ఫ్యాక్ట్ చెక్: ఢిల్లీ ఎన్నికల్లో ఓడిపోయినా కాంగ్రెస్ నేతలు ఆనందంలో చిందులేశారంటూ జరుగుతున్న ప్రచారం నిజం కాదు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 70 స్థానాలకు గానూ 48 స్థానాలను కైవసం చేసుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం

Claim :
2025 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత కాంగ్రెస్ నేతలు సంబరాలు చేసుకుంటునన్నారుFact :
2025 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ థీమ్ సాంగ్ లాంచ్ వేడుకను చూపించే వీడియో ఇది
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 70 స్థానాలకు గానూ 48 స్థానాలను కైవసం చేసుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం 22 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవలేదు. ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌తో సహా అన్ని జాతీయ రాజధాని ప్రాంత (NCR) రాష్ట్రాలను ఒకే పార్టీ పాలించడం నాలుగు దశాబ్దాలలో ఇదే మొదటిసారి.
క్లెయిం ఆర్కైవ్ లింక్ ఇక్కడ చూడొచ్చు.
ఫ్యాక్ట్ చెక్:
వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉంది.
మేము వీడియోను భాగస్వామ్యం చేసిన X పోస్ట్‌లలో ఒకదానిని తనిఖీ చేసినప్పుడు, MrSinha అనే X వినియోగదారు రాధికా ఖేరాకు వీడియో క్రెడిట్‌ని పంచుకున్నారు. రాధిక ఖేరా X ఖాతాలో వీడియో కోసం సెర్చ్ చేసినప్పుడు, ఆమె ఈ వీడియోను జనవరి 24, 2025న
“दिल्ली में 4.26% वोट वाली कांग्रेस का ‘भांगड़ा’ देख कर लगा, जैसे सियासी दफ्तर नहीं, ‘पागलखाने का वार्ड’ खुल गया हो! जिनकी राजनीति को जनता ने बार-बार नकारा, वो अब अपनी हार पर ही जश्न मनाने में मस्त हैं! कांग्रेस का नया नारा—‘हारो, नाचो, भूल जाओ!’” హిందీ క్యాప్షన్‌తో షేర్ చేసినట్లు మేము కనుగొన్నాము. ఢిల్లీలో 4.26% ఓట్లు పొందిన కాంగ్రెస్ నేతలు 'భాంగ్రా'ను చేస్తూ ఉండగా.. అది రాజకీయపార్టీ కార్యాలయం కాదు మానసిక వికలాంగుల కోసం తెరిచిన ఆఫీసులా అనిపించింది. వీరి రాజకీయాలను ప్రజలు పదే పదే తిరస్కరించారు, ఇప్పుడు కాంగ్రెస్ ఓటమిని సంబరాలు చేసుకోవడంలో బిజీగా ఉన్నారని అర్థం వచ్చే వాదనతో పోస్టు పెట్టారు.
News 24 ఎక్స్ హ్యాండిల్ లో కూడా వైరల్ వీడియోను షేర్ చేశారు. ఢిల్లీ కాంగ్రెస్ థీమ్ సాంగ్‌ను లాంఛ్ చేశారు అనే క్యాప్షన్‌తో నాయకులు పాటకు డ్యాన్స్ చేస్తున్న వీడియోను కూడా షేర్ చేశారు. రాగిణి నాయక్, అభయ్ దూబే, పవన్ ఖేరాతో సహా పలువురు కాంగ్రెస్ నేతలు ఎంతో ఉత్సాహంగా నృత్యాలు చేశారు.
“जीत हार से परे..कांग्रेस पार्टी ने ढोल नगाड़े के साथ दिल्ली विधानसभा चुनाव के लिए अपने "थीम सॉन्ग" को लॉन्च किया..पार्टी के वरिष्ठ नेताओं ने भी थीम सॉन्ग पर थिडक कर कार्यकर्ताओं का उत्साह बढ़ाया..” వంటి శీర్షికలతో ఈ వీడియో జనవరి 23, 2025న షేర్ చేశారు.
విజయం, ఓటమికి అతీతంగా కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం తన "థీమ్ సాంగ్" ను ప్రారంభించింది. పార్టీ సీనియర్ నాయకులు కూడా థీమ్ సాంగ్‌కు నృత్యం చేసి కార్యకర్తల మనోధైర్యాన్ని పెంచారు.
కాబట్టి, 2025 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత కాంగ్రెస్ నాయకులు డ్యాన్స్ చేస్తున్నారనే వాదన తప్పుదారి పట్టించేది. ఈ వీడియో జనవరి 23, 2025న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీ తన థీమ్ సాంగ్‌ను లాంఛ్ చేసినప్పుడు చిత్రీకరించారు.

