ఫ్యాక్ట్ చెక్: గుజరాత్లోని బిర్సా ముండా గిరిజన విశ్వవిద్యాలయం మేనేజ్మెంట్ SC/ST/OBC అభ్యర్థులకు అవకాశం ఇవ్వలేదనే వాదన నిజం కాదు
భారతదేశంలోని షెడ్యూల్డ్ కులాలు (SCలు), షెడ్యూల్డ్ తెగలు (STలు), ఇతర వెనుకబడిన తరగతులు (OBCలు) వాళ్లకు 15%, 7.5%, 27%

Claim :
గుజరాత్లోని బిర్సా ముండా గిరిజన విశ్వవిద్యాలయం మేనేజ్మెంట్ ఉద్యోగాలను ప్రకటించింది, వీటిలో ఏదీ SC/ST/OBC అభ్యర్థులకు ఇవ్వలేదు.Fact :
రిజర్వేషన్ నిబంధనలు వర్తించని ఒకే ఉద్యోగ ఖాళీకి సంబంధించిన ప్రకటన వచ్చింది.
భారతదేశంలోని షెడ్యూల్డ్ కులాలు (SCలు), షెడ్యూల్డ్ తెగలు (STలు), ఇతర వెనుకబడిన తరగతులు (OBCలు) వాళ్లకు 15%, 7.5%, 27% చొప్పున ఆల్ ఇండియా బేసిస్ బై ఓపెన్ కాంపిటీషన్ లో ప్రత్యక్ష నియామకాల విషయంలో రిజర్వేషన్లు అందిస్తారు. భారతదేశంలో రిజర్వేషన్ వ్యవస్థ అట్టడుగు వర్గాలను కలుపుకొనిపోవడాన్ని, ప్రోత్సహించడానికి, సమాన అవకాశాలను అందించడానికి రూపొందించారు. పాతకాలం నాటి కుల వ్యవస్థ కారణంగా సామాజిక, ఆర్థిక ప్రతికూలతలను ఎదుర్కొన్న సంఘాల బాగు కోసం రిజర్వేషన్లను తీసుకుని వచ్చారు. రిజర్వేషన్ల లక్ష్యం చారిత్రాత్మకంగా అట్టడుగున ఉన్న వర్గాలను ఉద్ధరించడం, వారికి విద్య, ఉపాధి, రాజకీయ ప్రాతినిధ్యంలో సమాన అవకాశాలు ఉండేలా చేయడమే. ప్రభుత్వ ఉద్యోగాలు, సంస్థలలో రిజర్వ్డ్ స్థానాలను అందించడం ద్వారా, ఆర్థికంగా వెనుకబడిన సమూహాలు ఆర్థిక స్థిరత్వాన్ని పొందేందుకు రిజర్వేషన్ సహాయపడుతుంది. శతాబ్దాలుగా SC, ST, OBC వర్గాలు ఎదుర్కొంటున్న సామాజిక బహిష్కరణ, వివక్షను ఎదుర్కోడానికి రిజర్వేషన్లు తీసుకొచ్చారు.

