Sun Dec 08 2024 03:27:31 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: కూలి పని చేయడానికి నిరాకరించిన దళిత వ్యక్తికి గుండు చేసినవారు ఇతర జాతీయులు కాదు
ఝాన్సీలో చోటు చేసుకున్న ఒక షాకింగ్ సంఘటనలో, తమ వద్ద పని చేయడానికి నిరాకరించినందుకు ఒక వ్యక్తిని కట్టివేసి అతనికి
Claim :
కూలి పని పనిచేయడానికి నిరాకరించినందుకు శిక్షగా ఒక దళిత వ్యక్తికి ఇతర జాతీయులు గుండు కొట్టించారుFact :
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఆ వ్యక్తిని అవమానించిన వారు కూడా ఒకే వర్గానికి చెందినవారే
ఝాన్సీలో చోటు చేసుకున్న ఒక షాకింగ్ సంఘటనలో, తమ వద్ద పని చేయడానికి నిరాకరించినందుకు ఒక వ్యక్తిని కట్టివేసి అతనికి గుండుకొట్టారు. ఈ ఆందోళనకరమైన సంఘటన అక్టోబర్ 22, 2024న ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీలోని టకోరి గ్రామంలో జరిగింది. ఈ ఘటన జరుగుతుండగా చిత్రీకరించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో నెటిజన్లలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేస్తూ దాడికి పాల్పడిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కులతత్వం కారణంగానే ఈ ఘటన జరిగిందని, శూద్రుడు కావడంతో వివక్షకు గురయ్యాడంటూ సోషల్ మీడియాలో వీడియోను షేర్ చేస్తున్నారు.
ఈ వీడియో తో పాటు షేర్ అవుతున్న హిందీ క్యాప్షన్ ఇలా ఉంది “उत्तर प्रदेश झांसी के सीपरी बाजार थाना अन्तर्गत एक दलित का सिर इसलिए मुड़वाया गया, क्योंकि इसने बेगारी करने से मना कर दिया । इतना ही नहीं मारा-पीटा भी, पेड़ पर उल्टा लटकाया एवं सिर मुड़ाकर गांव में घुमाया भी। यही है जातिवाद का जहर ! यही है शूद्रों के साथ भेदभाव!”. “ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీలోని సిప్రి బజార్ పోలీస్ స్టేషన్లో, కూలి పని చేయడానికి నిరాకరించినందుకు దళితుడికి గుండు కొట్టించారు. అంతేకాకుండా అతన్ని కొట్టి, తలక్రిందులుగా వేలాడదీసి, ఊరంతా తిప్పారు. ఇదీ కులతత్వం అనే విషం! ఇది శూద్రుల పట్ల వివక్ష! " అంటూ పోస్టులను వైరల్ చేస్తున్నారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టించేది. ఈ ఘటనలో కుల కోణం లేదు.
వైరల్ వీడియో నుండి సంగ్రహించిన కీఫ్రేమ్లను తీసుకుని మేము గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాం. ఝాన్సీ పోలీసులు ఎక్స్ లో వైరల్ వీడియోపై ప్రతిస్పందించారని మేము కనుగొన్నాము.
పోలీసులు పంచుకున్న వివరాల ప్రకారం, ‘పోలీస్ స్టేషన్ సిప్రి బజార్ ప్రాంతంలో అందుకున్న వీడియోకు సంబంధించి, పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి చర్యలు తీసుకోవడం ప్రారంభించారు. సమాజంలోని ఒకే వర్గానికి చెందిన కొందరు వ్యక్తులు ఎటువంటి కారణం లేకుండా, 22.10.24న మధ్యాహ్నం 2.20 గంటల ప్రాంతంలో రాంనారాయణ్ కుమారుడు బాబా పోలీస్ స్టేషన్ సిప్రి బజార్లో ఫిర్యాదు చేశారు. అతన్ని కొట్టారు, దుర్భాషలాడారు, చంపేస్తామని బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అందిన ఫిర్యాదు ఆధారంగా నలుగురు నిందితులపై స్థానిక పోలీస్ స్టేషన్లో సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు వ్యక్తులు బాధితుడి జుట్టును కత్తిరించినట్లుగా ఉన్న వీడియో సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది. ఆ ఘటనపై కూడా కేసు నమోదు చేశాం. దర్యాప్తు కొనసాగుతోంది." అని తెలిపారు.
dnpindia.in ప్రకారం, గేదెకు మేత, పేడను సేకరించడానికి నిరాకరించినందుకు యుపిలోని ఝాన్సీలో ఒక కూలీపై క్రూరత్వ కేసు వెలుగులోకి వచ్చింది. బాధితుడిని మొదట చెట్టుకు తలకిందులుగా వేలాడదీసి దారుణంగా కొట్టారు. ఆ తర్వాత అతని చేతులు కట్టివేసి, గుండు చేయించారు. అతడిని గ్రామం మొత్తం ఊరేగించారని నివేదించింది. ఝాన్సీలోని సిప్రి బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామంలో నివసిస్తున్న కూలీని గేదెల పేడను సేకరించి తమ పొలాల్లో పని చేయమని అడిగారని ఆరోపించారు. అతను పనికి నిరాకరించడంతో, ఘోరంగా ప్రవర్తించారు.
ఝాన్సీ పోలీసులు పోస్ట్ చేసిన వీడియోను కూడా మేము కనుగొన్నాము, పోలీసు అధికారి రెండు వర్గాలు కూడా సమాజంలోని ఒకే సామాజిక వర్గానికి చెందినవారని పేర్కొన్నారు. ఈ ఘటనలో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి నలుగురిని అరెస్ట్ చేశారు.
ఒక వ్యక్తిని కొంతమంది వ్యక్తులు కొట్టడాన్ని చూపించే వైరల్ వీడియో, ఉన్నత కులాలకు చెందిన వారు చేసిన దాడి అంటూ జరుగుతున్న ప్రచారం తప్పుదారి పట్టిస్తోంది.
Claim : కూలి పని పనిచేయడానికి నిరాకరించినందుకు శిక్షగా ఒక దళిత వ్యక్తికి ఇతర జాతీయులు గుండు కొట్టించారు
Claimed By : Twitter user
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Twitter
Fact Check : Misleading
Next Story