Mon Jan 19 2026 13:52:06 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: ఆపి ఉన్న రైలును పిల్లలు ధ్వంసం చేస్తున్న వీడియో భారతదేశానికి చెందినది కాదు
ఆపి ఉన్న రైలును పిల్లలు ధ్వంసం చేస్తున్నట్లు చూపించే వీడియో సోషల్ మీడియాలో

Claim :
ఆపి ఉన్న రైలును పిల్లలు ధ్వంసం చేస్తున్న వీడియో భారతదేశానికి చెందినదిFact :
ఈ వీడియో బంగ్లాదేశ్ లో చోటు చేసుకుంది. ఎలాంటి మతపరమైన కోణం లేదు
ఆపి ఉన్న రైలును పిల్లలు ధ్వంసం చేస్తున్నట్లు చూపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పలువురు పిల్లలు ఇంజిన్‌పై నిలబడి ఉన్నట్లు కూడా కనిపిస్తుంది. ఈ సంఘటన భారతదేశంలో జరిగిందని, ఓ మతానికి చెందిన పిల్లలు రైలును ధ్వంసం చేయడంలో పాల్గొన్నారని పేర్కొంటూ ఈ వీడియో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
'సరిహద్దు అవతల ఉన్న పాకిస్తాన్ కి మనం భయపడాల్సిన అవసరం లేదు. కానీ భారతదేశంలోని వేలాది మినీ-పాకిస్తాన్ లకు మనం భయపడాలి. ఈ జిహాదీ పిల్లవాడు ఏమి చేస్తున్నాడో చూడండి. అతని మతం అతనికి నేర్పేది ఇదే - ఉగ్రవాదం, అత్యాచారం, పేలుళ్లు' అనే అర్థం వచ్చేలా పోస్టులు పెట్టారు.
వైరల్ అవుతున్న పోస్టుకు సంబంధించిన లింక్ ను ఇక్కడ చూడొచ్చు
ఆర్కైవ్ లింక్ ను కూడా ఇక్కడ చూడొచ్చు
ఫ్యాక్ట్ చెకింగ్:
రైలుపై పిల్లలు రాళ్ళు రువ్వుతున్న వైరల్ వీడియో భారతదేశం లో చోటు చేసుకున్నది కాదు. ఈ ఫుటేజ్ బంగ్లాదేశ్‌లో రికార్డ్ చేశారు.
వీడియో మూలాన్ని ధృవీకరించడానికి, వైరల్ క్లిప్ నుండి కీఫ్రేమ్‌లను ఉపయోగించి రివర్స్ ఇమేజ్ సెర్చ్ నిర్వహించాం. డిసెంబర్ 28, 2025న AL Amin Babukhali అనే ఫేస్బుక్ పేజీలో ఇలాంటి వీడియో అప్లోడ్ చేశారు. పోస్ట్ వివరణలో వీడియో కమలాపూర్‌లో చిత్రీకరించినట్లుగా స్పష్టంగా తెలుస్తోంది.
కమలాపూర్ బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఉన్న ఒక ప్రధాన రైల్వే స్టేషన్. వైరల్ పోస్ట్‌లలో పేర్కొన్నట్లుగా, ఈ వీడియో భారతదేశంలో కాకుండా బంగ్లాదేశ్‌లో రికార్డు చేసినట్లుగా ఇది సూచిస్తుంది.
వీడియోలో కనిపించే రైలును నిశితంగా పరిశీలిస్తే.. క్యారేజ్‌లో "BR" అక్షరాలు ఉన్నాయి, ఇది బంగ్లాదేశ్ రైల్వేను సూచిస్తుంది. సాధారణంగా జాతీయ రైలు సేవ ద్వారా నిర్వహించే రైళ్లపై దీన్ని ఉంచుతారు. అదనంగా, రైలు మీద బెంగాలీ టెక్స్ట్ కనిపిస్తుంది, ఇందులో "షోవన్" అనే పదం "...ter-City" అని ఉన్న అక్షరాలు ఉన్నాయి, ఇది రైలు ఇంటర్-సిటీ సర్వీస్‌లో భాగం కావచ్చునని సూచిస్తుంది.
బంగ్లాదేశ్ రైళ్ల చిత్రాలను వైరల్ వీడియోలో చూపిన చిత్రాలతో పోల్చి చూశాము. డిజైన్, నిర్మాణం, గుర్తులు, “BR” లోగో, “ఇంటర్ సిటీ” టెక్స్ట్‌తో సహా, దగ్గరగా సరిపోలుతున్నాయి. రైలు బంగ్లాదేశ్ రైల్వేకు చెందినదని నిర్ధారిస్తుంది.
“షోవన్” అనే పదంపై విచారణలో, ఇది బంగ్లాదేశ్ రైళ్లలో ఉపయోగించే ఒక నిర్దిష్ట రకం కోచ్‌ను సూచిస్తుందని తేలింది. ఈ కోచ్‌లు సాధారణంగా బెంచ్-స్టైల్ సీటింగ్‌ను అమర్చబడి ఉంటాయి. వీటిని సాధారణంగా మెయిల్, ఇంటర్-సిటీ రైళ్లలో ఉపయోగిస్తారు.
పిల్లలు రైలును ధ్వంసం చేస్తున్న వైరల్ వీడియో భారతదేశంలో చోటు చేసుకుంది కాదు. ఇది బంగ్లాదేశ్ నుండి వచ్చింది. వీడియోతో పాటు చేసిన మతపరమైన వాదనల్లో ఎలాంటి నిజం లేదు.
Claim : ఈ వీడియో బంగ్లాదేశ్ లో చోటు చేసుకుంది. ఎలాంటి మతపరమైన కోణం లేదు
Claimed By : Social Media Users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Social Media
Fact Check : False
Next Story

