ఫ్యాక్ట్ చెక్: భజరంగ్ దళ్ సభ్యులు మసీదుకు నిప్పు పెట్టారనే వాదన నిజం కాదు
పహల్గామ్లో ఉగ్రదాడి తర్వాత, భద్రతా కారణాల దృష్ట్యా జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం లోయలోని 50 పర్యాటక ప్రదేశాలు, ట్రెక్కింగ్

Claim :
బజరంగ్ దళ్ సభ్యులు ఒక మసీదుకు నిప్పు పెట్టారని వైరల్ వీడియో చూపిస్తుందిFact :
వీడియోలో ఉన్నది అగ్ని ప్రమాదం కారణంగా తగలబడుతున్న ఫంక్షన్ హాల్
పహల్గామ్లో ఉగ్రదాడి తర్వాత, భద్రతా కారణాల దృష్ట్యా జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం లోయలోని 50 పర్యాటక ప్రదేశాలు, ట్రెక్కింగ్ మార్గాలను మూసివేసింది. పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య భారతదేశం కీలక నిర్ణయాలు తీసుకుంది. పాకిస్తాన్ విమానయాన సంస్థలు తన గగనతలాన్ని ఉపయోగించకుండా నిషేధించింది. ఈ చర్య పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌ను ప్రభావితం చేస్తుందని భావిస్తున్నారు. పలు విమానాలకు సంబంధించి కనెక్టివిటీలో అంతరాయాలు ఏర్పడతాయి. భారత సైనిక అధికారులు ఉగ్రవాదుల ఇళ్లను కూల్చివేసి, దర్యాప్తు కొనసాగుతూ ఉంది. ప్రశ్నించడానికి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. నియంత్రణ రేఖ (LOC) వెంబడి కాల్పుల విరమణ ఉల్లంఘనలకు ఓ వైపు పాకిస్తాన్ తూట్లు పొడుస్తూ ఉండగా, భారత్ కూడా గట్టి హెచ్చరికలను పంపింది. ఈ సమస్యను హైలైట్ చేయడానికి అంతర్జాతీయ సమాజంతో కలిసి పనిచేస్తూ భారతదేశం దృఢమైన వైఖరిని ప్రదర్శిస్తోంది.

