Sun Dec 08 2024 03:12:16 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: 1000 సంవత్సరాల వయసు ఉన్న చెట్టుకు సహజంగా జంతువుల ముఖాలు వచ్చాయంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి సంబంధం లేదు.
1000 సంవత్సరాల వయసు ఉన్న వృక్షానికి సహజంగా జంతువుల ముఖాలు
Claim :
1000 సంవత్సరాల వయసు ఉన్న వృక్షానికి సహజంగా జంతువుల ముఖాలు ఏర్పడ్డాయిFact :
అది ఓ థీమ్ పార్క్ లోని చెట్టు. కళాకారులు కృతిమ పదార్థాలను ఉపయోగించి ఆ చెట్టు కింద భాగంలో జంతువుల ముఖాలను తీర్చిదిద్దారు
మనం పీల్చే గాలిని శుద్ధి చేయడం నుండి లెక్కలేనన్ని జీవ జాతులకు ఆశ్రయం, ఆహారాన్ని అందించడం వరకూ చెట్లు మన భూగ్రహానికి ఎంతో మేలు చేస్తాయి. మన దైనందిన జీవితాన్ని గడుపుతున్నప్పుడు, చెట్లు మనకు అందించే ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తాయి. భూమిపై జీవాన్ని నిలబెట్టడంలో అవి కీలక పాత్ర పోషిస్తాయి.
చెట్లు కార్బన్ డై ఆక్సైడ్‌ను పీల్చుకోవడం ద్వారా గాలిని శుభ్రపరచడంలో సహాయపడతాయి. వాతావరణ మార్పులతో పోరాడటానికి సహాయపడే కార్బన్‌ను నిల్వ చేయడంలో అడవులు ఎంతో గొప్ప పని చేస్తుంటాయి. వివిధ రకాల చెట్లను నాటడం ద్వారా, మనం పర్యావరణ వ్యవస్థలను కాపాడుకోవచ్చు. అడవులు అనేక జీవులకు ఆవాసాలను అందించడం ద్వారా జీవవైవిధ్యానికి తోడ్పడతాయి. పర్యావరణ వ్యవస్థ సమతుల్యతను కాపాడుకోవచ్చు. చెట్లు నేల కోతకు గురవ్వకుండా నిరోధిస్తాయి. చెట్ల ఆకులు సేంద్రియ పదార్థాలుగా మారి భూమి సారం పెరగడానికి తోడ్పడుతాయి.
భారతదేశంలో ఎన్నో రకాల చెట్లను, మొక్కలను పూజిస్తారు. ఎన్నో ఏళ్ల నాటి చెట్లు కూడా భారతదేశంలో ఉన్నాయి. ప్రపంచ రికార్డు సాధించిన భారీ వృక్షాలను కూడా మనం చూశాం.
అయితే ఓ చెట్టుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఆ చెట్టుకు కింద భాగంలో జంతువుల తలలు ఉండడం ఆ వీడియోలో చూడొచ్చు. ఆ వీడియోను షేర్ చేస్తున్న వ్యక్తులు సహజంగా చెట్టు కింద భాగంగా పలు జంతువుల తలలు ఏర్పడ్డాయంటూ ప్రచారం చేస్తూ ఉన్నారు. ఆ చెట్టు వయసు 1000 సంవత్సరాల పైగానే అంటూ కూడా ప్రచారం చేస్తున్నారు.
"1000 సంవత్సరాల వయసు ఉన్నా ఈ చెట్టు కు ఉన్న వేళ్ళకు 101 జంతువుల రూప రేఖల నమూనాలు" అంటూ పోస్టులు పెడుతున్నారు.

ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఆ జంతువుల రూపు రేఖలు సహజంగా ఏర్పడినవి కావు. ఇక ఆ చెట్టు వయసు 1000 సంవత్సరాలకు పైగా అంటూ జరుగుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
వైరల్ అవుతున్న వీడియోకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ను తీసుకుని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా మాకు ఈ చెట్టుకు సంబంధించిన పలు వీడియోలు లభించాయి.
ఈ చెట్టు తమిళనాడు రాష్ట్రంలో ఉందని మేము ధృవీకరించాం. యార్కాడ్ పట్టణంలోని స్కై పార్క్ థీమ్ పార్క్ లో ఉందని పలు వీడియోలను గుర్తించాం.
ఈ థీమ్ పార్క్ చిరునామా ఫిర్స్ ఎస్టేట్, పగోడా పాయింట్ రోడ్, ఏర్కాడ్, తమిళ్ నాడు 636601, ఇండియా అని ఉంది.
మేము థీమ్ పార్క్ అఫీషియల్ వెబ్ సైట్ ను కూడా కనుగొన్నాం. https://skyparkyercaud.in/
ఈ చెట్టు మానవ సృజనాత్మకతకు, కళాత్మకతకు నిదర్శనం అంటూ వివరించారు. ఆ చెట్టు బెరడులో 100 కంటే ఎక్కువ జంతువులను చెక్కినట్లు వివరించారు. పిల్లలు ఈ చెట్టును చూడడానికి ఆసక్తిని కనబరుస్తారని, ప్రత్యేకించి చెట్టును బాగా పరిశీలించి, అందులో దాగి ఉన్న వివిధ జంతు శిల్పాలను కనుగొనడానికి ఎంతో ఉత్సాహాన్ని ప్రదర్శిస్తారంటూ నిర్వాహకులు తెలిపారు. ఈ విశిష్టమైన, ఆహ్లాదకరమైన అనుభవం కేవలం వినోదాన్ని మాత్రమే కాకుండా జంతు జీవుల వైవిధ్యం, దానిని రక్షించడానికి పరిరక్షణ ప్రయత్నాల ప్రాముఖ్యతపై సమాచారాన్ని అందిస్తుందని స్పష్టం చేశారు.
దీన్ని బట్టి ఈ జంతువుల బొమ్మలు కళాకారుల సృష్టి అని స్పష్టం అవుతోంది.
ఇక ఈ చెట్టు వయసును నిర్ధారించడానికి తాము థీమ్ పార్క్ నిర్వాహకులను సంప్రదించగా.. సోషల్ మీడియాలో 1000 సంవత్సరాల చెట్టు అంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని తెలిపారు. ఇది బ్రిటీష్ కాలం నాటిదని వివరించారు. పలు కృత్రిమ పదార్థాలను ఉపయోగించి జంతువుల బొమ్మలు చెట్టుకు ఉంచేలా సృష్టించామని వివరించారు.
ఈ వైరల్ వాదనను ఖండిస్తూ పలు ఫ్యాక్ట్ చెక్ సంస్థలు కూడా కథనాలను ప్రచురించాయి. అవి ఇక్కడ చూడొచ్చు.
కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim : 1000 సంవత్సరాల వయసు ఉన్న వృక్షానికి సహజంగా జంతువుల ముఖాలు ఏర్పడ్డాయి
Claimed By : social media users
Claim Reviewed By : Telugupost
Claim Source : social media
Fact Check : False
Next Story