Mon Mar 30 2026 16:45:46 GMT+0530 (India Standard Time)
ఫ్యాక్ట్ చెక్: ఏఐ ద్వారా సృష్టించిన ఫోటోలను సోనియా గాంధీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న నిజమైన ఫోటోలుగా వైరల్ చేస్తున్నారు
ఏఐ ద్వారా సృష్టించిన ఫోటోలను సోనియా గాంధీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న నిజమైన

Claim :
ఆసుపత్రి బెడ్ మీద సోనియా గాంధీ. పరామర్శిస్తున్న కుటుంబ సభ్యులుFact :
వైరల్ ఫోటోలను ను ఏఐ ద్వారా సృష్టించారు
కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ మార్చి 26 న సర్ గంగా రామ్ ఆసుపత్రిలో చేరారని మీడియా నివేదికలు తెలిపాయి. వాతావరణ మార్పుల కారణంగా ఆమె అస్వస్థతకు గురయ్యారని, వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. వైద్యుల బృందం ఆమెకు చికిత్స అందిస్తోంది.
సోనియా గాంధీ త్వరగా కోలుకోవాలని పలువురు రాజకీయ నేతలు, కాంగ్రెస్ అభిమానులు పోస్టులు పెడుతున్నారు. ఆసుపత్రి బెడ్ మీద సోనియా గాంధీ పడుకుని ఉండగా ఆమె పక్కన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా ఉన్నట్లు కొన్ని పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి.
వైరల్ పోస్టులకు సంబంధించిన ఆర్కైవ్ లింక్స్ ను ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు
వైరల్ స్క్రీన్ షాట్ ఇక్కడ ఉంది
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న ఫోటోలు నిజమైనవి కావు. ఏఐ ద్వారా సృష్టించారు
వైరల్ ఫోటోలను నిజంగా పబ్లిష్ చేశారా? అని తెలుసుకోవడం మేము కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తదితరుల సోషల్ మీడియా ఖాతాలను నిశితంగా పరిశీలించాం. అయితే అలాంటిది ఏమీ లేదని కనుగొన్నాం.
సోనియా గాంధీ ఆరోగ్యానికి సంబంధించిన మీడియా కథనాలను మేము పరిశీలించాం. వాటిలో ఎక్కడా కూడా ఈ ఫోటోలను పబ్లిష్ చేయలేదు. ఆ కథనాలను ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.
79 ఏళ్ల సోనియా గాంధీకి జ్వరం రావడంతో మార్చి 24, మంగళవారం రాత్రి సుమారు 10:22 గంటలకు సర్ గంగా రామ్ ఆసుపత్రిలో చేరారు. ఆసుపత్రి ఛైర్మన్ అజయ్ స్వరూప్ మాట్లాడుతూ సోనియా గాంధీ ఆరోగ్యం 'చాలా మెరుగుపడింది', ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతోంది, ఆమె సౌకర్యవంతంగా ఉన్నారని తెలిపారు. "ఆమె అటూ ఇటూ నడుస్తున్నారు, అల్పాహారం తీసుకున్నారు. మొత్తంమీద, ఆమె పురోగతి సజావుగా ఉంది, ఒకటి రెండు రోజుల్లో ఆమెను డిశ్చార్జ్ చేయడానికి వీలవుతుందని మేము ఆశిస్తున్నాము," అని ఆయన వెల్లడించారు.
గత ఏడాది జూన్లో, ఆమె తన కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రాతో కలిసి వ్యక్తిగత పర్యటనలో ఉన్నప్పుడు, అధిక రక్తపోటు కారణంగా ఆమెను సిమ్లాలోని ఇందిరా గాంధీ మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత ఆమె కోలుకున్నారు.
ఇక సోనియా గాంధీకి సంబంధించిన ఏ ఫోటోలు నిజమా కాదా అని తెలుసుకోవడం కోసం ఏఐ టూల్స్ ను అడిగాం. "2026 మార్చి 24న సోనియా గాంధీ ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆసుపత్రిలో చేరిన మాట నిజమే అయినప్పటికీ, ఆసుపత్రి పడకపై ఆమె ఉండగా పక్కనే రాహుల్, ప్రియాంక గాంధీలు ఉన్నట్లు మీరు చూస్తున్న నిర్దిష్ట చిత్రాలు ఏఐ (AI) ద్వారా సృష్టించబడినవి." అంటూ జెమిని ఏఐ టూల్ తెలిపింది. అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ఇక్కడ ఉంది.
ఇక మేము హైవ్ ఏఐ డిటెక్షన్ టూల్ ను కూడా వైరల్ ఫోటోలు నిజమా కాదా అని తెలుసుకోడానికి ప్రయత్నించాం. అందులో ఎలాంటి నిజం లేదని, ఏఐ ద్వారా సృష్టించినట్లుగా ధృవీకరించింది.
కాబట్టి, వైరల్ అవుతున్న ఫోటోలు ఏఐ ద్వారా సృష్టించారు. సోనియా గాంధీ ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆసుపత్రిలో చేరిన మాట నిజమే అయినప్పటికీ, ఆసుపత్రి పడకపై ఆమె ఉండగా పక్కనే రాహుల్, ప్రియాంక గాంధీలు ఉన్న ఫోటోలను ఏఐ ద్వారా సృష్టించారు.
Claim : ఏఐ ద్వారా సృష్టించిన ఫోటోలను సోనియా గాంధీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న నిజమైన
Claimed By : Social Media Users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Social Media
Fact Check : False
Next Story

