Thu Mar 19 2026 15:51:21 GMT+0530 (India Standard Time)
ఫ్యాక్ట్ చెక్: 2022లో చోటు చేసుకున్న ఘటనను ఇటీవలి కాలంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులకు సంబంధించిన వీడియో అంటూ వైరల్ చేస్తున్నారు
కృష్ణా జిల్లాలో లంచం తీసుకొని.. ఆవులని తరలిస్తున్న లారీని వదిలేసిన పోలీస్

Claim :
ఆంధ్రప్రదేశ్ పోలీసులు గో స్మగ్లర్ల నుంచి ముడుపులు తీసుకుని వదిలిపెట్టేశారుFact :
2022 వ సంవత్సరం జూన్ నెలలో చోటు చేసుకున్న ఘటనకు సంబంధించిన విజువల్స్ ఇవి
తెలుగు రాష్ట్రాల్లో గోవధ నిరోధక, జంతు సంరక్షణ చట్టం అమలులో ఉంది. గోవధను అరికట్టేందుకు ఈ చట్టాలను తీసుకుని వచ్చారు. వరైనా గోవును వధిస్తే వారికి జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించే అవకాశాలు ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో గోవులను , దూడలను ఎట్టి పరిస్థితులలో చంపకూడదు. ఎద్దు, దున్న, గేదె మొదలైనవాటిని చంపాలంటే , వాటి వయస్సు ఖచ్చితంగా 14 సంవత్సరాలు దాటి వుండాలి, అలాగే వ్యవసాయానికి, బ్రీడ్ డెవలప్మెంటకి పూర్తిగా నిరుపయోగంగా వున్నాయని, ప్రభుత్వము నియమించిన పశు వైద్యుడు సర్టిఫికేట్ ఇవ్వాలి. ప్రభుత్వ వైద్యుడి సర్టిఫికేట్ ఉన్నప్పటికీ, వాటిని ప్రభుత్వ అనుమతి వున్న కబేళాలలో మాత్రమే వధించాలి. గోవధ అనేది కూడా కాగ్నిజబుల్ నేరం కింద వస్తుంది కావున గో వధ చేసే రవాణాని అడ్డుకునే హక్కు ప్రతి ఒక్క పౌరుడికి ఉంది. ఆ తర్వాత పోలీస్ వాళ్లకు అప్పగించాలి. గోవులను గాలి ఆడకుండా, రక్తం వచ్చేటట్టు కట్టేయడం, ఓవర్ లోడ్ చేస్తూ, నొప్పులతో ఇబ్బంది పెడుతూ తీసుకెళ్లడం నేరం
పశువుల రవాణాకు సంబంధించిన నియమాలను చూస్తే ఒక లారీలో 6 కంటే ఎక్కువ పశువులను రవాణా చేయకూడదు. ఈ 6 కూడా రవాణా చేస్తున్న సమయములో, పశువైద్యుడి ధ్రువపత్రాన్ని కలిగి వుండాలి. వాహనములో పశువులతోబాటు, వాటి బాగోగులు చూసుకునే వ్యక్తి వుండాలి. ప్రధమ చికిత్స పెట్టె వుండాలి. మేత, నీరు వుండాలి. మూసివేయబడి ఉన్న వాహనాలో పశువులను తరలించకూడదు. అక్రమ గోవుల రవాణా వాహనాలు మనకు కనబడగానే వాటిని ఆపి 100 కి కాల్ చేసి, పోలీస్ వారికి తప్పనిసరిగా సమాచారాన్ని ఇవ్వాలి.
పోలీస్ వాళ్లు పట్టుకున్న గోవులను, సురక్షితంగా రిజిస్టర్ అయినా గోశాలకు తరలించాలి.
అయితే కొందరు పోలీసులు లంచం తీసుకుని గోవులను వదిలేశారంటూ కొన్ని పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
"కృష్ణా జిల్లాలో లంచం తీసుకొని.. ఆవులని తరలిస్తున్న లారీని వదిలేసిన పోలీస్" అంటూ ఓ వీడియో వైరల్ అవుతూ ఉంది.
