ఫ్యాక్ట్ చెక్: ఆపరేషన్ సిందూర్‌లో 250 మంది భారత సైనికుల ప్రాణాలు కోల్పోయారని భారత సైన్యాధ్యక్షుడు చెప్పలేదు
జనరల్ ఉపేంద్ర ద్వివేది, PVSM AVSM (జననం 1 జూలై 1964) భారత సైన్యంలో ఫోర్-స్టార్ జనరల్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తూ

Claim :
ఆపరేషన్ సిందూర్‌లో 250 మందికి పైగా భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారని భారత సైన్యాధ్యక్షుడు అంగీకరించారుFact :
వైరల్ వీడియోను డిజిటల్‌గా ఎడిట్ చేశారు. భారత ఆర్మీ చీఫ్ అలాంటి ప్రకటన చేయలేదు
జనరల్ ఉపేంద్ర ద్వివేది, PVSM AVSM (జననం 1 జూలై 1964) భారత సైన్యంలో ఫోర్-స్టార్ జనరల్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తూ ఉన్నారు. ఆయన ప్రస్తుత, 30వ ఆర్మీ స్టాఫ్ చీఫ్. జనరల్ మనోజ్ పాండే స్థానంలో ఆయన 30వ COASగా జూన్ 30, 2024న బాధ్యతలు స్వీకరించారు. ఆయన 46వ వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. ద్రాస్‌లో జరిగిన విజయ్ దివస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఆపరేషన్ సింధూర్ తో పాకిస్థాన్‌కు సందేశం ఇచ్చామని, అలాగే పెహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిచర్య అని ఆయన అన్నారు. పెహల్గామ్ ఉగ్రదాడి భారత్‌కు తీవ్ర గాయాన్ని ఏర్పర్చిందని, అయితే ఈసారి ఇండియా బాధపడడమే కాదు, ఆ చర్యకు ప్రతీకార చర్యను కూడా చూపించిందన్నారు. 1999 నాటి కార్గిల్ యుద్ధ గాధలు వినేందుకు క్యూఆర్ కోడ్ ఆడియో గేట్‌వేను కూడా ఆయన ప్రారంభించారు. ఇండస్ వ్యూవ్ పాయింట్ అనే ప్రాజెక్టును కూడా లాంచ్ చేశారు. దీని వల్ల విజిటర్స్ ఎల్వోసీ వద్దకు వెళ్లవచ్చు. బటాలిక్ సెక్టార్‌లోని ఎల్వోసీ ప్రాంతాన్ని ఇండస్ వ్యూవ్‌పాయింట్‌తో చూడవచ్చు. కార్గిల్ యుద్ధ సమయంలో బటాలిక్ ప్రాంతం కీలకంగా నిలిచింది. ఇది సుమారు పది వేల అడుగుల ఎత్తులో ఉంది. భారత సైన్యాధ్యక్షుడు జనరల్ ఉపేంద్ర ద్వివేది, ద్రాస్‌లోని కార్గిల్ విజయ్ దివాస్ స్మారకోత్సవాల సందర్భంగా సైన్యం ఆధునీకరణ కార్యక్రమాన్ని కూడా ప్రకటించారు. రాబోయే దశాబ్దాలలో భారత సైన్యం మరింత గొప్పగా మారుతుందని స్పష్టం చేశారు.

