Fri Dec 05 2025 13:13:32 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: ఏఐ వీడియోను మొంథా తుపానుకు సంబంధించిందిగా ప్రచారం చేస్తున్నారు
బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుపాను కాకినాడ- మచిలీపట్నం మధ్య అంతర్వేదిపాలెం సమీపంలో తీరాన్ని తాకింది

Claim :
వైరల్ అవుతున్న వీడియో మొంథా తుపానుకు సంబంధించిందిFact :
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సృష్టించిన వీడియో అని తేలింది
బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుపాను కాకినాడ- మచిలీపట్నం మధ్య అంతర్వేదిపాలెం సమీపంలో తీరాన్ని తాకింది. తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 100 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. బుధవారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ పత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
అల్లూరి సీతారామరాజు జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఏజెన్సీ ప్రాంతం తడిసి ముద్దయింది. వాగులు పొంగి ప్రవహిస్తుండటంతో అరకు వ్యాలీ-విశాఖపట్నం మధ్య ఘాట్ రోడ్డుపై రాకపోకలు నిలిచిపోయాయి. సుంకరమెట్ట కాఫీ తోటలు, అనంతగిరి మండలంలోని పలు ప్రాంతాల్లో రోడ్డుపై వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఒంగోలు సమీపంలోని యరజర్ల-వెంగముక్కలపాలెం మధ్య ఉన్న వాగు ఉప్పొంగి ప్రవహించడంతో ఓ కారు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. అకస్మాత్తుగా పెరిగిన వరద తీవ్రతకు కారు అదుపుతప్పి వాగులోకి జారిపోయింది. అయితే, డ్రైవర్ అప్రమత్తమై వెంటనే కారులో నుంచి బయటకు రావడంతో ప్రాణనష్టం తప్పింది.
అయితే కొందరు మాత్రం మెంథా తుపానుకు సంబంధించిన విజువల్స్ అంటూ సముద్రం అల్లకల్లోలం అయిన విజువల్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
సముద్రం ఉవ్వెత్తున ఎగిసిపడి తీర ప్రాంతంలో ఉన్న ప్రజల మీద పడుతున్న విజువల్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
వైరల్ అవుతున్న పోస్టును ఇక్కడ చూడొచ్చు
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వీడియో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సృష్టి.
వైరల్ వీడియోను నిశితంగా పరిశీలించగా ఏ మాత్రం రియలిస్టిక్ గా అనిపించలేదు. అంత జరుగుతున్నా అక్కడ ఉన్న ప్రజలు కనీసం వెనుకకు కూడా తిరిగి చూడలేదు. తీరంలోని ప్రజలు కనీసం ఎలాంటి రెస్పాన్స్ కూడా ఇవ్వడం లేదు.
ఈ వీడియోను స్క్రీన్ షాట్ తీసి చూడగా.. అదే వీడియోను 21 అక్టోబర్ 2025న అప్లోడ్ చేసినట్లు గమనించాం. Hausa Zip Tv అనే యూట్యూబ్ ఛానల్ లో ఈ వీడియోను అప్లోడ్ చేశారు. కాబట్టి, ఆంధ్రప్రదేశ్ తీరాన్ని మెంథా తుఫాను తాకకముందే ఈ వీడియో ఆన్ లైన్ లో అందుబాటులో ఉందని స్పష్టంగా తెలుస్తోంది.
ఇక ఈ ఛానల్ ను పరిశీలించగా ఏ మాత్రం రియలిస్టిక్ గా అనిపించని పలు వీడియోలు కనిపించాయి. ఇవన్నీ ఏఐ సృష్టి అని స్పష్టంగా తెలుస్తోంది.
ఏఐ ద్వారా సృష్టించారా.. లేదా అని తెలుసుకోవడం కోసం Hive Moderation టూల్ ను ఆశ్రయించగా ఇది 72 శాతం పైగా ఏఐ సృష్టి ఉందంటూ తేల్చింది.
ఆ స్క్రీన్ షాట్ ఇక్కడ చూడొచ్చు
ఇక Sightengine కూడా వైరల్ విజువల్స్ ఏఐ ద్వారా సృష్టించారని. 99 శాతం స్కోరుతో ఇది ఏఐ సృష్టి అంటూ తేల్చింది. అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు.
కాబట్టి, వైరల్ అవుతున్న విజువల్స్ మెంథా తుఫానుకు సంబంధించినవి కావు. ఏఐ ద్వారా సృష్టించారు.
Next Story

