఆర్కైవ్ లింక్ ను ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. వైరల్ వీడియోను ఏఐ ద్వారా సృష్టించారు.
హ్యూమనాయిడ్ రోబోలు అస్సాల్ట్ రైఫిళ్లను మోస్తున్నట్లు చూపించే వీడియో ఇంటర్నెట్లో వైరల్గా మారింది. చైనా సైన్యం రోబో సైనికులకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించిందని చెప్పారు. మేము సంబంధిత కీవర్డ్స్ తో ఇంటర్నెట్ లో వెతకగా మాకు ఎలాంటి నివేదికలు లభించలేదు.
2026లో జరిగిన చైనీస్ మిలిటరీ లైవ్-ఫైర్ పరీక్షలలో యునిట్రీ హ్యూమనాయిడ్ రోబోట్లను ఉపయోగించినట్లు ధృవీకరించబడిన నివేదికలు ఏవీ మా పరిశోధనలలో కనిపించలేదు.
మేము మొదట వీడియో నుండి కీఫ్రేమ్లను సంగ్రహించి, Google Lens ఉపయోగించి రివర్స్ ఇమేజ్ సెర్చ్ నిర్వహించాము. చైనీస్ వీడియో-షేరింగ్ ప్లాట్ఫామ్ బిలిబిలిలో అదే వీడియోను ఫిబ్రవరి 17, 2026న “oukanghong” అనే వినియోగదారు అప్లోడ్ చేశారు. అందులో ఎరుపు రంగులో డిస్క్లైమర్ కూడా ఉంది, షూటింగ్ విజువల్స్ కల్పితమైనవని, వీడియో AIని ఉపయోగించి రూపొందించినట్లుగా స్పష్టంగా పేర్కొన్నారు.
https://www.bilibili.com/
Unitree G1 గురించి ఈ యూజర్ ప్రస్తావించారు. చైనాకు చెందిన రోబోటిక్స్ కంపెనీ యూనిట్రీ అభివృద్ధి చేసి మార్కెట్ చేస్తున్న రోబోట్ కు, వైరల్ వీడియోలో ఉన్న రోబోట్లకు చాలా తేడాలు ఉన్నట్లు కూడా మేము గమనించాము.
వైరల్ వీడియో లోని విజువల్స్ నిజమైనవా, ఏఐకు సంబంధించినవా అని తెలుసుకోవడం కోసం పలు ఏఐ డిటెక్షన్ టూల్స్ ను వినియోగించి వెతికాం. అయితే ఈ టూల్స్ వైరల్ విజువల్స్ ఏఐ సృష్టి అని తేల్చాయి. అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు.
ఇక వైరల్ అవుతున్న విజువల్స్ నిజమైనవి కావంటూ పలు ఫ్యాక్ట్ చెక్ సంస్థలు కూడా నివేదించాయి. వాటిని ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.
కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim : వైరల్ అవుతున్న వీడియోను ఏఐ ద్వారా సృష్టించారు
Claimed By : Social Media Users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Social Media
Fact Check : False
Next Story

