ఫ్యాక్ట్ చెక్: అఫిలియన్ కాలంలో వాతావరణ మార్పులు వస్తాయని వైరల్ అవుతున్న సందేశం నిజం కాదు
వర్షం పడినప్పుడు, అధిక తేమ వల్ల, మేఘాలు సూర్యకాంతిని ఆపడం వల్ల సాధారణంగా ఉష్ణోగ్రతలు తగ్గిపోతుంటాయి. ప్రధానంగా భారత

Claim :
‘అఫిలియన్ ఫినామినన్’ భూమి సూర్యుని మధ్య దూరం పెరగడం వల్ల వాతావరణాన్ని చల్లగా మారుస్తోందిFact :
అఫిలియన్ కాలంలో ఉష్ణోగ్రత లు సాధారణం కంటే తక్కువ నమోదు అవుతాయి అనేది అబద్దం
భారత దేశం లో అత్యధికంగా వర్షాలు పడి నదులూ, వాగులూ ఉప్పొంగుతుండడంతో ప్రజలు తివ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, దీనితో పాటు ఉష్ణోగ్రతలు కూడా తగ్గడంతో చాలా మంది భయానికి లేను అవుతున్నారు. వర్షం పడినప్పుడు, అధిక తేమ వల్ల, మేఘాలు సూర్యకాంతిని ఆపడం వల్ల సాధారణంగా ఉష్ణోగ్రతలు తగ్గిపోతుంటాయి. ప్రధానంగా భారతదేశంలో జూన్ నుండి సెప్టెంబర్ వరకు వచ్చే మోన్సూన్ సీజన్ సమయంలో ఇలాంటి ప్రక్రియ కనిపిస్తుంటుంది.
ఇంతలో, 'అఫిలియన్ ఫినామినన్' అనే ప్రక్రియ ప్రారంభమైందనీ, ఆగస్ట్ 22 వరకు ఇది కొనసాగుతుందనీ, దీని ప్రభావం వల్ల భూమి పైన సాధారణం కంటే తక్కువ ఉష్ణొగ్రతలు నమోదు అవుతాయనీ పొస్టులు పెడ్తున్నారు సోషల్ మీడియ యూజర్లు. సూర్యుడికీ, భూమికీ మధ్య సాధారణ దూరం 90,00,00,000 కిలోమీటర్లు, కానీ ఈ కాలంలో దూరం 66% పెరిగి 152,00,00,000 కిలోమీటర్లవుతుంది" అని కూడా ఈ పొస్టులలో ఉండడం మనం చూడొచ్చు. ఈ సందేశం వాట్సాప్ సహా ఇతర సోషల్ మీడియా వేదికల్లో విస్తృతంగా షేర్ అవుతోంది.
వైరల్ వాట్సాప్ పోస్ట్ స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు
ఫ్యాక్ట్ చెక్:
ఈ క్లెయిమ్ నిజం కాదు. అఫిలియన్ సందర్భంగా భూమి చేసిన దూర మార్పులు అనుకున్నంతగా ఉష్ణోగ్రతలకు ఎలాంటి ప్రభావం చూపవు.
ఫొర్బ్స్ లో ప్రచురించిన వ్యాసం ప్రకారం, జూలై 3, 2025 'అఫిలియన్ డే'. అఫిలియన్ నాడు భూమి సూర్యునికి అత్యంత దూరంగా ఉంటుంది. దీంతో సూర్యుడు కొంత చిన్నగా కనిపించవచ్చు కానీ, నిజానికి తక్కువ రేడియేషన్ చేరడం గాననీ, ఉష్ణోగ్రతలపై ప్రభావం చూపడం గానీ 5-6 శాతం కంటే తక్కువగా ఉంటుంది.
Capeargus పత్రిక ప్రకారం, అఫిలియన్ సమయంలో భూమి సుమారు 152 మిలియన్ కిలోమీటర్లు దూరంలో ఉంటుంది. పెరిహీలియన్లో (భూమి అత్యంత సమీపంలో ఉన్నప్పటి) దూరం 147 మిలియన్ కిలోమీటర్లు. ఈ తేడా వల్ల భూమి పైకి వచ్చే సూర్యకాంతిలో చాలా తక్కువ వ్యత్యాసం ఉంటుంది
భూమి పై ఉండే ఉష్ణోగ్రతల కు ప్రధాన కారణం సూర్యుడి నుంచి దూరం కాదు, భూమికి 23.5 డిగ్రీల వంపు లేదా భూమి అక్షాంశం ఉండడమే. ఇది ఉత్తర, దక్షిణార్థగోళాలలో వేరు వేరు కాలాలను, ఉష్ణోగ్రత మార్పులను కలిగిస్తుంది. ఉత్తరార్థగోళంలో జూన్లో వేసవికాలం, డిసెంబరులో చలికాలం ఉండడం దీని కారణమే.
న్యూయార్క్ టైమ్స్ ప్రకారం, భూమి చేసే చిన్న దూర మార్పులు వల్ల కొన్ని శాతం తక్కువ గానీ లేదా ఎక్కువగాని సూర్యకాంతి చేరుతుంది. అయితే అది ఉష్ణోగ్రతలను ప్రభావితం చేయదు.
ఈ ప్రక్రియ కూ సంబంధిన విషయాలను విపులంగా వివరించే వీడియోలను ఇక్కడ చూడోచ్చు
ఈ సందేశం 2022 సంవత్సరం నుంచే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అనేక ఫ్యాక్ట్ చెక్ సంస్థలు ఈ క్లెయిమ్ ను ఖండిస్తూ వ్యాసాలు రాసాయి, అవి ఇక్కడ చూడొచ్చు.
అఫిలియన్ సమయంలో భూమి-సూర్య దూరం ఉష్ణోగ్రతల పైన ప్రభావం చూపదు. నిజమైన కారణం భూమి అక్షానికి ఉన్న వంకర. ఆధునిక శాస్త్రీయ సమీక్ష ప్రకారం వైరల్ సందేశం నిజం కాదు.