వైరల్ వీడియోకు సంబంధించిన ఆర్కైవ్ లింక్స్ ను ఇక్కడ చూడొచ్చు
అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ఇక్కడ ఉంది.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉంది. ఈ విజువల్స్ 2022 నుండి ఆన్ లైన్ లో అందుబాటులో ఉన్నాయి.
వైరల్ వీడియోలోని స్క్రీన్ షాట్ ను తీసుకుని మేము గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాం. 2022 జూన్ 8న indiaxpressnews.com లో వచ్చిన లింక్ మాకు లభించింది. వైరల్ వీడియో లోని ఘటనకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఈ కథనంలో చూడొచ్చు.
మా తదుపరి పరిశోధనలో "ఖాకీల కలెక్షన్" అంటూ 2022లో ABN ఆంధ్రజ్యోతి కథనం కూడా మాకు కనిపించింది.
https://www.andhrajyothy.com/2022/andhra-pradesh/visakhapatnam/police-collectionngtsandhrapradesh-710243.html
"జాతీయ రహదారిపై పశువులను రవాణా చేసే వాహనదారుల నుంచి హైవే పెట్రోలింగ్ పోలీసులు కాసులు దండుకుంటున్నారు. నక్కపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో ఈ దందా అధికంగా జరుగుతున్నట్టు ఓ వీడియో ద్వారా గుర్తించిన పోలీసు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఏఎస్ఐ, హోంగార్డులను జిల్లా కేంద్రానికి పిలిపించి మందలించడంతోపాటు ఏఆర్‌కు బదిలీ చేశారు." అంటూ ఆ కథనంలో తెలిపారు.
ఇక ఈ వైరల్ వీడియోపై ఏపీ ఫ్యాక్ట్ చెక్ విభాగం కూడా స్పందించింది. "ఆంధ్రప్రదేశ్ పోలీసులు గో స్మగ్లర్ల నుంచి ముడుపులు తీసుకుంటున్నారని ఒక ఫొటోను, వీడియోను చూపిస్తూ కొన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్ లో, ఒక న్యూస్ ఛానెల్ లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. వాస్తవాలను పరిశీలిస్తే వారు ప్రచారం చేస్తున్న ఫొటో, వీడియో, దానికి సంబంధించిన వార్త 09- 06- 2022 నాడు అన్ని జాతీయ, ప్రాంతీయ తెలుగు, ఇంగ్లీషు వార్తా పత్రికలలో వచ్చినది. 2022 వ సంవత్సరం జూన్ 6వ తేదీన అడ్డరోడ్డు నుంచి తుని వైపు వెళ్లే మార్గంలో నక్కపల్లి దుర్గాదేవి ఆలయానికి సమీపంలో హైవే పెట్రోలింగ్ సిబ్బంది నిలబడి, పశువుల రవాణా వాహనాల నుంచి డబ్బులు తీసుకుంటున్న వీడియా అది. అప్పటి వార్తకు సంబంధించిన ఫొటోను, వీడియోను ఇప్పుడు జరుగుతున్నట్లుగా ప్రచారం చేయడం నేరపూరిత చర్య. 09- 06- 2022 నాడు జరిగిన సంఘటనపై వక్రీకరించి తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది." అంటూ సోషల్ మీడియాలో వివరించారు.

వైరల్ అవుతున్న వీడియోను తెలుగు పోస్ట్ స్వతంత్రంగా ధృవీకరించలేకపోయినప్పటికీ వైరల్ వీడియో 2022 నుండి ఆన్ లైన్ లో ఉందని సాక్ష్యాలను సంపాదించింది.
కాబట్టి, వైరల్ అవుతున్న విజువల్స్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉన్నాయి.
Claim : 2022 వ సంవత్సరం జూన్ నెలలో చోటు చేసుకున్న ఘటన
Claimed By : Social Media Users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Social Media
Fact Check : False
Next Story